ఆందోళనలో ఫీల్డ్‌అసిస్టెంట్లు
- లక్ష్యం చేరుకోకుంటే విధుల నుంచి తొలగింపు
- కూలీలపై ప్రభావం
జగిత్యాల రూరల్ : ఉపాధిహామీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనపై సర్వత్రా భయాందోళన వ్యక్తమవుతుంది. లక్ష్యం చేరుకోకపోతే ఎలా అనే భయాందోళన లో ఫీల్డ్‌అసిస్టెంట్లు ఉన్నారు. సర్కిల్ నం బర్ 481లో పొందుపర్చిన 28 అంశాల నిబంధనలతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళ న చెందుతున్నారు. లక్ష్యాన్ని చేరుకోకపో తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించడంతో ఆందోళన చెందుతున్నారు.
ఏంటీ నిబంధన?
ఒక్కోఫీల్డ్ అసిస్టెంట్ 15 వేల పనిదినాలు కల్పించాలి. లేకుంటే వారిని విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. జిల్లాలోని 1207 గ్రామపంచాయతీలకు ప్రస్తుతం 880 మంది ఫీల్డ్‌అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం 6,56,543 జాబ్‌కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వీరు 27,870 గ్రూపులుగా పనిచేస్తున్నారు. ఒక్కో గ్రూపులో 12 నుంచి 25 మంది ఉన్నారు. రానున్న రోజుల్లో వీరందరికి పని కల్పించడం కష్టతరంగా మారనుంది. కోరిన వారికి పనికల్పించాలని పాత నిబంధన. దీంతో ఎవరు వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే వారి గ్రూప్ సభ్యులకు పని చూపెట్టేవారు ఫీల్డ్‌అసిస్టెంట్లు.
భయాందోళన
ప్రభుత్వం కొత్త నిబంధన తేవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగానికి ఎసరొచ్చింది. పనిదినాల లక్ష్యాన్ని చేరుకోలేని వారు ఉద్యోగం కోల్పోనున్నారు. ఈ ప్రభావం పరోక్షంగా కూలీలపై పడనుంది. ఒక గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్యం చేరుకోక ఉద్యోగం కోల్పోతే అక్కడి కూలీలకు పని కల్పించే వారు కరువు కానున్నారు. దీంతో గ్రామాల్లో ఎంపిక చేసిన పనుల నిర్వహణ కష్టతరంగా మారనుంది.
నిబంధనలు సడలించాలి
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సడలించాలి. గ్రామాల్లో కూలీలకు పనికల్పిస్తున్న తమను తొలగించడం అన్యాయం.
- పోతుగంటి వెంకటేశ్, ఫీల్డ్ అసిస్టెంట్, పొరండ్ల
తొలగింపునకు సన్నాహాలు
ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు నిబంధనలు తీసుకొస్తున్నారు. గ్రామాల్లోని కూలీలకు పని కల్పిస్తున్న మమ్ములను తొలగించడం సబబు కాదు.
- లక్ష్మీరాజం, ఫీల్డ్ అసిస్టెంట్, తిమ్మాపూర్
‘ఉపాధి’లో కొత్త నిబంధన భయం
Published Thu, Sep 18 2014 2:33 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement