
ప్రతీకాత్మక చిత్రం
అదే గ్రామానికి చెందిన యువకుడు తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. అదే గ్రామానికి చెందిన అతడి బంధువులు మరో ఎనిమిది మంది అతడిని పెళ్లి చేసుకోవాలని వేధించారు.
ధరూరు: తన కోరిక తీర్చాలంటూ ఓ వివాహితను వేధించడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో వేధించిన యువకుడితో పాటు సహకరించిన 8 మందిపై కేసు నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా రేవులపల్లి ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. మండలంలోని మార్లబీడుకు చెందిన రేణుక (20)కు కొన్ని నెలల కిందట జాంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది.
చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి
ఈ క్రమంలో ఈనెల 25వ తేదీన వ్యవసాయ పొలానికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న రేణుకను అదే గ్రామానికి చెందిన గాళ్ల వీరేశ్ తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. అదే గ్రామానికి చెందిన వీరేశ్ బంధువులు మరో ఎనిమిది మంది వీరేశ్‌ను పెళ్లి చేసుకోవాలని వేధించారు. దీంతో 26న ఆమె తన పుట్టింటికి మార్లబీడు వెళ్లింది. తీవ్ర మనస్తాపంతో 28న రేణుక మంగళవారం మార్లబీడులో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కర్నూలులోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రేవులపల్లి ఎస్‌ఐ రవి తెలిపారు.
చదవండి: హుజురాబాద్.. తుపాకులు అప్పగించాలె.. లేదంటే