
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన హరిక (14), ఆనంద్ (23) గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రేమికులు ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావివద్ద పురుగుల మందు సేవించారు. విషయం తెలుసుకున్న ఇరు వర్గాల కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ కొంత సమయంలోనే చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. దీంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హరిక, ఆనంద్ మృతితో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment