venkatapur
-
సజీవ దహనం కేసులో షాకింగ్ నిజాలు.. వివాహేతర సంబంధమే కారణం?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో ఆరుగురి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వెనుక వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఘటనలో మృతి చెందిన శాంతయ్య భార్య, బంధువులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శాంతయ్య భార్యతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆస్తి, సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం ప్రియుడితో కలిసి భర్త శాంతయ్యను భార్య హత్య చేయించినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. నస్పూర్, వెంకటాపూర్‌లో స్థానికులు చెప్తున్న వివరాల మేరకు.. వెంకటాపూర్‌కు చెందిన మాసు శివయ్య ఆ గ్రామ వీఆర్ఏ, అతడి భార్య రాజ్యలక్ష్మి (పద్మ) గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సందీప్ నస్పూర్‌లో ఉంటున్నాడు. ఇక లక్సెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగరపు శాంతయ్య నస్పూర్‌లో నివాసం ఉంటూ ఆర్కే5 బొగ్గు గనిలో పనిచేస్తున్నాడు. వెంకటాపూర్‌కు సమీపంలోనే బొగ్గుగని ఉండగా.. కూలిపనులకు వెళ్లే క్రమంలో రాజ్యలక్ష్మి దంపతులకు శాంతయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం పెరిగి శాంతయ్య వారి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని అతడి భార్య సృజన పంచాయితీ పెట్టింది. శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆ కుటుంబాలకు పలుమార్లు కౌన్సెలింగ్ కూడా జరిగింది. డబ్బు రేపిన చిచ్చుతో.. శాంతయ్య–సృజన దంపతులకు ఒక కుమార్తు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడంతోపాటు సొంతూరులో భూములు ఉన్నాయి. ఇటీవల కొంత భూమి విషయంలో వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అందులో కుమార్తె పేరిట రూ. 5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, మిగతా సొమ్ము తన వద్దే పెట్టుకున్నాడు. తనకు, కుమారులకు డబ్బులు ఇవ్వకుండా.. రాజ్యలక్ష్మితో ఉంటూ వారికి డబ్బులు ఇస్తున్నాడని సృజన గొడవపడింది. దీనికితోడు నాలుగు నెలలుగా శాంతయ్య వెంకటాపూర్‌లోనే ఉండిపోవడం, డ్యూటీకి సరిగా వెళ్లకపోవడంతో కక్షపెంచుకున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: మంచిర్యాల ప్రమాదంపై షాకింగ్ నిజాలు.. కారణం అదేనా? -
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
కల్లుప్రియుల్లారా లొటలొట తాగేసేయండి
సాక్షి, మెదక్: తూప్రాన్-నర్సాపూర్ రోడ్డులోని బ్రాహ్మణపల్లి రైల్వేట్రాక్ పక్కన మూడున్నర ఎకరాల్లో ఏపుగా పెరిగిన ఈతచెట్ల వనం.. అడవిని తలపిస్తున్నా అక్కడంతా కోలాహలంగా ఉంది. అడపాదడపా కార్లు.. మరెంతోమంది బైక్‌లపై అక్కడికి వచ్చిపోతున్నారు. లోపలికి వెళ్తే.. కొంతమంది ఈతచెట్లపై నుంచి కల్లు తీస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు అప్పుడే తీసిన కల్లును ఇష్టంగా తాగుతున్నారు. ఇంకొందరు కల్లు తీసుకుని వెళ్తున్నారు. ఈ ఈతవనం యజమాని లచ్చాగౌడ్‌ది వెంకటాపూర్ (పీటీ) గ్రామం. మొదట్లో వ్యవసాయంతోపాటు కల్లు గీసేవాడు. 2007లో కల్లు గీత సొసైటీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే.. దొరకలేదు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఈ క్రమంలో బ్రాహ్మణపల్లిలో తన మూడున్నర ఎకరాల భూమిలో ఈతమొక్కలు నాటాలని నిర్ణయించాడు. అటవీ శాఖలో పనిచేసే పరిచయస్తుడైన బాలేశ్‌గౌడ్ సాయంతో సదాశివపేట, తాండూరు, చేవెళ్ల, మరెన్నో ప్రాంతాలు తిరిగాడు. చివరకు నాటి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పెద్దాపూర్‌లో ఒక్కోటి రూ.30 చొప్పున.. 2 వేల ఈతమొక్కలు కొన్నాడు. ఒక్కో మొక్కకు ఆరడుగుల దూరం, ఒక్కో వరుస మధ్య పన్నెండు అడుగుల దూరం ఉండేలా నాటాడు. 2012లో కల్లు పారడం మొదలైంది. ఎందరికో జీ‘వన’ ఉపాధి ఈతవనం నాలుగు గీత కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.12 వేల చొప్పున జీతం ఇస్తుండగా.. రోజుకు రూ.300 కూలీకి మరో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. ఖర్చులన్నీ పోను నెలకు రూ.50 వేల వరకు ఆదాయం ఉంటుందని లచ్చాగౌడ్ తెలిపారు. లచ్చాగౌడ్‌కు భార్య బాలమణి, నలుగురు కుమారులు. వారూ తండ్రితో పాటు ఈతవనాన్ని చూసుకుంటున్నారు. ఈతవనం చేతికందిన దశలో ఎక్సైజ్ అధికారులు, కొందరు స్థానికులు అడ్డుతగిలారు. దీంతో లచ్చాగౌడ్ కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు లచ్చాగౌడ్‌తో పాటు కుమారులకు సైతం లైసెన్స్ జారీచేశారు. ఇక్కడి నుంచే ‘ట్రెండ్’ మొదలు ఒకేచోట ఈతవనాలను పెంచడం.. అక్కడే కల్లు అమ్మడం అనే ట్రెండ్ బ్రాహ్మణపల్లి నుంచి మొదలుకాగా, రాష్ట్రంలోని పలుచోట్ల ఇటువంటివి ఏర్పాటవుతున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గౌడ కులస్తులే కాకుండా ఇతర వర్గాలు సైతం ఆదాయ మార్గంగా ఈతవనాల పెంపకం చేపట్టాయి. దొంతి, గుండ్లపల్లి, చండి, చిన్నగొట్టుముక్కుల, చెన్నపూర్, నవాబుపేట గ్రామాల్లో వీటి పెంపకం ఊపందుకుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 40 ఎకరాల్లో ఈతచెట్ల పెంపకం సాగుతోంది. చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో గౌడ సొసైటీకి చెందిన ఎకరంన్నర స్థలంలో రెండు దఫాలుగా 500 చొప్పున వెయ్యి ఈతచెట్లు పెట్టారు. తొలుత పెట్టిన చెట్లకు కల్లు పారుతోంది. ఏడాదికి పది కుటుంబాల చొప్పున సంరక్షణ, అమ్మకపు బాధ్యతలు తీసుకుంటున్నాయి. అప్పటికప్పుడు స్వచ్ఛమైన కల్లు అప్పటికప్పుడు చెట్ల నుంచి తీసిన కల్లు విక్రయించడం, చుట్టూ అడవిలో ఉన్న భావన.. ఇవి కల్లుప్రియుల్ని ఇక్కడకు రప్పిస్తున్నాయి. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, సిద్దిపేటతోపాటు హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తున్నారు. లీటర్ కల్లు రూ.50కి విక్రయిస్తున్నారు. ఇక, ఒకే చెట్టుకు కట్టిన లొట్టి నుంచి ఆ సమయానికి ఎంత కల్లు లభిస్తే అంత.. రూ.200 పలుకుతోంది. వీకెండ్లో నగరం నుంచి వచ్చే వారితో రద్దీగా ఉంటుంది. ఇక్కడ సీజన్‌తో సంబంధం లేకుండా కల్లు పారుతోంది. ఒక్కో చెట్టు నుంచి రోజుకు 2 నుంచి 5 లీటర్ల కల్లు వస్తోంది. వేసవిలో రోజుకు 300 చొప్పున.. అన్‌సీజన్‌లో 150 చొప్పున చెట్లు గీస్తామని, సీజన్లో రోజూ రూ.20 వేల వరకు అమ్మకాలు సాగుతున్నాయని లచ్చాగౌడ్ చెబుతున్నారు. తలరాత మార్చుకున్నా.. ఈతవనం పెంపును మొదట్లో ఇంటోళ్లు వద్దన్నారు. అయితే, ఈ తరం వాళ్లకు ప్రకృతి వరప్రసాదమైన స్వచ్ఛమైన కల్లు అందించాలనే సంకల్పంతో ఈతవనం పెంచా. అడ్డంకులెదురైనా హైకోర్టు అండగా నిలిచింది. నాకొచ్చిన ఆలోచనతో నా తలరాత మార్చుకున్నా. - లచ్చాగౌడ్ ఎకరంలో ఈతవనం పెట్టా.. ఎకరా పొలంలో మూడేళ్ల క్రితం ఉపాధి హామీ ద్వారా 500 ఈత మొక్కలు నాటాను. ఆరేళ్లకు కల్లు తీసే అవకాశం ఉంటుంది. కులవృత్తిని కాపాడుకోవడానికి ఇదో అవకాశంగా మారింది. - బాలాగౌడ్, చండి, శివ్వంపేట -
సిద్దిపేటలో విషాదం: ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన హరిక (14), ఆనంద్ (23) గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రేమికులు ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావివద్ద పురుగుల మందు సేవించారు. విషయం తెలుసుకున్న ఇరు వర్గాల కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ కొంత సమయంలోనే చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. దీంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హరిక, ఆనంద్ మృతితో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అమ్మగా మారిన కూతురు
సాక్షి, వెంకటాపురం(వరంగల్) : అందరు పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ చిన్నారి అలా చేయడంలేదు. మతిస్థిమితం కోల్పోయిన కన్నతల్లికే అమ్మగా మారి సేవచేస్తుంది. బడికి పోయి చదువుకోవాల్సిన ఆ బాలిక తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ములుగు జిల్లా వెంకటాపురంలోని ఎస్సీకాలనీకి చెందిన గాజుల రాజమ్మ–దుర్గయ్యల కుమార్తె రాధను హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ శంకర్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి శ్రీవల్లి(9), అమ్ములు (2) ఇద్దరు పిల్లలు జన్మించగా రాధ మూడు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయింది. ఎవరినీ గుర్తు పట్టకపోవడంతో భర్త శంకర్ భార్య, పిల్లలను వెంకటాపురంలోని తల్లి రాజమ్మ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. జూన్‌లో ములుగులోని ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాలలో శ్రీవల్లిని ఐదో తరగతిలో చేర్పించారు. అయితే, మతిస్థిమితం కోల్పోయిన రాధ గ్రామంలో తిరుగుతూ అందరినీ కొడుతోంది. ఈ క్రమంలో 10రోజుల క్రితం రాధ తల్లి రాజమ్మ సైతం అనారోగ్యానికి గురికావడంతో రాధ ఆలన పాలన చూసుకునేవారు లేరు. దీంతో శ్రీవల్లి చదువు మానేసి ఇంటికి వచ్చేసింది. కన్నతల్లికి అమ్మగా మారి స్నానం చేయిస్తూ, దుస్తులు వేస్తూ, అన్నం తినిపిస్తూ సేవలందిస్తుంది. అంతేకాకుండా చెల్లి అమ్ములు, అమ్మమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ చిన్న వయస్సులోనే పెద్దకష్టం అనుభవిస్తోంది. ఈ మేరకు రాధకు చికిత్స జరిగేలా దాతలు చేయూతనివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అమ్మకు ఏమైందో తెలియదు మా అమ్మకు ఏమైందో తెలియదు. నన్ను, మా చెల్లిని చూస్తే కూడా కొడుతుంది. అమ్మను ఆస్పత్రి ఎక్కడికి, ఎలా తీసుకెవెళ్లాలో తెలియదు. అమ్మ కోసం హాస్టల్ వదిలి ఇంటికొచ్చా. బడికి పోకున్నా మంచిదే కానీ మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి. నేను లేకపోతే మా అమ్మను ఎవరు చూసుకుంటారు? మా అమ్మమ్మకు కూడా జ్వరం వచ్చింది. – శ్రీవల్లి, కూతురు -
వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం
సదాశివపేట రూరల్ :మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వరస్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిఏటా కల్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువైన పద్మావతీ సమేత వెంకటేశ్వరస్వామికి అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా సుప్రభాతం, అభిషేకం చేశారు. అనంతరం ఆలయంలో గణపతిహోమం చేశారు. ఈ సందర్భంగా వెంకటాపూర్ గ్రామస్తులు, భక్తులు ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 10.05 గంటలకు స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో మండల, పట్టణ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం వెంకటేశ్వరుడు, అమ్మవార్ల విగ్రహాలను రథంలో ఉంచి వెంకటాపూర్ గ్రామంలో ఊరేగించారు. అ తర్వాత సదాశివపేట పట్టణంలోని పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. సదాశివపేటలోని భక్తులు రథంలో కొలువైన వెంకటేశ్వరస్వామికి పూజలు చేశారు. -
వెంకటాపూర్‌ను ఆదుకుంటాం
చుట్టూ గడ్డి భూములు.. కనువిందు చేసే పచ్చని పంట పొలాలు.. కోనసీమ అందాలను తలపింపజేసే రమణీయ దృశ్యాలు.. ఇవీ ఘట్కేసర్ మండలంలోని వెంకటాపూర్ పరిసరాలు.. ఈ గ్రామం హైదరాబాద్ మహా నగరానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. మూసీ మురుగు, దోమల బెడద, కాలుష్యమయమైన భూగర్భ జలాలు, తాగునీటి ఎద్దడి, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తదితర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి వెంకటాపూర్‌లో పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే: పెద్దమ్మ పింఛన్ వస్తోందా..? అనసూయమ్మ: వస్తోంది సారు. మొన్న మూడు నెలల పింఛన్ ఇచ్చిన్రు. ఈనెల ఇంకా ఈయలేద్సారు. ఎమ్మెల్యే: ఈనెల పింఛన్లు కూడా త్వరలోనే వస్తాయి. ఇంకా ఎవరికైనా పింఛన్లు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోండి. అధికారులు పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తారు. ఎమ్మెల్యే: పెదమ్మా రేషన్ వస్తోందా..?. రత్నమ్మ: కొత్త రేషన్ కార్డులు ఇంకా ఇయ్యలే సారు. ఎమ్మెల్యే: రేషన్ కార్డులు మన కొత్త సర్కారొళ్లు త్వరగానే ఇస్తరు. మునుపటి లెక్క ఒక్కరికి నాలుగు కిలోల బియ్యం కాదు.. ఆరు కిలోల బియ్యం ఇస్తున్రు. అందరూ కడుపు నిండా బువ్వ తినాలని సర్కార్ ఆలోచిస్తోంది. రత్నమ్మ: మంచిది సారు. లక్ష్మమ్మ: రేషన్ సరుకులు సరిగా ఇస్తలేడు సారు. అక్కడే ఉన్న రేషన్ డీలర్ బాలరాజ్‌ను ఎమ్మెల్యే పిలిచారు. ఎమ్మెల్యే: ఆ ముసలామెకు రేషన్ బియ్యం ఇయ్యి. రేషన్ దుకాణాల్లో ఏం చేస్తారో అవన్నీ నాకు తెలుసు. బియ్యం వస్తలేవని మళ్లీ ఆమె నా వద్దకు రావద్దు. ఎమ్మెల్యే: పెద్దమ్మా బాగున్నవా. ఏమైనా సమస్యలున్నాయా..? కట్ట రాములమ్మ: ఉన్నయి సారు. నా మనుమనికి తల్లి, తండ్రి లేరు. నేనే సాదుతున్న. వాడి మానసిక పరిస్థితి సక్కగ లేదు. వికలాంగుల పింఛన్ ఇప్పించండ్రి . ఎమ్మెల్యే:సదరమ్ కార్డు ఉంటే వికలాంగుల పింఛన్ వస్తది. పట్నంల వనస్థలిపురం దవాఖానకు నీ మనుమణ్ని తీసుకెళ్లు. అక్కడ డాక్టర్లు పరీక్షించి సదరన్ కార్డు ఇస్తరు. అప్పుడు దరఖాస్తు చేసుకో. పింఛన్ వస్తది. ఎమ్మెల్యే: అమ్మ.. ఇక్కడ ఎమైన సమస్యలున్నాయా..? సుధా (అంగన్వాడీ కార్యకర్త): సారు మా అంగన్వాడీలో నల్లా కనెక్షన్ లేదు. దీంతో నీటికి ఇబ్బంది పడుతున్నం. భోజనం వండటానికి ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే: మీ అంగన్ వాడి కేంద్రానికి వెంటనే నల్లా కనెక్షన్ ఇప్పిస్తానమ్మ అంటూ అక్కడే ఉన్న సర్పంచ్ కృష్ణవేణికి వెంటనే నల్లా కనెక్షన్ ఇయ్యవలసిందిగా ఆదేశించారు. శారద: మాకు డ్వాక్రా బిల్డింగ్ లేదు. దీంతో ఆడోళ్లు మీటింగ్‌లు పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నం. గతంలో గ్రామ పంచాయతీ వారుకొత్త గ్రామ పంచాయతీ భవనంలో పోయినంక, పాత భవనాన్ని ఇస్తామన్నారు. వారు కొత్త దాన్ల పోయిన్రు. పాతది మాత్రం ఇస్తలేరు. ఎమ్మెల్యే: (అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ బాలరాజ్‌తో) పాత పంచాయతీ భవనాన్ని డ్వాక్రా మహిళలకు ఇచ్చేందుకు తీర్మానం చేసిన్రా. బాలరాజు(మాజీ సర్పంచ్): చేసిన్రు. సారు. ఎమ్మెల్యే: తీర్మానం చేసినంక ఇంకా ఎందుకు ఇస్తలేరు. వెంటనే ఇచ్చేయున్రి. పాత పంచాయతీ భవనానికి బాత్రూమ్లు కట్టించి, నీటి వసతి, కరెంటు సౌకర్యం కల్పించి, సున్నం వేసి డ్వాక్రా మహిళలకు ఇయ్యున్రి. 10 రోజుల్లో నేనే ఒచ్చి కొబ్బరికాయ కొట్టి ఆడోళ్లకు అందజేస్త. దానయ్య: నాకు పింఛన్ ఇయ్యరంట సారు. ఎమ్మెల్యే: నువ్వు ఎన్ని ఏండ్లు ఉన్నయ్..? దానయ్య: అరవై ఉంటాయి సార్. ఎమ్మెల్యే: సర్కార్ 65 ఏండ్ల కంటే మీదున్నొళ్లకు పింఛన్ ఇయ్యలనే నిబంధన పెట్టింది. మనం గూడ సర్కార్‌ను అర్థం చేసుకోవాలే. ఆ వయస్సులో కాళ్లు రెక్కలు పనిచేయ్యయి. అప్పుడు సర్కార్ ఇచ్చే పింఛన్ ఆసరా అయితదని ఆలోచిస్తుంది. మనం జెర అర్థం చేసుకోవలే. ఎమ్మెల్యే: (రైతులను) ఏమైనా సమస్యలున్నాయా..? పెంటయ్య: బావుల కాడ కరెంటు సరిగా వస్తలేదు. సారు. ఎక్కువ సేపు వస్తే బాగుండు. ఎమ్మెల్యే: మనకాన్నె కరెంటు బాగుంది. వేరే దగ్గరైతే ఆయింత కరెంట్ కూడా వస్తలేదు. భూమయ్య: బడిలో వంటగది లేక ఇబ్బందుల పడుతున్రు. ఎమ్మెల్యే:మీ ఊరోళ్లు స్థలం సూపిస్తే వంట గది కట్టిద్దాం. ఎమ్మెల్యే: రైతన్న ఏమైనా సమస్యలున్నాయ..? అండె పోచయ్య(నాగలి దున్నతున్న రైతు): యాసంగీలో నెల్లూరి సోన సాగుచేస్తున్న. ఎకరానికి 20 నుంచి 30 బస్తాలు ధాన్యం పండుతుంది. 6 నుంచి 7 వేల లాభాలుస్తున్నయ్. కష్టానికి తగ్గ లాభాలు వస్తలేవు. ఎమ్మెల్యే: ప్రతాపసింగారం, ఏదులాబాద్‌లో ధాన్యం కొనే కేంద్రాలు ఏర్పాటు చేసినం. ఆడికి వచ్చి ఒడ్లు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. ఈసారన్న సర్కారోళ్లకు ఒడ్లు అమ్ము. పోచయ్య: సరే సారు. ఎమ్మెల్యే: ఏమమ్మ ఏమైనా సమస్యలున్నాయా..? కూలీ ఎంత ఇస్తున్రు. అంజమ్మ, నీరుడు సబిత(నాట్లు వేసే మహిళలు): పొద్దగాళ్లొస్తే రోజుకు రూ.250 కూలీ ఇస్తున్రు. కొంచెం అమ్మటాళ్లకు వస్తే రూ.200 కూలీ ఇస్తున్రు. సారు. రామారావు: గుడిని బాగు చేయాలె సారు. ఎమ్మెల్యే: దాతలు, సర్కార్ సహాయంతో గుడిని బాగు చేద్దాం. మంగమ్మ: సారు నాకు పింఛన్ వస్తలేదు. ఇంతకు మందు నాకు, మా ఆయనకూ పింఛన్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. ఎమ్మెల్యే: భార్యాభర్త ఇద్దరూ ముసలొళ్లు అయితే ఒక్కరికే పింఛన్ ఇయ్యాలనేది గవర్నమెంట్ నిర్ణయం. దాని ప్రకారం ఒక్కరికి పింఛన్ వస్తదమ్మ. నాగయ్య: సారు మాకు ఇల్లు లేదు. మేం ఇద్దరం ముసలివాళ్లం. కిరాయిఇ ంట్లో ఉంటున్నాం. మాకు ఎట్లైనా చేసి ఇళ్లు కట్టియ్యి సారు. నీ కాళ్లు మొక్కుతా. ఎమ్మెల్యే:మీ ఊర్లో ఎక్కడైనా జాగా చూసి అధికారులకు చెప్పి ఇల్లు కట్టిస్తానమ్మా. లక్ష్మమ్మ: నా పింఛన్ కొర్రెముల పక్క ఊర్లో ఇస్తున్రు. ప్రతి నెల ఆడికి పోవడం ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే: అధికారులకు చెప్పి నీపింఛన్ ఇక్కడనే వెంకటపూర్‌లో ఇచ్చేలా చూస్తా. నర్సమ్మ: గ్రామానికి కృష్ణనీరు సరిగా రావడం లేదు. ఎమ్మెల్యే: సరిగా వచ్చేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానమ్మ. కృష్ణవేణి: కొన్ని చోట్ల సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు సారు. ఎమ్మెల్యే: నిధులు కేటాయించి సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటా.ఎక్కువ నిధులు కేటాయించి త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తా. దశలవారీగా పరిష్కరిస్తా ‘సాక్షి’ ద్వారా వెంకటాపూర్‌లో సమస్యలు తెలుసుకున్నాను. నేను నివాసం ఉండే ప్రతాప్‌సింగారం గ్రామానికి పక్కనే వెంకటాపూర్ ఉండటంతో ఈ సమస్యల్లో చాలా వరకు నాకు తెలుసు. దశల వారీగా సమస్యలను పరిష్కారిస్తా. రోడ్లు, అంగన్వాడీ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తాను. గ్రామానికి సింగిల్ రోడ్డు ఉంది. దానిని అభివృద్ధి చేస్తాను. అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం. గ్రామాల్లోని సమస్యలపై ప్రజల్లో చైతన్యం వచ్చి వాటిని పరిష్కరించాలని కోరే ధైర్యం చూపాలి. అప్పుడే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. - మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. -
అల్లరి చేస్తోందని బీరువాలో బంధించింది!
-
చిన్నారిని బీరువాలో దాచిన టీచర్
-
చిన్నారిని బీరువాలో దాచిన టీచర్
మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. అల్లరి చేస్తుందని ఓ చిన్నారిని అంగన్ వాడీ టీచర్ బీరువాలో దాచింది. దాంతో చిన్నారికి ఊపిరి ఆడకపోవటంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆ విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ గ్రామస్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. కాగా విజయ నగరం ప్రతిభా పాఠశాలలో హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థిని టీచర్ చితకబాదింది. దాంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.