
చిన్నారిని బీరువాలో దాచిన టీచర్
మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్లో దారుణం చోటుచేసుకుంది. అల్లరి చేస్తుందని ఓ చిన్నారిని అంగన్ వాడీ టీచర్ బీరువాలో దాచింది. దాంతో చిన్నారికి ఊపిరి ఆడకపోవటంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆ విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ గ్రామస్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
కాగా విజయ నగరం ప్రతిభా పాఠశాలలో హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థిని టీచర్ చితకబాదింది. దాంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.