
సేఫ్ సిటీకోసం ఒక్క క్లిక్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం నీరు వెళ్లే దారిలేక ఇళ్లు చెరువులవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఇందుకు కారణం...వరద నీరు సాఫీగా ప్రవహించేందుకు ఉద్దేశించిన నాలా వ్యవస్థ ధ్వంసమవడమే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి కష్ట నష్టాలు ఎదురవకుండా ఉండేందుకు మీరూ స్పందించండి.
మీ ప్రాంతంలో నాలాల పరిస్థితిని మాకు తెలపండి. కబ్జాలు ఉన్నా... ప్రమాదకరంగా మారినా వెంటనే మీ మొబైల్ ద్వారా ఒక ఫోటో తీయండి...వాట్సప్ ద్వారా మాకు పంపించండి. రెండు మూడు వాక్యాల్లో దాని గురించి వివరించండి. సాక్షిలో ప్రచురించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తాం. పరిష్కారానికి కృషి చేస్తాం. ఇలా పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
నెంబర్: 9705012000