![భార్య బీజేపీకి ఓటు వేసిందని.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41460784788_625x300.jpg.webp?itok=PUQf5zGs)
భార్య బీజేపీకి ఓటు వేసిందని..
గువాహటి: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిందనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సోనిత్‌పూర్ జిల్లాలోని దొనా అద్దాహతి గ్రామానికి చెందిన అయినుద్దీన్ తన భార్య దిల్వారా బేగంకు తాజాగా 'తలాఖ్' (విడాకులు) ఇచ్చాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామవాసులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను బీజేపీకి ఓటు వేసినట్టు దిల్వారా భర్తకు చెప్పింది. దీంతో కోపగించుకున్న అయినుద్దీన్ తమ పదేళ్ల వైవాహిక జీవితానికి చరమగీతం పాడాడు. బీజేపీకి ఓటువేసిందని తెలియగానే ఆమెకు విడాకులు ఇచ్చాడని స్థానిక మీడియా పేర్కొంది. అయితే, గ్రామస్తులు మాత్రం ఈ దంపతులు వ్యక్తిగత కారణాలతోనే విడాకులు తీసుకున్నారని, బీజేపీకి ఓటు వేయడం కారణం కాదని చెప్తున్నారు.