assam assembly elections 2016
-
నా పేరు మోదీ కాదు.. నేను అబద్దాలు చెప్పడానికి రాలేదు
గువాహటి: దేశానికి నిత్యం (24/7) అబద్ధాలు చెప్పే మోదీని తాను కాదంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘నా పేరు నరేంద్ర మోదీ కాదు. నేను అబద్దాలు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మోదీ అబద్ధాలను వినాలనుకుంటే కేవలం టీవీ ఆన్ చేయండి చాలు. దేశానికి ఆయన నిత్యం అబద్ధాలు చెబుతూనే ఉంటారు’ అని రాహుల్ విమర్శించారు. అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో మేము అయిదు హామీలిస్తున్నాం. రాష్ట్రంలో సీఏఏను అమలు కానివ్వబోం. అయిదేళ్లలో అయిదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. తేయాకు కార్మికుల వేతనాలను రూ. 193 నుంచి రూ. 365కు పెంచుతాం. గృహిణులకు నెలకు రూ. 2 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. ఇవే మేమిస్తున్న అయిదు హామీలు. మేము బీజేపీలాగా కాదు. హామీలిస్తే అమలు చేసి చూపిస్తాం. పలు రాష్ట్రాల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేసి చూపించామన్నారు. చదవండి: (బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరిద్దాం) -
భార్య బీజేపీకి ఓటు వేసిందని..
గువాహటి: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిందనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సోనిత్పూర్ జిల్లాలోని దొనా అద్దాహతి గ్రామానికి చెందిన అయినుద్దీన్ తన భార్య దిల్వారా బేగంకు తాజాగా 'తలాఖ్' (విడాకులు) ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామవాసులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను బీజేపీకి ఓటు వేసినట్టు దిల్వారా భర్తకు చెప్పింది. దీంతో కోపగించుకున్న అయినుద్దీన్ తమ పదేళ్ల వైవాహిక జీవితానికి చరమగీతం పాడాడు. బీజేపీకి ఓటువేసిందని తెలియగానే ఆమెకు విడాకులు ఇచ్చాడని స్థానిక మీడియా పేర్కొంది. అయితే, గ్రామస్తులు మాత్రం ఈ దంపతులు వ్యక్తిగత కారణాలతోనే విడాకులు తీసుకున్నారని, బీజేపీకి ఓటు వేయడం కారణం కాదని చెప్తున్నారు.