న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రష్యా, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్ సహా పలుదేశాలకు పాక్ మీదుగా వెళ్లినందుకు ఆ దేశానికి కేంద్రం రూ.2.86 లక్షలు చెల్లించినట్లు సమాచారహక్కు(ఆర్టీఐ) చట్టం కింద వెల్లడైంది. తమ గగనతలాన్ని వాడుకున్నందుకు ఈ మొత్తాన్ని నేవిగేషన్ చార్జీల కింద పాకిస్తాన్ వసూలుచేసినట్లు పాక్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. నేవీ మాజీ అధికారి లోకేశ్ బత్రా దాఖలుచేసిన ఆర్టీఐ పిటిషన్‌కు కమిషన్ ఈ మేరకు జవాబిచ్చింది. రష్యా, అఫ్గానిస్తాన్ పర్యటనల నుంచి స్వదేశానికి తిరిగివస్తూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు వేడుకల కోసం మోదీ లాహోర్‌లో దిగిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పాకిస్తాన్ రూ.1.49 లక్షలు వసూలుచేసిందని తెలిపింది. 2016లో మోదీ ఇరాన్ పర్యటనకు రూ.77,215, ఖతార్ పర్యటనకు రూ.59,215 లను పాక్‌కు చెల్లించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment