భార్యాపిల్లలతో మహేశ్
ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎంత బాగా ప్లాన్ చేసుకుంటారో అంతే పక్కాగా పర్సనల్ లైఫ్‌ని కూడా ప్లాన్ చేసుకుంటుంటారు మహేశ్‌బాబు. షూటింగ్ గ్యాప్స్ మధ్య కాస్త టైమ్ దొరికితే చాలు ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తుంటారాయన. ఇటీవల ‘మహర్షి’ సినిమా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో కంప్లీట్ చేసిన మహేశ్‌బాబు ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లారు. అక్కడ హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోను హాలిడేస్ బిగిన్స్ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు మహేశ్ సతీమణి నమ్రత. అయితే ఈ హాలిడేకి ముందు హైదరాబాద్‌లో రామ్‌చరణ్, మహేశ్‌బాబు కలిసి సరదాగా సందడి చేశారు.
ఆ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ‘మహర్షి’ నెక్ట్స్ షెడ్యూల్ పొల్లాచిలో జనవరిలో స్టార్ట్ కానుంది. కాబట్టి న్యూ ఇయర్ వేడుకలను మహేశ్ ఫారిన్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటారని ఊహించవచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘మహర్షి’లో ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో నరేశ్, మహా పాత్రలో పూజ కనిపిస్తారు. ప్రకాశ్ రాజ్, జయసుధ, సాయి కుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment