
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌కు పయనమయ్యారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే చంద్రబాబు ఉండనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురైన సంగతి తెల్సిందే. ఈ విషయం నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు విదేశీ టూర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment