అవకాశం చేజార్చుకుంటారా?
కేవలం ఒక్క ఏడాది కాలంలో మోదీ ప్రపంచంలోనే తీరుబడిలేనిదైన న్యూయార్క్ నగరంలో సైతం ఎక్కువగా మాట్లాడుకునే ప్రపంచ నేతల్లో ఒకరుగా ఎదగడం విశేషం. కొత్తగా సమకూరిన ఈ అంతర్జాతీయ ఖ్యాతి తలకెక్కి ఆయన ఇకపై తన విదేశాంగ పర్యటనలు తగ్గించుకుని, దేశంలోని తన ప్రతిష్టను ఇనుమడింప జేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించకుండా ఉంటారా? అనేదే ఆయన ముందున్న పరీక్ష. ఆయన తన వాక్చాతుర్యంతో, కష్టపడి పనిచేయడం ద్వారా ప్రపంచ వేదికపై నిజమైన విజయాన్ని సాధించే ఆవకాశాన్ని సృష్టించారు. దాన్ని పరిణతితో ఉపయోగించుకోవాలి. ఆ పని చేయకపోతే నష్టపోయేది ఆయనే.
పత్రికా విలేకరులు ట్యాక్సీ డ్రైవర్ల మాటలను ఉల్లేఖిం చడం నగుబాటుకు, పరిహాసాలకు దారితీసేటంతటి అతి పాత ఎత్తుగడ. అయినాగానీ ట్యాక్సీ డ్రైవర్ వివేకం, పరిశీలనా శక్తి నుంచి నేర్చుకోవడం ఆపేయాల్సిన అవస రమేమీ లేదు. వాళ్లు, ప్రత్యేకించి న్యూయార్క్ ట్యాక్సీ డ్రైవర్లు మన పాత్రికేయుల కంటే ఎక్కువ చూస్తారు, వింటారు. పోప్ ఫ్రాన్సిస్ గురించి ఈ వారం వాళ్లు అదే పనిగా విన్నారు. పోప్ పర్యటన ఎప్పుడూ ట్రాఫిక్‌ను చిందరవందర చేసేస్తుంది. కాబట్టి ట్యాక్సీ డ్రైవర్లు ఆయన పర్యటనంటే చిరాకు పడటాన్ని మన్నించవచ్చు. ఐక్యరాజ్య సమితి వార్షిక సాధారణ సమావేశాలకు హాజ రయ్యే మరో ప్రభుత్వాధినేత గురించి కూడా వాళ్లిప్పుడు మాట్లాడుతున్నారు.
నరేంద్ర మోదీ రెండో న్యూయార్క్ పర్యటనలో మొదటి దఫా ఉన్నంతటి సంరంభం లేదు. కానీ న్యూయార్క్‌లో ఈ వారం అతి ఎక్కువగా మాట్లాడుకుం టున్న దేశాధినేతల్లో ఆయన... ఒబామా, పోప్‌ల తదు పరి మూడోవారు. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడి దేశీ మద్దతుదార్లు రంగు రంగుల దుస్తులు, తలపాగాలు, డోలక్‌లు, పోస్టర్లు, బ్యానర్లతో భారదేశాన్ని ఆధునీకరి స్తున్న గొప్ప నేతగా ఆయన్ను కీర్తిస్తూ చేస్తే కోలాహలమే అందుకు చాలా వరకు కారణం. అందుకు భిన్నమైన స్వరం భారతీయులు ఎక్కువగా సందర్శించే మన్ హట్టన్ దిగువ తూర్పునున్న లిటిల్ ఇండియాగా పిలిచే ప్రాంతం నుంచి వినవస్తుంది. అది ఆయనను హంతకు డని అంటుంది. స్వదేశంలోలాగే విదేశాల్లో కూడా భార తీయులు మోదీ విషయంలో రెండు శిబిరాలుగా చీలి పోయి ఉంటారు. అయినా న్యూయార్క్ ట్యాక్సీ డ్రైవర్లు కూడా గమనించిన మొట్టమొదటి భారత నేత ఆయనే.
మోదీకి ట్యాక్సీ డ్రైవర్ పరీక్ష
కేవలం ఒక్క ఏడాది కాలంలో ఆయన ప్రపంచంలోనే తీరుబడిలేనిదైన ఆ నగరంలో సైతం ఎక్కువగా మాట్లా డుకునే ప్రపంచ నేతల్లో ఒకరుగా మోదీ స్థాయి ఎదగడం విశేషం. ఆయనకు రాజకీయ కుటుంబ వారసత్వ నేప థ్యం లేదు. ఇంగ్లిషులో పరిమితంగానే మాట్లాడుతారు. విద్యార్హతల విషయంలో ఆయన మునుపటి ప్రధానులు లేదా సహచరులలో చాలా మందికి సాటిరారు. ఇన్ని ప్రతికూలతలున్నా ఆయన అలాంటి గుర్తింపును పొంద డం మరింత విశేషం. ఏడాది క్రితం వరకు ఆయన పాశ్చాత్య ప్రపంచానికి ప్రయాణించడాన్ని సైతం అను మతించేవారు కారు. అయితేనేం నేడాయన ట్యాక్సీ డ్రైవర్ నాయకత్వ పరీక్షలో నెగ్గారు.
ఈ సందర్భంగా నాకు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక యజమాని, ప్రచురణకర్త అయిన డాన్ గ్రాహమ్‌తో 1993లో జరిపిన సంభాషణ గుర్తుకొస్తోంది. వారి పత్రిక సహా అమెరికన్ ప్రసారమాధ్యమాలన్నీ పాకిస్తాన్, బెన జీర్ భుట్టోల గురించి తరచూ తగినన్ని కథనాలను వెలు వరిస్తున్నా, భారత్ గురించి మాత్రం అంత తక్కువ కథ నాలను, వార్తలను ఇస్తాయేమని అడిగాను. అదీ కూడా పీవీ నరసింహారావు ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థ తలుపులను తెరిచిన నాటి పరిస్థితి. (ఆ తదుపరి ఏడాది పీవీని అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ ఉభయ సభల సమా వేశానికి పరిచయం చేస్తూ ‘‘నర్ శర్మా రావ్’’ అనేటం తగా భారత్ విషయంలో వారి అజ్ఞానం ఉండేది.) ‘‘మా అమెరికన్లకు బలమైన వ్యక్తులు లేదా వంశాలు ప్రాతిని ధ్యం వహించని దేశాలపైన దృష్టిని కేంద్రీకరించేటంత తీరిక ఉండదు’’ అని గ్రాహం వివరించాడు.
అంతర్జాతీయ అయస్కాంతం
ఇరవై ఐదేళ్ల తర్వాత మోదీ ఆ లోటును పూడ్చారు. ఆయ నకు నెహ్రూ లేదా ఇందిరలకున్న నైతిక స్థాయిగానీ లేదా రాజీవ్‌గాంధీకున్న యవ్వనోత్సాహం నిండిన ఆకర్షణ గానీ ఉండకపోవచ్చు. కానీ ఆయన తనకున్న శక్తిని, అధి కారాన్ని ప్రదర్శించడం ద్వారా, క్షమాపణలు చెప్పుకునే ధోరణితోగాక బాహాటంగా మాట్లాడటం ద్వారా, భార తీయులకు అసహజమైన ఉద్వేగ భరితంగా మాట్లా డటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకున్నారు. దాదా పుగా ఆయన ఇంటర్వ్యూలే ఇవ్వకపోయినా పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఆయన్ను గుర్తిస్తున్నాయి. రూపర్ట్ మర్దోక్ ఆయన్ను కలుసుకున్నందువల్ల ఇలా అనడం లేదు. చైనాలో పునాదులు కదులుతున్న బడా వ్యాపార సంస్థలు ఆయనవైపు చూస్తున్నాయి. ఆయనకంటే చాలా చిన్నవారైన ప్రపంచ నేతలు లాంఛనప్రాయం కాని ఆయన స్వాభావిక ప్రవర్తనకు ఆకర్షితులవుతున్నారు.
మోదీ ఎన్‌ఆర్‌ఐలను - ప్రత్యేకించి వ్యాపారులు, కిరాణా దుకాణదార్లు, హోటల్ యజమానులు, ఇమ్మి గ్రేషన్ న్యాయవాదులను గొప్పగా ఉపయోగించుకు న్నారు. తద్వారా ఆయన తను ప్రముఖంగా కనిపించేలా చేసుకున్నారు. ఆయన జరిపిన గత పర్యటనలో వారంతా మాడిసన్ స్క్వేర్ గార్డెన్ నిండిపోయేలా చేశారు. అదే ఆయన పర్యటనలోని మైలురాయి అయిం ది. అయితే ఆంతకన్నా ముఖ్యంగా ఆయన ఇప్పుడు భారత సాంకేతికవేత్తలను కూడా తన గుడారంలోకి తెచ్చుకోగలిగారు. గుజరాతీ ఎన్‌ఆర్‌ఐల లాగా వారంతా బీజేపీ మద్దతుదార్లేమీ కారు. కానీ వారికంటే అత్యంత ఎక్కువ పలుకుబడిగలవారు. కాబట్టే ఆయన సిలికాన్ వ్యాలీ, ఫేస్‌బుక్‌లలో ఒక రోజంతా గడిపారు. ప్రపంచ దేశాధినేతలందరిలోకీ ఒబామా తరువాత సామాజిక మాధ్యమాలను అత్యంత విస్తృతంగా, విజయవంతంగా ఉపయోగించుకున్నది ఆయనే.
దౌత్య విజయానికి అపూర్వ అవకాశం
అయితే అయన నూతనంగా సముపార్జించుకున్న ఈ అంతర్జాతీయ ఖ్యాతిని దేశంలోని అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారా లేక విదే శాంగ విధానపరమైన భారత ప్రయోజనాల పురోభి వృద్ధికి ఉపయోగిస్తారా అనేదే కీలక ప్రశ్న. ఐరాస సాధా రణ సమావేశాలకు ఏటా తీర్థయాత్ర సాగే దేశాధినేత లంతా తమ దేశ ప్రజలను లక్ష్యంగా చేసుకునే సుదీర్ఘ మైన ఉపన్యాసాలిస్తారని తరచుగా అంటుంటారు. మోదీ కూడా అలాంటి పని అంతో ఇంతో చేస్తారనడం ఖాయం. అయితే ఆయన తనకు కొత్తగా లభించిన స్థాయిని భారత విదేశాంగ విధానాల ప్రయోజనాలను పెంపొందింపజేయడానికి ఉపయోగించుకునే అపూర్వ అవకాశం కూడా ఉంది. ప్రత్యేకించి మన విదేశాంగ విధా నంలోని కొన్ని అంశాలను గతం కంటే విప్లవాత్మకంగా భిన్నమైన రీతిలో పునర్నిర్వచిస్తున్నట్టుంది. కాబట్టి ఇది మంచి అవకాశం అవుతుంది.
సంకోచం వీడిన మన దౌత్యం
గత రెండు దశాబ్దాలుగా భారత-అమెరికా సంబం ధాలు మరింత సుహృద్భావ పూర్వకమైనవిగా మారు తున్నాయి. మోదీ కాంగ్రెస్ ప్రభుత్వాల పాత సంకోచ ం లేదా తటపటాయింపును వీడి వాటికి కొత్త ఊపును ఇచ్చారు. మన్మోహన్‌సింగ్, వాజ్‌పేయి ప్రభుత్వాలతో కూడా అమెరికాలోని కీలక విధానకర్తలకు సుహృద్భావ పూరితమైన, పరస్పర విశ్వాసం గలిగిన సత్సంబంధా లుండేవి. కానీ వారిద్దరిలో ఎవరూ మోదీ అంతటి ఉత్సాహభరితంగా, శక్తివంతంగా, తటపటాయింపులు లేనితనాన్ని ప్రదర్శించలేదు. బాగా వంటబట్టిపోయిన పాత అమెరికా వ్యతిరేకతకు ఆయన అంతం పలికేశా రనేది అంతా గుర్తించినదే. ప్రభుత్వం నుంచి ప్రభు త్వానికి ఆయుధ సంపత్తి సరఫరాకు ఆర్డర్లను ఇవ్వడాన్ని ఆయన విదేశాంగ విధాన సాధనంగా కూడా ఉపయో గిస్తున్నారు. పారిస్‌లో రాఫేల్ యుద్ధ విమానాల కొను గోలు ప్రకటన చేసిన వెంటనే ఆయన తన పర్యటన సందర్భంగా అమెరికా హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు.
అమెరికా వ్యతిరేకతకు చెల్లు చీటీ
పాకిస్తాన్, చైనాలతో కలసిన ఊపిరి సలపని త్రికోణపు విదేశాంగ విధానం నుంచి బయటపడే విషయంలో ఆయన మన్మోహన్‌సింగ్ విధానానికి సరికొత్త రూపు రేఖలు దిద్దారు. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్‌తో సంబం ధాల కోసం చేయిచాస్తే, మోదీ ముందుగా చైనాతో మాట్లాడటమే మంచిదనుకున్నారు. ఆయన నూతన పాకిస్తాన్ వ్యూహపు ముఖ్య రూపురేఖలను మీరు సైతం చూడవచ్చు. పాకిస్తాన్‌వారితో చర్చలు జరపడం లేదా వారిని గౌరవించడం గాక, దానికి దూరంగా ఉండి... దాని నలుగురు అతిపెద్ద మద్దతుదార్లయిన అమెరికా, చైనా, యూఏఈ, సౌదీ అరేబియాలతో మాట్లాడుతు న్నారు.
ఢిల్లీలోని రేపిస్టు సౌదీ దౌత్యవేత్త విషయంలో, అక్కడ భారతీయ కార్మికుడ్ని చావబాదుతుండటం చూపుతున్న వీడియో విషయంలో భారత్ ఆగ్రహం ప్రద ర్శించకపోవడాన్ని కూడా అదే వివరించవచ్చు. మోదీ ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టిన సౌదీ అరేబియా పర్య టనకు హాని కలిగించేదేదీ చేయవద్దనుకుంటున్నారు. ఆ నాలుగు దేశాల పూర్తి మద్దతుంటే, పాకిస్తాన్ తన విధా నాలను మెత్తబరచక తప్పనిస్థితి ఏర్పడుతుందని ఆయన అంచనా.
పరిణతి చూపుతారా?
విదేశాంగ విధానం ప్రధానంగా ఓపికగా, జాగ్రత్తగా నిర్వహించాల్సిన కార్యకలాపం. దాని లక్ష్యాల సాధనలో పరస్పర వ్యక్తిగత సత్సంబంధాలు, సంభాషణలు, వృద్ధి చెందుతున్న భారత్ అనే ప్రతిష్ట, గొప్ప సానుకూలత లవుతాయి. మోదీలో ఈ లక్షణాలు కావలసినంతగా ఉన్నాయని ఆయన విమర్శకులు సైతం అంగీకరిస్తారు. కొత్తగా సమకూరిన ఈ అంతర్జాతీయ ఖ్యాతి తలకెక్కి మోదీ ఇకపై తన విదేశాంగ పర్యటనలు తగ్గించుకుని, దేశంలోని తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించకుండా ఉంటారా? అనేదే ఆయన ముందున్న పరీక్ష. ఆయన తన వాక్చాతుర్యంతో, కష్ట పడి పనిచేయడం ద్వారా ప్రపంచ వేదికపై నిజమైన విజ యాన్ని సాధించే ఆవకాశాన్ని సృష్టించారు. దాన్ని పరిణ తితో ఉపయోగించుకోవాలి. ఆ పని చేయకపోతే నష్టపోయేది ఆయనే.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta