International reputation
-
కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి
ఎన్నో ఏళ్లుగా విదేశాలకు ఎగుమతి అవుతూ, ప్రత్యేకతను సంతరించుకున్నా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో పంట అభివృద్ధికి బంగారుబాట ఏర్పడింది. రైతులకు కూడా మేలు చేకూరనుంది. కడప అగ్రికల్చర్/మైదుకూరు: కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు అరబ్ దేశాల్లో గిరాకీ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కల్పించింది. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు సభ్యు లు వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుసార్లు కేపీ ఉల్లికి గుర్తింపు ఇవ్వాలని విన్నవించడంతోనే ఇది సాధ్యమైందని రైతులు అంటున్నారు. బ్రిటీష్ వైశ్రాయ్‌ల పరిపాలనా కాలంలో కేపీ ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతూ వస్తోంది. మద్దతు ధర కల్పించాలని, పంట కనుమరుగై పోకుండా కాపాడాలని రైతు సంఘాలు పోరాటాలు చేశాయి. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గ రగా చూశారు. కుదేలైన వ్యవసాయానికి జవసత్వాలు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. కేపీ ఉల్లి పంటకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వచ్చేలా సహాయ సహకారాలు అందించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశీ ఎగుమతులకు ఢోకా ఉండదని, పంట పండినట్లేనని రైతులు అంటున్నారు. ►మైదుకూరు ప్రాంతం నుంచి కడపకు వచ్చే కేసీ కెనాల్ ద్వారా ఉల్లిగడ్డలు కడప సమీపంలోని కృష్ణాపురం రైల్వేస్టేషన్ వరకు పడవల ద్వారా రవాణా అయ్యేవని పెద్దలు సాహితీ వేత్త విద్వాన్ కట్టా నరసింహులు చెప్పారు. అక్కడి నుంచి నాటి మద్రాసు నేటి చెన్నై ఓడరేవు వరకు రైలులో వెళ్లేదన్నారు.అక్కడి నుంచి బ్రిటీషు వాళ్లు వారి దేశానికి ఎగుమతి చేసుకునే వారన్నారు. కేపీ ఉల్లిగడ్డలను మందులలో ముడి పదార్థంగా వాడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గత టీడీపీ ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులను ఛీకొడుతూ వచ్చింది. ఎగుమతులు లేని పంటను ఎందుకు సాగు చేయాలని నాటి సీఎం, నేటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అప్పట్లో తెగేసి చెప్పినట్లు రైతులు చర్చించుకుంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి పంట సాగు.....: బ్రిటీష్ వారి పరిపాలనా కాలం నుంచి కర్ణాటకలో మొదలై అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు ఈ పంట సాగవుతూ చిట్టిబళ్లారి, చిన్న బళ్లారి, రెడ్‌లేడీ, అగ్రిబ్రౌన్ రోజ్గా రూపాంతరం చెందింది. కేపీ ఉల్లిగా పేరు తెచ్చుకుని విస్తరించింది. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో లక్షల హెక్టార్లలో ఏటా సాగవుతూ ఉండేది. అయితే మన ప్రభుత్వాలు పంట దిగుబడిని ఎగుమతులు ఇవ్వకుండా మొండికేస్తూ వచ్చాయి. ధరలు పతనమవుతూ రావడంతో రైతులు పంట సాగు చేయడం తగ్గిస్తూ వచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు కేంద్రంగా మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, కలసపాడు, పోరుమావిళ్ల, కాశినాయన మండలాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాలు, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని మండలాల్లో మాత్రమే సాగవుతోంది. సంతోషకరం కేపీ ఉల్లి చారిత్రక పంట. బ్రిటిష్ కాలం కంటే ముందే ఈ పంటను రైతులు సాగు చేశారు. అయితే ఎన్నో ఏళ్లు ప్రభుత్వాలు కేపీ ఉల్లి రైతులను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ పంటకు భౌగోళిక గుర్తింపు రావడం సంతోషకరం. – లెక్కల వెంకటరెడ్డి, కేపీ ఉల్లి రైతుల సంఘం నాయకుడు, మైదుకూరు రైతు సంఘాల కృషి వల్లే రైతు సంఘాలు ఉద్యమాలు చేయడం వల్లే కేపీ ఉల్లి రైతులకు మేలు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు భౌగోళిక గుర్తింపు వల్ల పంటను అభివృద్ధి చేయాలి. – రాజమోహన్‌రెడ్డి, కేపీ ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం నాయకుడు, మైదుకూరు. -
అవకాశం చేజార్చుకుంటారా?
కేవలం ఒక్క ఏడాది కాలంలో మోదీ ప్రపంచంలోనే తీరుబడిలేనిదైన న్యూయార్క్ నగరంలో సైతం ఎక్కువగా మాట్లాడుకునే ప్రపంచ నేతల్లో ఒకరుగా ఎదగడం విశేషం. కొత్తగా సమకూరిన ఈ అంతర్జాతీయ ఖ్యాతి తలకెక్కి ఆయన ఇకపై తన విదేశాంగ పర్యటనలు తగ్గించుకుని, దేశంలోని తన ప్రతిష్టను ఇనుమడింప జేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించకుండా ఉంటారా? అనేదే ఆయన ముందున్న పరీక్ష. ఆయన తన వాక్చాతుర్యంతో, కష్టపడి పనిచేయడం ద్వారా ప్రపంచ వేదికపై నిజమైన విజయాన్ని సాధించే ఆవకాశాన్ని సృష్టించారు. దాన్ని పరిణతితో ఉపయోగించుకోవాలి. ఆ పని చేయకపోతే నష్టపోయేది ఆయనే. పత్రికా విలేకరులు ట్యాక్సీ డ్రైవర్ల మాటలను ఉల్లేఖిం చడం నగుబాటుకు, పరిహాసాలకు దారితీసేటంతటి అతి పాత ఎత్తుగడ. అయినాగానీ ట్యాక్సీ డ్రైవర్ వివేకం, పరిశీలనా శక్తి నుంచి నేర్చుకోవడం ఆపేయాల్సిన అవస రమేమీ లేదు. వాళ్లు, ప్రత్యేకించి న్యూయార్క్ ట్యాక్సీ డ్రైవర్లు మన పాత్రికేయుల కంటే ఎక్కువ చూస్తారు, వింటారు. పోప్ ఫ్రాన్సిస్ గురించి ఈ వారం వాళ్లు అదే పనిగా విన్నారు. పోప్ పర్యటన ఎప్పుడూ ట్రాఫిక్‌ను చిందరవందర చేసేస్తుంది. కాబట్టి ట్యాక్సీ డ్రైవర్లు ఆయన పర్యటనంటే చిరాకు పడటాన్ని మన్నించవచ్చు. ఐక్యరాజ్య సమితి వార్షిక సాధారణ సమావేశాలకు హాజ రయ్యే మరో ప్రభుత్వాధినేత గురించి కూడా వాళ్లిప్పుడు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ రెండో న్యూయార్క్ పర్యటనలో మొదటి దఫా ఉన్నంతటి సంరంభం లేదు. కానీ న్యూయార్క్‌లో ఈ వారం అతి ఎక్కువగా మాట్లాడుకుం టున్న దేశాధినేతల్లో ఆయన... ఒబామా, పోప్‌ల తదు పరి మూడోవారు. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడి దేశీ మద్దతుదార్లు రంగు రంగుల దుస్తులు, తలపాగాలు, డోలక్లు, పోస్టర్లు, బ్యానర్లతో భారదేశాన్ని ఆధునీకరి స్తున్న గొప్ప నేతగా ఆయన్ను కీర్తిస్తూ చేస్తే కోలాహలమే అందుకు చాలా వరకు కారణం. అందుకు భిన్నమైన స్వరం భారతీయులు ఎక్కువగా సందర్శించే మన్ హట్టన్ దిగువ తూర్పునున్న లిటిల్ ఇండియాగా పిలిచే ప్రాంతం నుంచి వినవస్తుంది. అది ఆయనను హంతకు డని అంటుంది. స్వదేశంలోలాగే విదేశాల్లో కూడా భార తీయులు మోదీ విషయంలో రెండు శిబిరాలుగా చీలి పోయి ఉంటారు. అయినా న్యూయార్క్ ట్యాక్సీ డ్రైవర్లు కూడా గమనించిన మొట్టమొదటి భారత నేత ఆయనే. మోదీకి ట్యాక్సీ డ్రైవర్ పరీక్ష కేవలం ఒక్క ఏడాది కాలంలో ఆయన ప్రపంచంలోనే తీరుబడిలేనిదైన ఆ నగరంలో సైతం ఎక్కువగా మాట్లా డుకునే ప్రపంచ నేతల్లో ఒకరుగా మోదీ స్థాయి ఎదగడం విశేషం. ఆయనకు రాజకీయ కుటుంబ వారసత్వ నేప థ్యం లేదు. ఇంగ్లిషులో పరిమితంగానే మాట్లాడుతారు. విద్యార్హతల విషయంలో ఆయన మునుపటి ప్రధానులు లేదా సహచరులలో చాలా మందికి సాటిరారు. ఇన్ని ప్రతికూలతలున్నా ఆయన అలాంటి గుర్తింపును పొంద డం మరింత విశేషం. ఏడాది క్రితం వరకు ఆయన పాశ్చాత్య ప్రపంచానికి ప్రయాణించడాన్ని సైతం అను మతించేవారు కారు. అయితేనేం నేడాయన ట్యాక్సీ డ్రైవర్ నాయకత్వ పరీక్షలో నెగ్గారు. ఈ సందర్భంగా నాకు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక యజమాని, ప్రచురణకర్త అయిన డాన్ గ్రాహమ్‌తో 1993లో జరిపిన సంభాషణ గుర్తుకొస్తోంది. వారి పత్రిక సహా అమెరికన్ ప్రసారమాధ్యమాలన్నీ పాకిస్తాన్, బెన జీర్ భుట్టోల గురించి తరచూ తగినన్ని కథనాలను వెలు వరిస్తున్నా, భారత్ గురించి మాత్రం అంత తక్కువ కథ నాలను, వార్తలను ఇస్తాయేమని అడిగాను. అదీ కూడా పీవీ నరసింహారావు ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థ తలుపులను తెరిచిన నాటి పరిస్థితి. (ఆ తదుపరి ఏడాది పీవీని అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ ఉభయ సభల సమా వేశానికి పరిచయం చేస్తూ ‘‘నర్ శర్మా రావ్’’ అనేటం తగా భారత్ విషయంలో వారి అజ్ఞానం ఉండేది.) ‘‘మా అమెరికన్లకు బలమైన వ్యక్తులు లేదా వంశాలు ప్రాతిని ధ్యం వహించని దేశాలపైన దృష్టిని కేంద్రీకరించేటంత తీరిక ఉండదు’’ అని గ్రాహం వివరించాడు. అంతర్జాతీయ అయస్కాంతం ఇరవై ఐదేళ్ల తర్వాత మోదీ ఆ లోటును పూడ్చారు. ఆయ నకు నెహ్రూ లేదా ఇందిరలకున్న నైతిక స్థాయిగానీ లేదా రాజీవ్గాంధీకున్న యవ్వనోత్సాహం నిండిన ఆకర్షణ గానీ ఉండకపోవచ్చు. కానీ ఆయన తనకున్న శక్తిని, అధి కారాన్ని ప్రదర్శించడం ద్వారా, క్షమాపణలు చెప్పుకునే ధోరణితోగాక బాహాటంగా మాట్లాడటం ద్వారా, భార తీయులకు అసహజమైన ఉద్వేగ భరితంగా మాట్లా డటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకున్నారు. దాదా పుగా ఆయన ఇంటర్వ్యూలే ఇవ్వకపోయినా పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఆయన్ను గుర్తిస్తున్నాయి. రూపర్ట్ మర్దోక్ ఆయన్ను కలుసుకున్నందువల్ల ఇలా అనడం లేదు. చైనాలో పునాదులు కదులుతున్న బడా వ్యాపార సంస్థలు ఆయనవైపు చూస్తున్నాయి. ఆయనకంటే చాలా చిన్నవారైన ప్రపంచ నేతలు లాంఛనప్రాయం కాని ఆయన స్వాభావిక ప్రవర్తనకు ఆకర్షితులవుతున్నారు. మోదీ ఎన్ఆర్ఐలను - ప్రత్యేకించి వ్యాపారులు, కిరాణా దుకాణదార్లు, హోటల్ యజమానులు, ఇమ్మి గ్రేషన్ న్యాయవాదులను గొప్పగా ఉపయోగించుకు న్నారు. తద్వారా ఆయన తను ప్రముఖంగా కనిపించేలా చేసుకున్నారు. ఆయన జరిపిన గత పర్యటనలో వారంతా మాడిసన్ స్క్వేర్ గార్డెన్ నిండిపోయేలా చేశారు. అదే ఆయన పర్యటనలోని మైలురాయి అయిం ది. అయితే ఆంతకన్నా ముఖ్యంగా ఆయన ఇప్పుడు భారత సాంకేతికవేత్తలను కూడా తన గుడారంలోకి తెచ్చుకోగలిగారు. గుజరాతీ ఎన్ఆర్ఐల లాగా వారంతా బీజేపీ మద్దతుదార్లేమీ కారు. కానీ వారికంటే అత్యంత ఎక్కువ పలుకుబడిగలవారు. కాబట్టే ఆయన సిలికాన్ వ్యాలీ, ఫేస్‌బుక్‌లలో ఒక రోజంతా గడిపారు. ప్రపంచ దేశాధినేతలందరిలోకీ ఒబామా తరువాత సామాజిక మాధ్యమాలను అత్యంత విస్తృతంగా, విజయవంతంగా ఉపయోగించుకున్నది ఆయనే. దౌత్య విజయానికి అపూర్వ అవకాశం అయితే అయన నూతనంగా సముపార్జించుకున్న ఈ అంతర్జాతీయ ఖ్యాతిని దేశంలోని అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారా లేక విదే శాంగ విధానపరమైన భారత ప్రయోజనాల పురోభి వృద్ధికి ఉపయోగిస్తారా అనేదే కీలక ప్రశ్న. ఐరాస సాధా రణ సమావేశాలకు ఏటా తీర్థయాత్ర సాగే దేశాధినేత లంతా తమ దేశ ప్రజలను లక్ష్యంగా చేసుకునే సుదీర్ఘ మైన ఉపన్యాసాలిస్తారని తరచుగా అంటుంటారు. మోదీ కూడా అలాంటి పని అంతో ఇంతో చేస్తారనడం ఖాయం. అయితే ఆయన తనకు కొత్తగా లభించిన స్థాయిని భారత విదేశాంగ విధానాల ప్రయోజనాలను పెంపొందింపజేయడానికి ఉపయోగించుకునే అపూర్వ అవకాశం కూడా ఉంది. ప్రత్యేకించి మన విదేశాంగ విధా నంలోని కొన్ని అంశాలను గతం కంటే విప్లవాత్మకంగా భిన్నమైన రీతిలో పునర్నిర్వచిస్తున్నట్టుంది. కాబట్టి ఇది మంచి అవకాశం అవుతుంది. సంకోచం వీడిన మన దౌత్యం గత రెండు దశాబ్దాలుగా భారత-అమెరికా సంబం ధాలు మరింత సుహృద్భావ పూర్వకమైనవిగా మారు తున్నాయి. మోదీ కాంగ్రెస్ ప్రభుత్వాల పాత సంకోచ ం లేదా తటపటాయింపును వీడి వాటికి కొత్త ఊపును ఇచ్చారు. మన్మోహన్సింగ్, వాజ్‌పేయి ప్రభుత్వాలతో కూడా అమెరికాలోని కీలక విధానకర్తలకు సుహృద్భావ పూరితమైన, పరస్పర విశ్వాసం గలిగిన సత్సంబంధా లుండేవి. కానీ వారిద్దరిలో ఎవరూ మోదీ అంతటి ఉత్సాహభరితంగా, శక్తివంతంగా, తటపటాయింపులు లేనితనాన్ని ప్రదర్శించలేదు. బాగా వంటబట్టిపోయిన పాత అమెరికా వ్యతిరేకతకు ఆయన అంతం పలికేశా రనేది అంతా గుర్తించినదే. ప్రభుత్వం నుంచి ప్రభు త్వానికి ఆయుధ సంపత్తి సరఫరాకు ఆర్డర్లను ఇవ్వడాన్ని ఆయన విదేశాంగ విధాన సాధనంగా కూడా ఉపయో గిస్తున్నారు. పారిస్‌లో రాఫేల్ యుద్ధ విమానాల కొను గోలు ప్రకటన చేసిన వెంటనే ఆయన తన పర్యటన సందర్భంగా అమెరికా హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. అమెరికా వ్యతిరేకతకు చెల్లు చీటీ పాకిస్తాన్, చైనాలతో కలసిన ఊపిరి సలపని త్రికోణపు విదేశాంగ విధానం నుంచి బయటపడే విషయంలో ఆయన మన్మోహన్సింగ్ విధానానికి సరికొత్త రూపు రేఖలు దిద్దారు. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్‌తో సంబం ధాల కోసం చేయిచాస్తే, మోదీ ముందుగా చైనాతో మాట్లాడటమే మంచిదనుకున్నారు. ఆయన నూతన పాకిస్తాన్ వ్యూహపు ముఖ్య రూపురేఖలను మీరు సైతం చూడవచ్చు. పాకిస్తాన్వారితో చర్చలు జరపడం లేదా వారిని గౌరవించడం గాక, దానికి దూరంగా ఉండి... దాని నలుగురు అతిపెద్ద మద్దతుదార్లయిన అమెరికా, చైనా, యూఏఈ, సౌదీ అరేబియాలతో మాట్లాడుతు న్నారు. ఢిల్లీలోని రేపిస్టు సౌదీ దౌత్యవేత్త విషయంలో, అక్కడ భారతీయ కార్మికుడ్ని చావబాదుతుండటం చూపుతున్న వీడియో విషయంలో భారత్ ఆగ్రహం ప్రద ర్శించకపోవడాన్ని కూడా అదే వివరించవచ్చు. మోదీ ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టిన సౌదీ అరేబియా పర్య టనకు హాని కలిగించేదేదీ చేయవద్దనుకుంటున్నారు. ఆ నాలుగు దేశాల పూర్తి మద్దతుంటే, పాకిస్తాన్ తన విధా నాలను మెత్తబరచక తప్పనిస్థితి ఏర్పడుతుందని ఆయన అంచనా. పరిణతి చూపుతారా? విదేశాంగ విధానం ప్రధానంగా ఓపికగా, జాగ్రత్తగా నిర్వహించాల్సిన కార్యకలాపం. దాని లక్ష్యాల సాధనలో పరస్పర వ్యక్తిగత సత్సంబంధాలు, సంభాషణలు, వృద్ధి చెందుతున్న భారత్ అనే ప్రతిష్ట, గొప్ప సానుకూలత లవుతాయి. మోదీలో ఈ లక్షణాలు కావలసినంతగా ఉన్నాయని ఆయన విమర్శకులు సైతం అంగీకరిస్తారు. కొత్తగా సమకూరిన ఈ అంతర్జాతీయ ఖ్యాతి తలకెక్కి మోదీ ఇకపై తన విదేశాంగ పర్యటనలు తగ్గించుకుని, దేశంలోని తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించకుండా ఉంటారా? అనేదే ఆయన ముందున్న పరీక్ష. ఆయన తన వాక్చాతుర్యంతో, కష్ట పడి పనిచేయడం ద్వారా ప్రపంచ వేదికపై నిజమైన విజ యాన్ని సాధించే ఆవకాశాన్ని సృష్టించారు. దాన్ని పరిణ తితో ఉపయోగించుకోవాలి. ఆ పని చేయకపోతే నష్టపోయేది ఆయనే. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
రెక్కలు తొడిగిన ఆశలు
రాష్ట్రానికి తొలిసారిగా పౌరవిమానయానశాఖ విశాఖ విమానాశ్రయానికి మంచి రోజులు అంతర్జాతీయఖ్యాతి వస్తుందని ప్రయాణికుల ఆశాభావం గోపాలపట్నం, న్యూస్‌లైన్: విశాఖ విమానాశ్రయానికి మంచి రోజులొస్తాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి పదవి దక్కడంతో కోస్తాంధ్ర వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకూ పౌరవిమానయానశాఖ మంత్రి పదవులు ఇతర రాష్ట్రాల వారికే దక్కాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎంపీ అశోక్ గజపతికి ఈ పదవి దక్కడం విశేషం. అశోక్ గజపతి వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల సరసన విశాఖ విమానాశ్రయం చేరుతుందని, కోస్తాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే విశాఖ విమానాశ్రయం నుంచి ఆరు విమాన సంస్థలు 34 సర్వీసులు నడుపుతున్నాయి. దేశ విదేశాలకు విమానాలు నడుస్తున్నాయి. ఏటా 11 లక్షలు ప్రయాణిస్తున్నారు. తాజాగా అశోక్ గజపతికి పౌరవిమానయానశాఖ పదవి లభించడంతో పెట్టుబడిదారులతో ఆర్థిక పురోగతి సాధించడంతో పాటు పారిశ్రామిక ప్రగతి ఉంటుందని కోస్తాంధ్రవాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కష్టాలు తీరాలి : విశాఖలో ఫార్మా, ఐటీ, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నా పూర్తిస్థాయి విదేశీ విమానాలు రావడం లేదు. ఒకవేళ విదేశీ విమాన సంస్థలు వచ్చినా ప్రభుత్వం అనుమతించడంలేదన్న విమర్శలున్నాయి. పాత విమానాశ్రయాన్ని కంటైనర్ కార్గో టెర్మినల్‌గా అభివృద్ది చేస్తామని చెప్పినా ఇంతవరకు చేయలేదు. దీంతో కంపెనీలు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. 24బై7 సేవలకు నేవీ మోకాలడ్డుతోంది. దీని వల్ల విదేశీ క్లయింట్ల రాకపోకలకు, విశాఖ వాసులకు అసౌకర్యంగా ఉంది. శుభపరిణామం అశోక్ గజపతి పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం హర్షణీయం.. శుభపరిణామం. విశాఖ ఎయిర్ పోర్టుకు ఇంకా పలు దేశీయ, విదేశీయ విమానాలు వస్తాయి. ఆశోక్ చొరవతో విశాఖకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం ఉంది. కోలాలంపూర్, బాంకాక్, షార్జా, శ్రీలంక తదితర దేశాలకు విమానాలు నడిపే విధంగా ఆయనపై ఒత్తిడి తెస్తాం. - డి.వరదారెడ్డి, భారత విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు -
..ఆ ‘భాగ్య’మేది
* మహానేత మరణంతో కొండెక్కిన అభివృద్ధి * వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచిన ప్రభుత్వాలు * మహా నగరాభివృద్ధి తుంగలోకి.. పెద్దిశెట్టి వెంకటనారాయణ, సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి అంతాఇంతా కాదు. మౌలిక వసతుల కల్పనకు ఆయన ఎంతగానో శ్రమించారు. గ్రేటర్ సిటీ భవిష్యత్తుపై ముందుచూపుతో వ్యవహరించి ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు రూపమిచ్చారు. శివారు ప్రాంతాలను నగరానికి అనుసంధానిస్తూ నాలుగు జిల్లాల పరిధిలో 849 గ్రామాలతో కలిపి మొత్తం 5965 చ.కి.మీ. విస్తీర్ణంలో మాస్టర్‌ప్లాన్ నిర్దేశించడం వైఎస్ విజన్‌కు అద్దం పడుతోంది. వచ్చే వందేళ్లలో నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్, రవాణా అవసరాలను మెరుగుపర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా నగరం వెలుపల 158 కి.మీ. పరిధిలో 8 లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సిటీలో ఇన్నర్ రింగ్‌రోడ్లు, ఫ్లై ఓవర్లు వంటివాటిని అభివృద్ధి చేసి కొత్త రవాణా మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నగరంలో ఇంటిలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఐటీఎస్) అమలు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్ కలలుగన్నారు. అయితే మహానేత అకాల మరణంతో ఆయన తలపెట్టిన పలు పథకాలకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడంతో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అవే కనుక పూర్తయి ఉంటే.. భాగ్యనగరం భూతల స్వర్గంగా విరాజిల్లేది. అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం దక్కేది. అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ ఆదర్శనగరంగా కీర్తి గడించేంది. కానీ మహానేత మరణంతో భాగ్యనగరానికి అభివృద్ధి ఫలాలు అందకుండా పోయాయి. రూ. 7,000 కోట్లు: ఔటర్ రింగ్‌రోడ్డుకు కేటాయించిన మొత్తం రూ. 2000 కోట్లు: పాతబస్తీ అభివృద్ధికి ప్రకటించిన ప్యాకేజీ రూ. 439కోట్లు: పీవీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి మంజూరైన నిధులు రూ. 370కోట్లు: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు కేటాయించిన మొత్తం రూ. 200 కోట్లు: ఉస్మానియాలో ఏడంతుస్తుల అధునాతన భవన నిర్మాణానికి కేటాయింపులు రూ. 27కోట్లు: నవజాత శిశువుల కోసం నిలోఫర్‌లో 150 పడకల రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవ నానికి కేటాయించిన సొమ్ము రూ. 25కోట్లు: నగరంలోని విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం మంజూరు చేసిన మొత్తం రూ. 20కోట్లు: 36 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రుణమాఫీ కోసం ఖర్చుచేసింది 1.53లక్షలు: ఐటీ రంగంలో లభించిన ఉద్యోగాల సంఖ్య 78,000: పేదల కోసం మంజూరు చేయించిన ఇళ్లు 24శాతం నగరంలోని గ్రీన్‌స్పేస్ అసంపూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు రూ.ఏడువేల కోట్ల భారీ వ్యయంతో 158 కి.మీ మేర నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని వైఎస్ హయాంలో తలపెట్టారు. నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్ చిక్కుల నేపథ్యంలో 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో దీనికి రూపకల్పన చేశారు. 2012నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వైఎస్ తర్వాత వచ్చిన పాలకులు దీనిని పూర్తిచేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం శామీర్‌పేట నుంచి పెద్ద అంబర్‌పేట వరకు 35 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. వైఎస్ హయాంలో పరుగులు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులపై ఆ తర్వాత ప్రభుత్వం కనీసం సమీక్షలు కూడా నిర్వహించకపోవడంతో అసలు ఔటర్ పూర్తవుతుందా ? అన్న అనుమానం కలుగుతోంది. పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై నిర్లక్ష్యం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా రూ.600కోట్ల వ్యయంతో పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేశారు. నగరం నుంచి కేవలం 25 నిమిషాల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా ఈ మార్గాన్ని రూపొందించారు. మొత్తం 11.6 కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినా 2 ర్యాంపులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతోంది. నిధులున్నా దీన్ని పూర్తిచేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడం పక్షపాత ధోరణికి అద్దం పడుతోంది. సాగుతున్న ‘సాగర్’ ప్రక్షాళన నగరంలోని హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని ప్రధాన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ.370కోట్ల వ్యయంతో ప్రక్షాళన ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో శ్రీకారం చుట్టారు. నిర్ణీత గడువు మేరకు 2012నాటికి ప్రాజెక్టు పనులన్నీ పూర్తవ్వాలి. కానీ ఈ ప్రాజెక్టుపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడంతో గడువు ముగిసి రెండేళ్లవుతున్నా సగం పనులు కూడా పూర్తవలేదు. పాటిగడ్డ వద్ద 30ఎంఎల్డీ ఎస్టీపీల నిర్మాణం పూర్తయినా ఇంతవకు దాని పనితీరును పాలకులు పరిశీలించిన పాపాన పోలేదు. ఇప్పటికే రూ.200కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినా ఈ ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది జవాబులేని ప్రశ్న. మొండిగోడల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాతబస్తీలోని కాటేదాన్‌లో రూ.ఏడుకోట్ల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పట్లో వైఎస్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సగం నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ కాంప్లెక్స్ జననేత మరణంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. దీనిగురించి పట్టించుకునేవారే లేకపోవడంతో రూ.మూడుకోట్ల ప్రజాధనం వృథా అయింది. ఇప్పుడిక్కడ కనిపిస్తున్న మొండిగోడలు నాటి ఆలోచనకు ఆనవాళ్లుగా మిగిలాయి. విద్యార్థులకు అండగా.. ఉన్నత విద్య అభ్యసించేందుకు పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి కొండంత అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి భరోసా ఇచ్చారు. అప్పటికే కట్టిన ఫీజులను వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు. ఒక్క నగరంలోనే 51731 మంది విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరు చేశారు. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించారు. మరో 5594 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించింది. దీనికోసం రూ.4.17 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రుణమాఫీ నగరంలోని సుమారు 36 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు వైఎస్ పూర్తిగా రుణమాఫీ ప్రకటించారు. ఇందుకోసం రూ.20కోట్లు ఖర్చుచేశారు. చంద్రబాబు హయాంలో పాతికవేలమంది కూడా లేని పింఛన్‌దారుల సంఖ్యను వైఎస్ లక్షాపన్నెండు వేలకు పెంచారు. అప్పటి వరకు రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200 చేశారు. ‘బాబు’ హయాంలో వికలాంగుల పింఛన్ రూ.75 ఉండగా.. వైఎస్సార్ దానిని రూ.500 చేశారు. బాబు జమానాలో ఉద్యోగులు ఏనాడూ 17శాతానికి మించి అందుకోని మధ్యంతర భృతిని వైఎస్సార్ హయాంలో 22శాతం అందుకున్నారు. విద్య, వైద్య రంగాల్లో మైనారిటీలు సమున్నత స్థానం సాధించాలన్నదే మా ప్రభుత్వ అభిమతం. అందుకే వారి సంక్షేమం కోసం బడ్జెట్‌ను రూ.4 కోట్ల నుంచి రూ.208 కోట్లకు పెంచాం. 4 శాతం రిజర్వేషన్లు కల్పించాం. స్కాలర్షిప్ బడ్జెట్‌ను రూ.127 కోట్లకు పెంచాం. - మైనారిటీ దినోత్సవాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లువలా పెట్టుబడులు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. చిన్న,లఘు పరిశ్రమల్లో 50.6 శాతం పెట్టుబడులు వచ్చాయి. మౌలిక వసతుల కల్పన, ఉత్పత్తి విభాగాలకు ప్రోత్సాహం లభించింది. సుమారు 1.20లక్షల మందికి ఉపాధి లభించింది. 82వేల మంది నిరుద్యోగులైన విద్యావంతులను ఎంపిక చేసి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వగా 55వేలమందికి ఉపాధి లభించింది. రాజీవ్ ఉద్యోగశ్రీ కింద ప్రైవేటు రంగంలో 22 వేల మందికి ఉపాధి కల్పించగా, రాజీవ్ యువశక్తి పథకం కింద 29 వేల మందికి ఆర్థిక సాయం అందించడంతో వివిధ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఐటీ రంగంలో 1.53 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. నిరుపేదలందరికీ తెల్లరేషన్ కార్డులు వైఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికీ తెల్లరేషన్ కార్డులు అందించారు. ఇందుకోసం గ్రామాల్లో గతంలో రూ.20వేలు ఉన్న ఆదాయ పరిమితిని రూ.60వేలకు, పట్టణాల్లో రూ.25వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో రేషన్‌కార్డుల సంఖ్య 5.28 లక్షలకు, రంగారెడ్డి జిల్లాలో 8.81 లక్షలకు చేరింది. చౌకబియ్యం ధరను రెండు రూపాయలు చేశారు. తెల్లరేషన్‌కార్డుదారులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశారు.