వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనేందుకు అమెరికా, నాటో సభ్యదేశాలు సంకోచిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై నేరుగా దండెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న సందేహాలు లేకపోలేదు. ఉక్రెయిన్ నుంచి రష్యా సేనలను ఇప్పటికిప్పుడు బయటకు తరిమేయడం సాధ్యం కాదు కాబట్టి అమెరికా ప్రభుత్వ పెద్దలు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆధ్వర్యంలోనే పొరుగు దేశం పోలండ్‌లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అమెరికా దృష్టి పెట్టినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది. ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని అధికారిక ప్రభుత్వంగా గుర్తించడంతోపాటు తగిన సాయం అందించడానికి పశ్చిమ దేశాలు రంగం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా స్వాధీనం చేసుకునే పరిస్థితి తలెత్తితే మాత్రం ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పదని అమెరికా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
(చదవండి: మాట తప్పిన రష్యా: ‘ఆపరేషన్ గంగ’కు ఆఖరి దశలో అడ్డంకులు!)
Comments
Please login to add a commentAdd a comment