Cancer Traces Found In 2000-Years Old Ancient Egyptian Mummy, Says Study - Sakshi
Sakshi News home page

Cancer Traces In Egypt Mummy: ఆ మమ్మీకి అరుదైన కేన్సర్‌ ?

Jul 15 2022 5:52 AM | Updated on Jul 15 2022 9:43 AM

Cancer Traces Found In Egyptian Mummy - Sakshi

వార్సా: రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్‌ మమ్మీ అవశేషాల్లో ఒక అరుదైన కేన్సర్‌ ఆనవాళ్లు కనిపించాయి.  19వ శతాబ్దంలో ఈ మమ్మీని పరిశోధనల కోసం ఈజిప్టు నుంచి పోలండ్‌కు తీసుకువచ్చారు. అప్పుడే శాస్త్రవేత్తలు ఈ మమ్మీ గర్భిణిగా ఉన్నప్పుడే మరణించిందని నిర్ధారించారు. గర్భిణిగా ఉన్న ఒక ఈజిప్టు మమ్మీ లభించడం ప్రపంచంలో అదే తొలిసారి. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉంటుందని, మరణించే సమయానికి 28 వారాల గర్భంతో ఉన్నట్టు తేలింది.

ఇప్పుడు ఈ అరుదైన కేన్సర్‌ గురించి వెలుగులోకి వచ్చింది. పోలండ్‌లోని వార్సా మమ్మీ ప్రాజెక్టుకి (డబ్ల్యూఎంపీ) చెందిన శాస్త్రవేత్తలు తాము చేస్తున్న అధ్యయనాల్లో భాగంగా ఆ మమ్మీ పుర్రెకి స్కానింగ్‌ తీయగా ఎముకల్లో కొన్ని గాయాల గుర్తులు కనిపించాయి. నేజోఫరెంజియో అనే అరుదైన కేన్సర్‌ సోకే రోగుల ఎముకల్లో ఇలాంటి గురుతులే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ మమ్మీ అదే కేన్సర్‌తో మరణించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఒకరకమైన గొంతు కేన్సర్‌. ముక్కు వెనుక భాగం నుంచి నోటి వెనుక భాగాన్ని కలిపి ఉంచే భాగానికి ఈ కేన్సర్‌ సోకుతుంది. డబ్ల్యూఎంపీ ఈ పుర్రె భాగానికి చెందిన ఫోటోలను విడుదల చేసింది. అందులో ఎముకలపై కనిపించిన కొన్ని మార్కింగ్‌లను చూస్తే అవి కేన్సర్‌ వల్ల ఏర్పడినవని భావిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement