పూల సోయగం | Beauty of Flowers | Sakshi
Sakshi News home page

పూల సోయగం

Published Sun, Feb 5 2017 1:43 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

పూల సోయగం - Sakshi

పూల సోయగం

జలిపీ... పోలాండ్‌లోని ఈ చిన్న కుగ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనున్న ఫొటోలను చూడగానే ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. అక్కడున్న అన్ని ఇళ్లకు ఇలా పూల డిజైన్‌లో చక్కగా పెయింటింగ్‌ చేశారు. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. చాలా ఏళ్ల క్రితం ఈ గ్రామంలోని ఒక ఇంట్లో వంటస్టవ్‌ వాడకం వల్ల ఆ ఇంటి సీలింగ్‌ మొత్తం మసిబారిపోయి నల్లగా అందవిహీనంగా తయారయింది. దీంతో ఏమి చేయాలో పాలుపోక ఆ ఇంటి యజమాని ఎంతో ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాడు.

ఆ మసి చారలపై పూల డిజైన్‌తో ఒక పెయింటింగ్‌ వేస్తే ఎలా ఉంటుంది అని భావించాడు. అనుకున్నదే తడవుగా దాన్ని అమల్లో పెట్టాడు. దాన్ని కాస్తా ఆ ఊరి జనం మొత్తం మెచ్చుకుని అతనిని అనుసరించారు. కాలక్రమేణా ఆ పెయింటింగ్స్‌ ఇంట్లోనూ, ఇంటి బయటి గోడలపై, ఆరుబయటకి సైతం విస్తరించి ఆ ప్రాంతమంతటిని ఇలా అందంగా మార్చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement