
శ్రీనాథ్‌రెడ్డి (ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా, అట్లూరు : మండలంలోని వరదరాజుపల్లె గ్రామానికి చెందిన మాచునూరు శ్రీనాథ్‌రెడ్డి (23) జర్మనీలోని పోలాండ్‌లో మృతి చెందినట్లు మృతుని బంధువులు గురువారం తెలిపారు. శ్రీనాథ్‌రెడ్డి పోలాండ్‌లో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఎంఎస్ చేస్తున్నాడని, సోమవారం రాత్రి అతను ఉంటున్న గదికి వచ్చి ఇంటికి ఫోన్ చేశాడని, మంగళవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం అందిందన్నారు. ఎలా చనిపోయాడో సమాచారం ఇంత వరకు తెలియరాలేదని వారు తెలిపారు.
శోకసంద్రంలో తల్లిదండ్రులు
రమణారెడ్డి, సుజాత దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కాగా పెద్దవాడైన శ్రీనాథ్‌రెడ్డి చదువులో రాణిస్తుండటంతో ఉన్నత చదువులు చదివించాలనే ఆశయంతో జర్మనీకి పంపించారు. ఎదిగి వచ్చిన కుమారుడు కన్ను మూయడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment