
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో శుక్రవారం భారత్ 3–1తో పోలాండ్‌పై గెలుపొందింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (21వ, 26వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... డ్రాగ్ ఫ్లిక్కర్ హర్మన్‌ప్రీత్ సింగ్ (36వ ని.) ఒక గోల్ చేశాడు. పోలాండ్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మాతెజ్ హల్‌బోజ్ (25వ ని.) సాధించాడు. శుక్రవారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ 3–1తో మెక్సికోపై, రష్యా 12–1తో ఉజ్బెకిస్తాన్‌పై విజయం సాధించాయి. సోమవారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment