ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సౌదీ అరేబియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడి అర్జెంటీనా అందరికి షాక్ ఇచ్చింది. అయితే మెక్సికోతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం అద్భుత విజయంతో అర్జెంటీనా ప్రి క్వార్టర్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తాజాగా బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెస్సీ బృందం పోలాండ్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఎవరితో సంబంధం లేకుండా నేరుగా ప్రిక్వార్టర్స్ చేరుతుంది.. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉన్నప్పటికి అర్జెంటీనా ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెస్సీ మరోసారి మెరవాల్సిన సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్‌తో మెరిసినప్పటికి జట్టు ఓటమి పాలయింది. ఇక మెక్సికోతో రెండో మ్యాచ్‌లో మాత్రం మెస్సీ తనకు మాత్రమే సాధ్యమైన గోల్ కొట్టి అర్జెంటీనాను విజయం వైపు నడిపించాడు.
ఇక పోలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా మెస్సీ ముందు మూడు అరుదైన రికార్డులు ఎదురుచూస్తున్నాయి. వీటిలో రెండు రికార్డులు మాత్రం మ్యాచ్‌లో బరిలోకి దిగితే వస్తాయి.. మరొక రికార్డు మాత్రం మెస్సీ కొట్టే గోల్స్‌పై ఆధారపడి ఉంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
► పోలాండ్‌తో మ్యాచ్ మెస్సీకి తన ఫుట్‌బాల్ కెరీర్‌లో 999వది కావడం విశేషం.
► ఇక ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. పోలాండ్‌తో మ్యాచ్ మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 22వది. దీంతో మారడోనా(21 మ్యాచ్‌లు)ను అధిగమించి మెస్సీ తొలి స్థానంలో నిలవనున్నాడు.
► ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ ఇప్పటివరకు ఎనిమిది గోల్స్ చేశాడు. మారడోనాతో సమానంగా ఉన్న మెస్సీ మరొక రెండు గోల్స్ చేస్తే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలుస్తాడు. ఇప్పటివరకు అర్జెంటీనా దిగ్గజం గాబ్రియెల్ బటిస్టువా 10 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేస్తే గాబ్రియెల్ సరసన.. మూడు గోల్స్ చేస్తే అర్జెంటీనా తరపున ఫిఫా ప్రపంచకప్‌లలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలవనున్నాడు.
చదవండి: FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు
Comments
Please login to add a commentAdd a comment