ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటన
పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో సమావేశం
ద్వైపాక్షిక అంశాలపై చర్చ.. పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం
భారత్–పోలండ్ మధ్య కుదిరిన సామాజిక భద్రతా ఒప్పందం
వార్సా: ఏ సమస్యకైనా సరే యుద్ధక్షేత్రంలో పరిష్కారం దొరకదని తాము బలంగా నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సంఘర్షణలు, వివాదాలను శాంతియుతంగా దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవడమే ఉత్తమమైన విధానమని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించడానికి తాము చేయగలిగే పూర్తిసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పోలండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రెండో రోజు గురువారం పోలండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్‌్కతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
భారత్–పోలండ్ మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఒకదేశానికి చెందిన నైపుణ్యం కలిగిన కారి్మకులు మరో దేశంలో సులువుగా ఉద్యోగాలు పొందడానికి వీలు కలి్పంచే సామాజిక భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనాలు, ఫార్మాస్యూటికల్స్, పట్టణ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, కృత్రిమ మేధ(ఏఐ), అంతరిక్షం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. డొనాల్డ్ టస్‌్కతో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో చర్చించిన కీలక అంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాలపై ఆందోళన వ్యక్తంచేశారు.
ఆ సంస్థలను సంస్కరించాలి
భారత్–పోలండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండుతున్నాయని, ఈ సందర్భంగా ఇరు దేశాల నడుమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. సామాజిక భద్రతా ఒప్పందంతో నైపుణ్యం కలిగిన కారి్మకులకు, ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వారి సంక్షేమం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 2022లో ఉక్రెయిన్–రష్యా ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను క్షేమంగా వెనక్కి రప్పించడానికి సహకరించినందుకు పోలండ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై పోలండ్ సైతం తనతో ఏకీభవించిందని తెలిపారు.
భారత్‌కు అభినందనలు: డొనాల్డ్ టస్క్
ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న యుద్ధాలపై మోదీ, తాను చర్చించామని టస్క్ వివరించారు. వాటిపై స్పష్టతకు వచ్చామన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికి, శాంతిని నెలకొల్పేందుకు వ్యక్తిగతంగా కృషి చేయడానికి మోదీ సంసిద్ధత వ్యక్తం చేయడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. భారత్‌తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment