Donald Tusk
-
ఉక్రెయిన్‌లో శాంతికి సహకారం
వార్సా: ఏ సమస్యకైనా సరే యుద్ధక్షేత్రంలో పరిష్కారం దొరకదని తాము బలంగా నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సంఘర్షణలు, వివాదాలను శాంతియుతంగా దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవడమే ఉత్తమమైన విధానమని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించడానికి తాము చేయగలిగే పూర్తిసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పోలండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రెండో రోజు గురువారం పోలండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్‌్కతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్–పోలండ్ మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఒకదేశానికి చెందిన నైపుణ్యం కలిగిన కారి్మకులు మరో దేశంలో సులువుగా ఉద్యోగాలు పొందడానికి వీలు కలి్పంచే సామాజిక భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనాలు, ఫార్మాస్యూటికల్స్, పట్టణ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, కృత్రిమ మేధ(ఏఐ), అంతరిక్షం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. డొనాల్డ్ టస్‌్కతో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో చర్చించిన కీలక అంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఆ సంస్థలను సంస్కరించాలిభారత్–పోలండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండుతున్నాయని, ఈ సందర్భంగా ఇరు దేశాల నడుమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. సామాజిక భద్రతా ఒప్పందంతో నైపుణ్యం కలిగిన కారి్మకులకు, ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వారి సంక్షేమం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 2022లో ఉక్రెయిన్–రష్యా ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను క్షేమంగా వెనక్కి రప్పించడానికి సహకరించినందుకు పోలండ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై పోలండ్ సైతం తనతో ఏకీభవించిందని తెలిపారు.భారత్‌కు అభినందనలు: డొనాల్డ్ టస్క్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న యుద్ధాలపై మోదీ, తాను చర్చించామని టస్క్ వివరించారు. వాటిపై స్పష్టతకు వచ్చామన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికి, శాంతిని నెలకొల్పేందుకు వ్యక్తిగతంగా కృషి చేయడానికి మోదీ సంసిద్ధత వ్యక్తం చేయడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. భారత్‌తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించారు. -
కౌంటింగ్‌కు కౌంటర్
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇదో అసాధారణ నిర్ణయం. విమర్శలు, వివాదాలు, క్షణక్షణం ఉత్కంఠ రేగే పరిస్థితుల మధ్య వ్యవహారం కోర్టు వరకు వెళుతోంది. మొదట్నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కోర్టుకెక్కుతామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ అమెరికా ప్రజల్ని మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ట్రంప్ దీనిపై సుప్రీంకోర్టుకి వెళతానని స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు శ్వేత సౌధంలో తన మద్దతుదారులనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మనమే గెలవబోతున్నాం. నా దృష్టిలో మనమే గెలిచాం. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి మనం కట్టుబడి ఉన్నాం. అందుకే చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటాం’’అని ట్రంప్ చెప్పారు. ‘‘వెంటనే పోస్టల్ బ్యాలెట్లను అనుమతించడం ఆపేయాలి. జో బైడెన్ శిబిరం దేశాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కి అనుమతిస్తున్నారు. నవంబర్ 3 అర్థరాత్రి తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్లను అనుమతించ కూడదు. అందుకే సుప్రీంకోర్టుకెళతాం’’అని ట్రంప్ తన అనుచరుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ట్రంప్ మొదట్నుంచి పోస్టల్ బ్యాలెట్‌ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఓట్లలో అక్రమాలకు ఆస్కారం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి సగం మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నింటినీ ఎదుర్కొంటాం: డెమొక్రాట్లు ఎన్నికల ఫలితాల్ని నిరోధించడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ శిబిరం విమర్శించింది. ట్రంప్ కోర్టుకి వెళ్లకుండా తమ న్యాయ నిపుణుల బృందం అడ్డుకుంటుందని బైడెన్ క్యాంపైన్ మేనేజర్ ఓ మల్లే డిల్లాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిలిపివేయాలని ట్రంప్ పేర్కొనడం అసాధారణం, అవమానకరమని ఆమె మండిపడ్డారు. ట్రంప్ చర్యలు సరైనవి కావన్న డిల్లాన్ ఓటింగ్ నిలిపివేయాలనడం అమెరికా పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమేనని అన్నారు. ట్రంప్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కోవడానికి తమ న్యాయనిపుణుల బృందం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలా చెయ్యడం కుదరదు: అమెరికా పోస్టల్ సర్వీసు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓట్లు అన్నింటీనీ మంగళవారం సాయంత్రానికల్లా కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలన్న న్యాయస్థానం ఆదేశాలను పాటించలేమని అమెరికా పోస్టల్ సర్వీసు స్పష్టం చేసింది. ప్రతీ రాష్ట్రంలోనూ రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రావడం వల్ల సమయం పడుతుందని పోస్టల్ సర్వీసు తరఫు లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించారు. కీలక రాష్ట్రాలుగా భావించే డజనుకి పైగా రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా ఓట్లు ఇంకా ఎన్నికల అధికారులకు అప్పగించవలసి ఉంది. -
బ్రెగ్జిట్ గడువు జనవరి 31
లండన్/బ్రసెల్స్: బ్రిటన్ పార్లమెంట్లో బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందడంలో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో మరో కీలక పరిణామం సంభవించింది. బ్రిటన్‌కు మరింత వెసులుబాటు ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంగీకరించింది. బ్రెగ్జిట్‌పై ఈనెలాఖరు వరకు ఉన్న గడువును మరో మూడు నెలలపాటు అంటే వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఈయూ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై యూనియన్‌లోని 27 సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ తాజాగా ట్విట్టర్లో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాత పూర్వకంగా వెల్లడిస్తామన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన పక్షంలో సాధ్యమైనంత త్వరగా..తాజాగా ప్రకటించిన గడువులోగానే ఈయూతో తెగదెంపులు చేసుకునే అవకాశం బ్రిటన్‌కు ఉందన్నారు. బ్రెగ్జిట్ గడువు పొడిగింపుపై ఈయూ పార్లమెంట్ చర్చించి, ఆమోదం తెలపాలంటే సత్వరమే దీనిపై బ్రిటన్ లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. బ్రెగ్జిట్ పొడిగింపుపై ఈయూ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈయూ పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చించి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువరించనుంది. దీని ప్రకారం.. జాన్సన్ ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పార్లమెంట్ నవంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 31వ తేదీల్లో ఎప్పుడు ఆమోదించినా.. ఆ వెంటనే బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేయనుంది. డిసెంబర్ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రవేశపెట్టనున్న తీర్మానంపై వచ్చే సోమవారం పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. -
బ్రెగ్జిట్‌కు జూన్ 30 దాకా గడువివ్వండి
లండన్: యురోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని బ్రిటన్ ఈయూ నాయకులను కోరింది. ఈ మేరకు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు లేఖ రాసినట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం పార్లమెంట్లో చెప్పారు. జూన్ 30కి మించి గడువు కోరుకోవడం లేదని, అంతకన్నా ఆలస్యమైతే మే నెల చివరన ఈయూ పార్లమెంట్ ఎన్నికలను బ్రిటనే నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, గురువారం, శుక్రవారం బ్రసెల్స్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈయూ సభ్య దేశాలు బ్రిటన్ వినతిపై ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. -
బేతాళ ప్రశ్నగా మారిన బ్రెగ్జిట్!
ఐరోపా దేశాల సంఘం(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాల్సిన గడువు సమీపిస్తున్నా రెండింటి మధ్య తెగతెంపుల ఒప్పందం కుదిదే అవకాశాలు కనిపించడం లేదు. బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చాక ఇంగ్లండ్‌లో అంతర్భాగమైన ఉత్తర ఐర్లండ్ ఐరోపా సింగల్ మార్కెట్లో కొనసాగేలా ఒప్పంద పత్రం ముసాయిదాను ఈయూ రూపొందిస్తోందనే సమాచారంపై తాజాగా వివాదం తలెత్తింది. ఐరోపా కస్టమ్స్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే విషయం సహా ఇంకా అనేక అంశాలపై తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి బ్రెగ్జిట్ ఒడంబడిక కుదరకపోవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 28 ఐరోపా దేశాల రాజకీయ, ఆర్థిక ఐక్యతకు స్థాపించిన ఈయూ నుంచి 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు ఇంగ్లండ్ నిష్క్రమించాలని దాదాపు రెండేళ్ల క్రితమే నిర్ణయించారు. ఉత్తర ఐర్లండ్ ఈయూలో కొనసాగేలా చేసే ఒప్పందంపై సంతకం పెట్టేది లేదనీ, బ్రిటన్ ‘రాజ్యాంగ సమగ్రత’పై రాజీపడబోనని ఇంగ్లండ్ ప్రధాని థెరిసా మే హెచ్చరించారు. ఐరోపా సంఘం నుంచి వైదొలిగినా బ్రిటన్ను ఐరోపా కస్టమ్స్ యూనియన్‌లో కొనసాగేలా ఒత్తిడి చేయడానికే ఉత్తర ఐర్లండ్ సమస్యను ఈయూ నేతలు ముందుకు తెచ్చారని కొందరు అనుమానిస్తున్నారు. ఐర్లండ్ సరిహద్దు వాణిజ్యంపై ఏర్పడుతున్న చిక్కుముడి వల్ల ఈయూతో ఒప్పందం కుదరకపోవచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసిన జనం ఆలోచన మారుతోందా? 2016 బ్రెగ్జిట్ జనాభిప్రాయసేకరణలో ఈయూ నుంచి బయటపడాలంటూ ఓటేసిన ప్రజల్లో చాలా మంది తమ అభిప్రాయం మార్చుకున్నారని గత ఆరు నెలలుగా చేసిన సర్వేలు చెబుతున్నాయి. బ్రెగ్జిట్‌పై రెండోసారి రెఫరెండం జరపాలని 47 శాతం పౌరులు కోరుతున్నారని ఇటీవల గార్డియన్ పత్రిక జరిపిన సర్వే వెల్లడించింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత బ్రసెల్స్ కేంద్రంగా పనిచేసే ఈయూ, ఇంగ్లండ్ ప్రధాని మే కుదుర్చుకునే ఒప్పందం బ్రిటన్ దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. బ్రెగ్జిట్ తుది ఒప్పందంపై కామన్స్సభలో స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఎంపీలకు ఇవ్వాలని పాలకపక్షం కన్సర్వేటివ్ పార్టీ మాజీ ప్రధాని జాన్ మేజర్ సహా పలువురు కోరుతున్నారు. ఈయూ నుంచి వైదొలగే విషయమై రెండో రెఫరెండం జరపడానికి, బ్రెగ్జిట్‌ను పూర్తిగా తిరస్కరించడానికి కూడా దిగువసభకు అవకాశమివ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు. తుది వాణిజ్య ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బయటికొస్తే ఇంగ్లండ్ జీడీపీ 8 శాతం తగ్గే ప్రమాదముందని బ్రెగ్జిట్‌పై బ్రిటిష్ సర్కారు అంచనా వేస్తోంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా అత్యధిక మద్దతు పలికిన ఈశాన్య, మిడ్లాండ్స్ వంటి ప్రాంతాలు అంతకు రెండు రెట్లు నష్టపోతాయని కూడా లీకైన ప్రభుత్వ నివేదిక చెబుతోంది. బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే కొత్త పార్టీ ‘రిన్యూ’ ఈయూ నుంచి వైదొలగకుండా బ్రిటన్ను ఆపడానికి ‘రిన్యూ’ అనే కొత్త పార్టీ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టి బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకాభిప్రాయం సాధించాలనే లక్ష్యంతో ‘లిసన్ టూ బ్రిటన్’ అనే ప్రచారోద్యమం ఆరంభించింది. ఇంగ్లండ్ ఈయూలోనే ఉండాలని వాదించే ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ అనే సంస్థకు అమెరికా బిలియనీర్ జార్జి సరోస్ ఐదు లక్షల పౌండ్ల విరాళం ఇచ్చారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రెగ్జిట్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేసేలా ఎంపీలపై ఈ సంస్థ ఒత్తిడితెస్తోంది. విస్తృత లాబీయింగ్ ద్వారా ఎంపీలకు నచ్చచెప్పి దేశంలో బ్రెగ్జిట్‌పై రెండో రిఫరెండం జరిపించడమే ఈ సంస్థ లక్ష్యం. సకాలంలో ఒప్పందం కుదరకపోతే... ఈయూ, బ్రిటన్ మధ్య ఒప్పందం అనుకున్న సమయానికి కుదరకపోతే బ్రిటన్ ఎక్కువ నష్టపోతుంది. ఇంగ్లండ్‌లో నివసిస్తున్న ఇతర ఈయూ దేశాల పౌరులు, ఈయూ దేశాల్లో స్థిరపడిన బ్రిటిష్ జాతీయుల నివాస హక్కులు గందరగోళంలో పడతాయి. ఈయూకు ఇంగ్లండ్ చెల్లుచీటీ ఇచ్చే విషయంపై లేదా ఈయూ సింగల్ మార్కెట్లో కొనసాడంపై ఒప్పందమేదీ కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారమే బ్రిటన్ ఇతర ఐరోపా దేశాలతో వ్యాపారం చేయాల్పివస్తుంది. ఇది ఆ దేశానికి నష్టదాయకంగా మారుతుంది. బ్రెగ్జిట్‌కు అధిక మద్దతు ఇచ్చిన ఇంగ్లండ్ రైతులు తమ ఉత్పత్తులను ఇతర ఈయూ దేశాలకు ఎగుమతి చేస్తే అదనంగా 30-40 శాతం సుంకాలు చెల్లించక తప్పదు. ఈయూ సభ్యత్వం ఉన్నందు వల్ల బ్రిటిష్ బ్యాంకులు, ఆర్థికసంస్థలు లండన్ నుంచి ఇతర సభ్య దేశాలతో అక్కడ ఎలాంటి అనుబంధ కంపెనీలు లేకుండా స్వేచ్ఛగా లావాదేవీలు సాగిస్తున్నాయి. బ్రెగ్జిట్ ఒప్పందం లేకుంటే ఈ సంస్థలకు ప్రస్తుతమున్న పాస్పోర్టింగ్ హక్కులు కోల్పోతాయి. ఇంకా లండన్ నుంచి పనిచేసే అనేక ఐరోపా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సిబ్బందిని, కార్యకలాపాలను తగ్గించుకుంటే స్థానికులు వేల సంఖ్యలో నిరుద్యోగులవుతారు. ‘చంద్రుడిపై మానవుడు కాలు మోపడమంత’ కష్టమా? ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపై జరిగే సంప్రదింపులు చంద్రునిపై మానవుడు కాలు మోపడమంత క్లిష్టంగా ఉందని బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ గతంలో వ్యాఖ్యానించారు. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఏడాది కాలమే ఉన్నా అవి ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. కీలకమైన వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు బ్రెగ్జిట్‌కు అనుగుణంగా సర్దుకోవడానికి రెండేళ్లు అవసరమని ఆయన వాదిస్తున్నారు. దీనిపై అంగీకారం కుదిరాక వచ్చే రెండేళ్లలో బ్రిటన్ వాస్తవానికి ఈయూలో కొనసాగుతున్నట్టే పరిస్థితి ఉంటుందని అంచనా. అందుకే మార్చి నాటికి బ్రిటన్-ఈయూ మధ్య ఒప్పందం కుదిరితే మేలని ఆయన భావిస్తున్నారు. వచ్చే అక్టోబర్ నాటికి ఈ ఒప్పందం ముసాయిదా ఒక కొలిక్చి వస్తే, 2019 మార్చి 19 లోగా ఐరోపా పార్లమెంటులో దాన్ని మిగిలిన 27 దేశాలతో ఆమోదింపచేయవచ్చని బ్రిటన్ భావిస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఈయూ.. బై బై..
యూరోపియన్ యూనియన్‌లో ఉండలేమని తేల్చిన బ్రిటన్ వాసులు - బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం మంది ఓటు - రాజీనామా చేస్తానంటూ బ్రిటన్ ప్రధాని ప్రకటన - అంతర్జాతీయంగా మార్కెట్ల అతలాకుతలం - స్టాక్స్, కరెన్సీలు, ముడిచమురు దారుణ పతనం - సురక్షిత పెట్టుబడిగా బంగారం మెరుపులు - మున్ముందు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు ప్రభావం ఇలా.. పౌండు చరిత్రాత్మక పతనం.. డాలర్ డ్రీమ్స్.. రూపాయి క్రాష్ బ్రిటన్‌తో లింకుంటే కుదేలే!! ఐటీలో అనిశ్చితి తప్పదు: నాస్కామ్ ఆందోళన అక్కర్లేదు: జైట్లీ భయపడొద్దు: రాజన్ బ్రిటన్‌తో విడిపోతాం - ఈయూతో కలిసుంటాం - బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో స్కాట్లాండ్ అడుగులు - ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఇవే డిమాండ్లు బ్రిటన్ పోతే పోనీ! డొనాల్డ్ టస్క్, ఈయూ అధ్యక్షుడు బ్రెగ్జిట్ ప్రభావం తమపై ఉండదని.. మిగిలిన 27 దేశాలతో కలిసి కూటమి బలంగానే ఉంటుందని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. రెఫరెండంపై బ్రిటన్లు పిచ్చి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఈయూలోని 27 దేశాల ప్రతినిధిగా చెబుతున్నా. మా ఐక్యత కొనసాగుతుంది’ అని టస్క్ తెలిపారు. ప్రజాతీర్పు వెల్లడైనందున ఈయూ నుంచి బ్రిటన్ వీలైనంత త్వరగా వెళ్లిపోయేలా ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు. అనవసర ఆలస్యం వల్ల అనిశ్చితి పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే.. బ్రిటన్ నిర్ణయంతో తమ కూటమిలో చీలిక వస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని ఈయూ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్ తెలిపారు. నిర్ణయాన్ని గౌరవిస్తాం అమెరికా అధ్యక్షుడు ఒబామా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని తమ దేశం గౌరవిస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. యునెటైడ్ కింగ్డమ్తోపాటు యూరోపియన్ యూనియన్ ఎప్పటిలాగే అమెరికా భాగస్వాములుగా కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లో జరిగిన రెఫరెండం ఫలితాలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. బ్రెగ్జిట్ అనంతర సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు ప్రశాంతమైన, స్థిరమైన, అనుభవం గల నాయకత్వం అవసరమని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. బ్రిటన్ ప్రజల ఎంపికను గౌరవిస్తున్నానంటూ ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇక సెలవ్!: డేవిడ్ కామెరాన్ (బ్రిటన్ ప్రధాని) ఈ చారిత్రక నిర్ణయంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవినుంచి తప్పుకోనున్నారు. బ్రెగ్జిట్ వ్యతిరేక వాదనను ముందుండి నడిపించిన కామెరాన్.. ఇకపైనా దేశాభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉంటుందని.. కొత్త నాయకత్వం దేశాన్ని ముందుకు నడపాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. టెన్ డౌనింగ్‌స్ట్రీట్ (యూకే ప్రధాని అధికారిక నివాసం) ముందు శుక్రవారం భార్య సమంతతో కలిసి ఉద్వేగంగా మాట్లాడిన కామెరాన్ ‘రెఫరెండం ప్రజాస్వామ్య విజయం. చారిత్రక నిర్ణయం. ఇందులో ప్రజల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఫలితాలపై ఎటువంటి సందేహం లేదు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లకు వచ్చే ప్రమాదం లేదని, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందని.. ప్రపంచ దేశాలకు భరోసా ఇస్తున్నాను’ అని తెలిపారు. అక్టోబర్‌లో జరగనున్న కన్సర్వేటివ్ కాన్ఫరెన్స్‌లో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారన్నారు. విజయం సాధించిన బ్రెగ్జిట్ అనుకూల వర్గానికి కామెరాన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజా నిర్ణయంతో బ్రిటన్‌లో ఉన్న ఇతర యూరోపియన్ దేశాల ప్రజలకు, యూరోపియన్ దేశాల్లో ఉన్న బ్రిటన్లకు ప్రస్తుతానికి ఎలాంటి సమస్యా లేదని ఇప్పటివరకున్నట్లుగానే వస్తువులు, సేవల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండవని కామెరాన్ తెలిపారు. ఇకపై యురోపియన్ యూనియన్‌తో చర్చించాల్సిన అంశాలపై వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరేళ్లపాటు యూకే ప్రధానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్న కామెరాన్.. తమ ప్రభుత్వం విద్య, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల, దృఢమైన సమాజ నిర్మాణంలో కృషి చేసి విజయం సాధించిందన్నారు. సోమవారం సమావేశం కానున్న బ్రిటన్ కేబినెట్.. కామెరాన్ పదవినుంచి తప్పుకునేందుకు తదుపరి చేయాల్సిన పనులను నిర్ణయించనుంది. 48.1 వ్యతిరేకం బ్రెగ్జిట్ అనుకూలం 51.9 సర్దుకునేందుకు కొంత సమయం: బోరిస్ జాన్సన్ (బ్రెగ్జిట్ ఉద్యమ నేత) రెఫరెండం తీర్పుతో ఉన్నపళంగా ఈయూతో తెగదెంపులు జరగవని.. అంతా సర్దుకునేందుకు కొంత సమయం పడుతుందని.. బ్రెగ్జిట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తెలిపారు. ‘ఇది ప్రజా నిర్ణయం. ప్రజాస్వామ్య విజయం. ప్రజలు తమ నిర్ణయాన్ని ధైర్యంగా తెలియజేశారనేదానికి ఇదే నిదర్శనం. అయితే రెఫరెండంతో ఉన్నపళంగా మార్పులు సాధ్యం కాదు. అన్ని సర్దుకునేందుకు కొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ప్రధాని కామెరాన్‌పై బోరిస్ ప్రశంసలు కురిపించారు. ‘కామెరాన్ మా తరం చూసిన అసాధారణ నాయకుడు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ధైర్యమున్న వ్యక్తి’ అని కొనియాడారు. యురోపియన్ యూనియన్ గొప్ప ఆలోచన.. కానీ ఇది బ్రిటన్‌కు సరిపోదని అభిప్రాయపడ్డారు. ఎప్పటికీ బ్రిటన్ యూరప్‌లో భాగమేనన్నారు. ఈయూ నుంచి విడిపోతామంటూ చరిత్రాత్మక నిర్ణయం లండన్: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవటం) వివాదంపై బ్రిటన్లు శుక్రవారం చారిత్రక నిర్ణయాన్ని వెలువరిచారు. ఈ వివాదంపై నాలుగు నెలల ఉత్కంఠకు తెరదీస్తూ.. ఈయూతో నాలుగున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకునేందుకే మెజారిటీ బ్రిటన్లు మొగ్గుచూపారు. దీంతో, ఈయూలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్.. ఈయూనుంచి తప్పుకోనున్న రెండో దేశంగా (గ్రీన్లాండ్ తర్వాత) నిలిచింది. గురువారం జరిగిన రెఫరెండంలో 51.9 శాతం మంది బ్రెగ్జిట్‌కే మద్దతు తెలిపారు. యూకే ఎన్నికల కమిషన్ చీఫ్ జెన్నీ వాట్సన్ ప్రతిష్ఠాత్మకమైన మాంచెస్టర్ టౌన్‌హాల్ నుంచి ఈ ఫలితాలను వెల్లడించారు. దాదాపు 3.3 కోట్ల మంది బ్రిటన్లు (ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, జీబ్రాల్టర్) రెఫరెండంలో పాల్గొనగా 1.74 కోట్ల మంది (51.9 శాతం) విడిపోవాలని.. 1.61 మంది (48.1 శాతం) ఈయూతో కలిసుండాలని తమ నిర్ణయాన్ని తెలియజేశారు. బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య తేడా 12.69 లక్షలు మాత్రమే. లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో ఎక్కువ మంది యురోపియన్ యూనియన్లోనే ఉండాలని తమ అభిప్రాయాన్ని తెలపగా.. ఉత్తర, మధ్య ఇంగ్లాండ్, వేల్స్, మెజారిటీ ఇంగ్లీష్ కౌంటీలు మాత్రం బ్రెగ్జిట్‌కే మొగ్గుచూపాయి. రెఫరెండం ఫలితంతో.. త్వరలోనే ప్రధాని పదవినుంచి తప్పుకోనున్నట్లు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరాన్ వెల్లడించారు. దేశాన్ని తదుపరి మజిలీకి తీసుకెళ్లటంలో తను సరైన వ్యక్తిని కాన్నారు. మూడు నెలల తర్వాత యూకేకు కొత్త ప్రధాని వస్తారని..ఆయన నాయకత్వంలోనే దేశం ముందుకెళ్తుందని కామెరాన్ స్పష్టం చేశారు. కామెరాన్ వారసుడిగా బ్రెగ్జిట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ పేరు వినబడుతోంది. పలువురు కన్జర్వేటివ్ పార్టీ నేతలూ పీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బ్రెగ్జిట్తో స్కాట్లాండ్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈయూలో యూకే కలిసుండాలని బలమైన ప్రజాభిప్రాయాన్ని తెలిపిన స్కాట్లాండ్.. తాజా ఫలితంతో.. యూకే నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఈయూలో కలవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జియాన్ ఈ విషయాన్ని చూచాయగా వ్యక్తం చేశారు. రెఫరెండం తర్వాత దేశం రెండుగా విడిపోయిందని.. అమెరికా, భారత్, చైనావంటి దేశాలతో ఈయూతో కలిసి వ్యాపారం చేసే అవకాశాన్ని కోల్పోయిందని కామెరాన్‌కు అత్యంత సన్నిహితుడైన భారత సంతతి ఎంపీ అలోక్ శర్మ తెలిపారు. బ్రెగ్జిట్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో పాటు వలసలపై కొత్త చర్చకు తెర లేచింది. ఇకపై యురోపియన్ దేశాలు, భారత్‌తోపాటు ప్రపంచ దేశాలతో బ్రిటన్ కొత్త వాణిజ్య బంధాలను నిర్వచించుకోవాల్సి ఉంటుంది. జర్మన్ చాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ రెఫరెండాన్ని ఈయూకు పెద్ద దెబ్బ అని తెలపగా.. ఇది చాలా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. ఈయూ పతనం మొదలైందని వస్తున్న వార్తలను యురోపియన్ కమిషన్ చీఫ్ జీన్ క్లాడ్ జంకర్ ఖండిచారు. కాగా, బ్రిటన్ నిర్ణయంతో నెదర్లాండ్స్, ఇటలీ కూడా రెఫరెండం ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాందిశీకులే అసలు సమస్య! బయటకు ఎన్ని కారణాలు చెబుతున్నా... ప్రస్తుతం ఈయూ దేశాల్ని కుదిపేస్తున్నది కాందిశీకుల సమస్యే. ఈయూ ఒప్పందాల ప్రకారం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు వలస వెళ్లొచ్చు. దీంతో ఆర్థిక అస్తవ్యస్థ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దేశాల నుంచి, సిరియా, ఇరాక్ వంటి కల్లోల దేశాల నుంచి బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలకు లక్షల మంది తరలివస్తున్నారు. పలుచోట్ల వలసదారుల సంఖ్య పెరుగుతోంది. ఇది సామాజిక మార్పులకూ దారితీస్తోంది. పెపైచ్చు వారికి భృతి చెల్లిస్తూ... ఉద్యోగాలిప్పిస్తున్నా చాలామంది చేయటం లేదు. సులభంగా భృతి అందుకుని జీవించడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇది పన్ను చెల్లింపుదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. కాందిశీకులపై రేగుతున్న అసంతృప్తి ఏ స్థాయికి వెళ్లిందంటే... ‘ఈయూ’లో బ్రిటన్ కొనసాగాలని ప్రచారం చేస్తున్న బ్రిటన్ మహిళా ఎంపీని వారం రోజుల కిందట ఓ అగంతకుడు కాల్చిచంపాడు. రెఫరెండంలో ప్రతిఫలించింది కూడా ఈ ఆవేదన... ఆగ్రహమే!!. -
గ్రీసు బెయిలవుట్ కు ఈయూ ఓకే
లండన్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రీసు దేశానికి ఊరట లభించింది. గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీకి యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలు ఓకే చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం మూడో ఉద్దీపన ప్యాకేజీకి ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్టు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. గ్రీసుకు బెయిలవుట్ ప్యాకేజీ సిద్ధంగా ఉందని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ప్యాకేజీ వివరాలు వెల్లడి కాలేదు. 'సీరియస్ సంస్కరణలు, ఆర్థిక సహాయం'గా బెయిలవుట్ ప్యాకేజీని బీబీసీ పేర్కొంది. బెయిలవుట్ ప్యాకేజీ ప్రతిపాదనలకు గురువారం రాత్రి గ్రీసు కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 50 బిలియన్ యూరోల బెయిలవుట్ ప్యాకేజీని కోరుతూ 13 బిలియన్ యూరోల మేర పెన్షన్ సంస్కరణలు, వ్యయాల కోత, పన్నుల పెంపు వంటివి అమలుచేయడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ గ్రీసు ప్రతిపాదనల్ని రూపొందించిందని అనధికార వార్తలు వచ్చాయి.