చిన్నారి నేస్తం.. ఖుషీ అయిన పవన్‌! | Pawan kalyan Reacts Poland Kid Kodaka Version Song | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 5 2018 9:44 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan kalyan Reacts Poland Kid Kodaka Version Song - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి పోలెండ్ చిన్నారి జిబిగ్జ్(బుజ్జి) గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కష్టమైనప్పటికీ.. తెలుగు మీద అభిమానంతో తెలుగు పాటలు పాడటం, డైలాగ్‌లను చెప్పటం.. వాటిని పోస్టు చేయటం ద్వారా వార్తల్లో నిలవటం చూస్తున్నాం. 

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసిలోని కొడకా కోటేశ్వర రావు పాటను పాడిన ఈ చిన్నారి.. మరోసారి హల్‌ చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పిల్లాడి పాట ట్రెండ్‌ కావటంతో పవర్‌ స్టార్‌ అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. చివరకు అతగాడు పవన్‌ను కూడా ఫిదా చేసి పడేశాడు.  

చిన్నారి పాట పాడిన విధానానికి ఇంప్రెస్ అయిన పవన్‌ .. ‘‘చిన్నారి నేస్తం.. నీ పాట నాకు చేరింది. నువ్వు ఇచ్చిన కొత్త సంవత్సరం కానుకకు కృతజ్ఞతలు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి’’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక జిజిగ్జ్ అయితే పాటతో కూడిన ఫోటోనే ట్విట్టర్‌లో ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవటం విశేషం. గతంలో అఖిల్‌ హలో చిత్రంలోని పాటను కూడా పాడి నాగ్‌ను ఆకట్టుకున్న విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement