‘తమ్ముడు, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ వంటి సినిమాల తర్వాత హీరో పవన్ కల్యాణ్ మరోసారి పాట పాడారు. ఆయన టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్–1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రంలోని ‘మాట వినాలి...’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. పెంచల్‌దాస్ సాహిత్యం అందించిన ఈ పాటను పవన్ కల్యాణ్ పాడారు. నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు పార్ట్–1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి.
Comments
Please login to add a commentAdd a comment