jyothi krishna
-
మళ్లీ పాడారు
‘తమ్ముడు, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ వంటి సినిమాల తర్వాత హీరో పవన్ కల్యాణ్ మరోసారి పాట పాడారు. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్–1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రంలోని ‘మాట వినాలి...’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. పెంచల్దాస్ సాహిత్యం అందించిన ఈ పాటను పవన్ కల్యాణ్ పాడారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు పార్ట్–1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి. -
దేశం కోసం మనమేం చేశామనుకుంటారు!
‘‘ఆడియన్స్ అటెన్షన్ డ్రా చేయడం కష్టంగా మారింది. ఓన్లీ టెక్నాలజీ, ఎఫెక్ట్స్‌తో వారిని థియేటర్లకు రప్పించలేం. సినిమాలో మంచి కంటెంట్ కావాలి. ‘ఆక్సిజన్’లో కంటెంట్ ఉంది. సినిమా చూశాక, దేశం కోసం మనమేం చేశాం? అని ప్రేక్షకులు ఆలోచిస్తారు’’ అన్నారు ఏయమ్ జ్యోతికృష్ణ. గోపీచంద్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్’. రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. రేపు విడుదలవుతున్న ఈ చిత్రం గురించి జ్యోతికృష్ణ చెప్పిన విశేషాలు... ♦ ముందు గోపీచంద్‌గారికి కథ చెప్పాను. ఓకే అన్నారు. నేను వేరే నిర్మాతను ఎవరినన్నా చుద్దామన్నా. ‘మంచి కథ. సోషల్ కంటెంట్ ఉంది. ఏయం రత్నంగారి ఆధ్వర్యంలో నిర్మిస్తే ఇంకా హ్యాపీగా ఫీలవుతా’ అన్నారు. తర్వాత మా నాన్న (ఏయం రత్నం) గారికి కథ చెప్పా. చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఫైనల్‌గా సినిమా చూసి, ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. నా భార్య మంచి క్రిటిక్. తను సినిమా బాగుందని చెప్పింది. ♦ కమర్షియల్ అంశాలతో కూడిన సందేశాత్మక చిత్రమిది. ఇందులో మూడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటో తెరపై చూస్తే ప్రేక్షకులు థ్రిల్లవుతారు. గోపీచంద్‌గారు బాగా నటించారు. ఆయన క్యారెక్టరైజేషన్లో మూడు రకాల షేడ్స్ ఉంటాయి. ఆయన ఇమేజ్ ఈ సినిమాతో మరింత పెరుగుతుంది. ఈ చిత్రాన్ని తమిళ్లో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. ♦ 8 నెలల క్రితమే మూవీ రెడీ. గ్రాఫిక్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పట్టింది. ఈ సినిమాకు ఆరుగురు కెమెరామెన్ వర్క్ చేశారు. ఏ ఎపిసోడ్‌కి ఆ ఫీల్ ఉండే కెమెరామన్ వచ్చారు. ♦ దర్శకుడిగా నా తొలి సినిమా తర్వాత తెలుగులో మరో చాన్స్ కోసం ప్రయత్నించాను కానీ రాలేదు. ఆ తర్వాత ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టి, బిజీ అయ్యా. తమిళంలో ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు కానీ’) ప్రొడక్షన్ పనులు చూసుకున్నాక, ‘ఆక్సిజన్’ కథ రెడీ చేసి మళ్లీ దర్శకుడిగా మారా! -
భారతీయుడు.. ఒకే ఒక్కడు... రేంజ్లో ఆక్సిజన్ – దర్శకుడు జ్యోతికృష్ణ
‘‘జ్యోతికృష్ణ చిన్నప్పటి నుంచి మాకు తెలియకుండా కథలు రాసేవాడు. చదువుకుని ఫారిన్లో సెటిలవుతాడనుకుంటే, లండన్‌లో ఫిల్మ్ డైరెక్షన్ ట్రైనింగ్ తీసుకొచ్చాడు. చిన్న వయసులోనే డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు నిర్మాత ఏయం రత్నం. గోపీచంద్, రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆక్సిజన్’. శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై జ్యోతికృష్ణ భార్య ఎస్. ఐశ్వర్య నిర్మించారు. యువన్‌శంకర్ రాజా స్వరపరచిన ఈ సినిమా పాటలను సోమవారం విడుదల చేశారు. ఏయం రత్నం మాట్లాడుతూ– ‘‘స్వార్థపరుల వల్ల యువత ఎంతగా దెబ్బతింటున్నది అన్నదే ఈ సినిమా కథ. ‘ఆక్సిజన్’ మొదలుపెట్టి చాలా కాలం అయింది. ఎప్పుడు పిలిచినా మాకు సహకరించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కి చాలా థ్యాంక్స్. తమన్నా, జెనీలియా, త్రిష వంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఈ చిత్రంతో అనూ ఇమ్మాన్యుయేల్‌ని పరిచయం చేయాలనుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తను పెద్ద స్టార్ అయిపోయినందుకు హ్యాపీ. నాకు తెలియకుండా ఈ సినిమాలో నా కోడలితో (ఐశ్వర్య) పాట పాడించారు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో ఐశ్వర్య నిర్మాతగా మారారు’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘ఆక్సిజన్’ చేయడానికి ముఖ్య కారణం రత్నంగారు. ఆయన్ని చిన్నప్పటి నుంచి చూశా. చాలా మంది బిజినెస్ కోసం సినిమాలు చేస్తారు. నాకు తెలిసి టాలీవుడ్లో సినిమాపై ప్యాషన్ ఉండే నిర్మాతల్లో రత్నంగారు ఒకరు. నేను కథని నమ్మాను. నా నమ్మకం వమ్ము కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మంచి మెసేజ్ ఇచ్చాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. జ్యోతికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఆక్సిజన్ కథ ఫస్ట్ ఐశ్వర్యకే చెప్పా. తనకు నచ్చింది. గోపిచంద్సార్కి ఆరు గంటల్లో రెండు కథలు వినిపించా. ‘ఆక్సిజన్’ కథ నచ్చిందని, ఓకే చేశారు. ఈ సినిమాలో ఆయన మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. ఇంటర్వెల్ ఫైట్‌లో అద్భుతంగా నటించారు. గోపి నాట్ ఏ సినిమా హీరో. రియల్ హీరో. నాన్నగారికి సోషల్ ఓరియంటెడ్ సినిమాలంటే ఇష్టం. ఆయన తీసిన ‘కర్తవ్యం, పెద్దరికం, ఆశయం, భారతీయుడు, ఒకే ఒక్కడు’ రేంజ్లో ‘ఆక్సిజన్’ ఉంటుంది. తొలిరోజు సెట్లో ఎంత డెడికేషన్, మంచి బిహేవియర్‌తో ఉన్నారో... ఇప్పుడూ అనూ ఇమ్మాన్యుయేల్ అలాగే ఉన్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్రమిది. రిలీజ్ ఆలస్యం అయింది. నాకు తొలి అవకాశం ఇచ్చిన రత్నంసార్కి థ్యాంక్స్. ఈ సినిమాని ఆశీర్వదించి, పెద్ద హిట్ చేయాలి’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘చాలామంది నిర్మాతలకి రామానాయుడుగారు రోల్ మోడల్. రత్నంగారిని చూసి ఆయనలాగా అవ్వాలని మేం ఇండస్ట్రీకి వచ్చాం. ఒక టెక్నీషియన్ ఎంత పెద్ద నిర్మాత అవ్వొచ్చో చూపించారాయన’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. చిత్ర నిర్మాత ఐశ్వర్య, సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా, కెమెరామేన్ ఛోటా కె. నాయుడు, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, అంబికా కృష్ణ, పోకూరి బాబూరావు, అనీల్ సుంకర, మల్కాపురం శివకుమార్, రాజ్ కందుకూరి, మిర్యాల రవీందర్‌రెడ్డి, నటులు అలీ, శరత్‌కుమార్, నాజర్, కెమెరామేన్ సెంథిల్, డైరెక్టర్ నేసన్ , ఇండియన్ ఐడిల్ రేవంత్ తదితరులు పాల్గొన్నారు. -
గాయని గా మారిన నిర్మాత
సాక్షి, చెన్నై: స్వతహాగా ఉన్న ప్రతిభ, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పడుతుంది. ఇందుకు ఉదాహరణలు ఎన్నో. అదే విధంగా నిర్మాతగా తన దక్షతను చాటుకుంటున్న ఐశ్వర్య ఇప్పుడు తనలో దాగి ఉన్న గాయని అనే ప్రతిభకు సాన పెడుతున్నారు. ఐశ్వర్య ఎవరోకాదు స్వయంకృషితో ఎదిగి, భారీ చిత్రాలకు చిరునామాగా మారిన ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం కోడలు. యువ దర్శక, నటుడు జ్యోతికృష్ణ భార్య అన్నది గమనార్హం. అంతే కాదు ఐశ్వర్య సంచలన విజయం సాధించిన ఆరంభం, ఎన్నైఅరిందాల్, వేదాళం, కరుప్పన్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఆమె తనలోని సంగీత జ్ఞానానికి పదునుపెట్టడం మొదలెట్టారు. ఇప్పుడీ యువ మహిళా నిర్మాత గాయనిగా అవతారమెత్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా సంగీతదర్శకత్వంలో ఇప్పటికే రెండు పాటలను పాడినట్లు ఐశ్వర్య తెలిపారు. తన గానం యువన్ ను చాలా ఇంప్రెస్ చేసిందని చెప్పారు. గాయనిగా తనను ప్రోత్సహిస్తున్న యువన్ శంకర్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కూటన్ అనే తమిళ సినిమా కోసం ఐశ్వర్య రెండు పాటలు పాడారు. ఇకపై తాను గాయనిగానూ కొనసాగుతానంటున్నారు ఐశ్వర్య. -
గాయనిగా మారిన డైరెక్టర్ భార్య
చెన్నై: డైరెక్టర్ జ్యోతి కృష్ణ సతీమణి ఐశ్వర్య గాయనిగా మారారు. త్వరలో రానున్న ఆక్సిజన్ సినిమా కోసం ఆమె గాయని అవతారమెత్తారు. ఆక్సిజన్‌లో గోపీచంద్, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆమె పాడిన పాట విన్నాను. ఆమె గొంతు చాలా బాగుంది. పాటలు పాడాలంటూ గతంలో చాలా మంది ఆమెను సంప్రదించారు కూడా. ఆయితే, ఆమె అప్పట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు నా సినిమాలోనే పాటలు పాడించా..’అని జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ సినిమాలో ఐశ్వర్య రెండు పాటలు పాడగా ఒకటి డ్యూయెట్ కాగా, మరోటి సోల్ సాంగ్ అని సమాచారం. ఈ రెండు పాటలు చాలా బాగా వచ్చాయని జ్యోతికృష్ణ వివరించారు. కాగా, ఆక్సిజన్ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ..ఇది భారీ యాక్షన్ చిత్రం అని.. గంటన్నర నిడివిగల విజువల్ ఎఫెక్ట్స్ కోసం నాలుగు నెలల పాటు శ్రమించినట్లు పేర్కొన్నారు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని తెలిపారు. ఆక్సిజన్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కాగా, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. -
అక్టోబర్ 12న 'ఆక్సిజన్'
గోపిచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను అక్టోబర్ 12న రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. 'పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'ఆక్సిజన్'. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజన్ చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆక్సిజన్ ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను విడుదల చేసి.. అక్టోబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు. -
'ఆక్సిజన్' ఆగిపోయిందా..?
ఇటీవల యాక్షన్ హీరో గోపిచంద్ సినిమాలు వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కెరీర్‌కు కీలకమైన ఈ సమయంలో సినిమాలు ఆలస్యం కావటం, వివాదాలు తలెత్తుతుండటంతో గోపిచంద్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ప్రారంభమైన సినిమా సగం షూటింగ్ పూర్తయిన తరువాత చాలా కాలం ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమాను తిరిగి ప్రారంభించి డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో గోపిచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మాతగా ఆయన తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆక్సిజన్ సినిమా విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవటంతో రిలీజ్ ఆలస్యమవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైన యూనిట్ సభ్యులు స్పందించి షూటింగ్ అప్డేట్స్పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. -
ఆ ఒక్కటే కాదు..!
సంప్రదాయ దుస్తుల్లో బిగ్స్క్రీన్పై మురిపించే మలయాళ తార జ్యోతికృష్ణా... తనపై ఉన్న ఆ ముద్రను చెరిపేసుకోవాలనుకొంటున్నట్టుంది. ఆ విషయాన్ని స్ట్రయిట్‌గా చెప్పట్లేదు గానీ.. ‘మోడర్న్ అవుట్‌ఫిట్స్ నాకు సూటవ్వవని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పటివరకు వచ్చిన క్యారెక్టర్లు నాపై అలా ట్రెడిషనల్ గాళ్ ముద్ర వేశాయి. కానీ వాటికే పరిమితమవ్వాలనుకోవడం లేదు. నాకూ మోడర్న్ డ్రెస్సులు సరిపోతాయని చెప్పడానికి ఓ ఫొటో సూట్ కూడా చేశా’ అంటూ తనకు తానే బ్రాండింగ్ చేసుకొంటోందీ సుందరి.