'ఆక్సిజన్' ఆగిపోయిందా..? | gopi chand, jyothi Krishnas oxygen movie updates | Sakshi
Sakshi News home page

'ఆక్సిజన్' ఆగిపోయిందా..?

Published Tue, Oct 25 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

'ఆక్సిజన్' ఆగిపోయిందా..?

'ఆక్సిజన్' ఆగిపోయిందా..?

ఇటీవల యాక్షన్ హీరో గోపిచంద్ సినిమాలు వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కెరీర్కు కీలకమైన ఈ సమయంలో సినిమాలు ఆలస్యం కావటం, వివాదాలు తలెత్తుతుండటంతో గోపిచంద్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే సీనియర్ డైరెక్టర్  బి.గోపాల్ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ప్రారంభమైన సినిమా సగం షూటింగ్ పూర్తయిన తరువాత చాలా కాలం ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమాను తిరిగి ప్రారంభించి డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అదే సమయంలో గోపిచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మాతగా ఆయన తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆక్సిజన్ సినిమా విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవటంతో రిలీజ్ ఆలస్యమవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైన యూనిట్ సభ్యులు స్పందించి షూటింగ్ అప్డేట్స్పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement