అక్టోబర్ 12న 'ఆక్సిజన్' | Gopichands Oxygen Releasing on October 12th | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 12న 'ఆక్సిజన్'

Published Mon, Aug 28 2017 4:14 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

అక్టోబర్ 12న 'ఆక్సిజన్'

అక్టోబర్ 12న 'ఆక్సిజన్'

గోపిచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను అక్టోబర్ 12న రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.  

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. 'పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'ఆక్సిజన్'. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజన్ చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆక్సిజన్ ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను విడుదల చేసి.. అక్టోబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement