గాయనిగా మారిన డైరెక్టర్‌ భార్య | Director Jyothi Krishna's wife turns singer | Sakshi
Sakshi News home page

గాయనిగా మారిన డైరెక్టర్‌ భార్య

Published Mon, Sep 18 2017 3:53 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

గాయనిగా మారిన డైరెక్టర్‌ భార్య

గాయనిగా మారిన డైరెక్టర్‌ భార్య

చెన్నై: డైరెక్టర్‌ జ్యోతి కృష్ణ సతీమణి ఐశ్వర్య గాయనిగా మారారు. త్వరలో రానున్న ఆక్సిజన్‌ సినిమా కోసం ఆమె గాయని అవతారమెత్తారు. ఆక్సిజన్‌లో గోపీచంద్‌, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆమె పాడిన పాట విన్నాను. ఆమె గొంతు చాలా బాగుంది. పాటలు పాడాలంటూ గతంలో చాలా మంది ఆమెను సంప్రదించారు కూడా. ఆయితే, ఆమె అప్పట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు నా సినిమాలోనే పాటలు పాడించా..’అని జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ సినిమాలో ఐశ్వర్య రెండు పాటలు పాడగా ఒకటి డ్యూయెట్‌ కాగా, మరోటి సోల్‌ సాంగ్‌ అని సమాచారం.
 
ఈ రెండు పాటలు చాలా బాగా వచ్చాయని జ్యోతికృష్ణ వివరించారు. కాగా, ఆక్సిజన్‌ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ..ఇది భారీ యాక‌్షన్‌ చిత్రం అని.. గంటన్నర నిడివిగల విజువల్‌ ఎఫెక్ట్స్ కోసం నాలుగు నెలల పాటు శ్రమించినట్లు పేర్కొన్నారు. ఒళ్లు గగుర్పొడిచే యాక‌్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని తెలిపారు. ఆక్సిజన్‌ ప్రొడ్యూసర్‌ ఏఎం రత్నం కాగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌ రాజా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement