Chechen Ramzan Kadyrov Warning.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యాకు మద్దతుగా కీలక పాత్ర పోషిస్తున్న చెచెన్ నేత రంజాన్ కదిరోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే, ‘విక్టరీ డే’ సందర్భంగా పోలాండ్‌లో రష్యా రాయబారిపై ఎరుపు సిరా దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దాడిని రంజాన్ కదిరోవ్ ఖండించారు. పోలాండ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్ పట్ల ఆసక్తిగా ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వీడియోలో కదిరోవ్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ అనంతరం.. ఒకవేళ మాకు ఆదేశాలు వస్తే.. ఆరు సెకండ్లలో ఏం చేయగలమో చేసి చూపిస్తాం’ అంటూ పోలాండ్‌ను హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలను పోలాండ్ వెనక్కి తీసుకోవాలని ఆ దేశాన్ని వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్‌ను గెలువనీయబోమని జర్మన్ చాన్స్‌లర్ ఓలఫ్ స్కోల్ట్ గురువారం పేర్కొన్నారు. ఇక, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధంలో రష్యన్ సైన్యం దాదాపు 1,000 ట్యాంకులు, 350 ఫిరంగి నౌకలు, 30 ఫైటర్-బాంబర్లు, 50 కంటే ఎక్కువ హెలికాప్టర్‌లను కోల్పోయిందని ఉక్రెయిన్ మీడియా తెలిపింది.
The Chechen president #RamzanKadyrov has threatened #Poland:
— Schulla (@RiettedeKlerk) May 27, 2022
“#Ukraine is already a closed issue. I'm interested in Poland.. we'll show what we are capable of in 6 seconds. Better get yr weapons (Poles)”
PLEASE PRAY FOR PEACE 🙏🙏 pic.twitter.com/5j70TH3qlf
ఇది కూడా చదవండి: తుపాకుల నియంత్రణను వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు
Comments
Please login to add a commentAdd a comment