కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత | neurofibromatosis Face transplant operation in Poland | Sakshi
Sakshi News home page

కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత

Published Fri, Oct 28 2016 2:58 AM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM

కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత - Sakshi

కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత

 అద్భుతాలు అన్నిసార్లూ జరగవు.. జరిగినప్పుడు తెలుసుకోవాలి.. దాన్ని చూసేయాలి.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న విషయం కూడా ఒక అద్భుతంలాంటిదే. ముందు ఈ ఫొటోలను ఓసారి చూడండి.. ఈ రెండూ ఒకరివే!!

 ఈమె పేరు జొయన్నా.. పోలండ్‌లో ఉంటోంది. ‘న్యూరోఫైబ్రోమెటాసిస్’ అనే జన్యుపరమైన వ్యాధి వల్ల ఆమె ముఖం ఇలా కణితులతో నిండిపోయి.. అందవికారంగా తయారైపోయింది. మాట్లాడాలన్నా.. తినాలన్నా.. నరక ం కనిపించేది.  కళ్లు సరిగా కనిపించేవి కావు.. చెవులు కూడా వినిపించేవి కావు.. అలాంటి దుర్భర పరిస్థితిలో మూడేళ్ల క్రితం ఆమెకు డాక్టర్ మెకజ్యూస్కీ నేతృత్వంలోని వైద్యుల బృందం ముఖమార్పిడి ఆపరేషన్ చేసింది.. ఇది ఆ దేశంలోనే రెండో ముఖమార్పిడి శస్త్రచికిత్స అట.. 23 గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా జొయన్నా ముఖం మీద చర్మంలో 80 శాతాన్ని మార్చేశారు. తర్వాత చిన్నచిన్న చికిత్సలు జరిగాయి..
 కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత ఇదిగో ఇలా అద్భుతం ఆవిష్కృతమైంది..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement