భారత జట్లకు మిశ్రమ ఫలితాలు | Indian men lose to Poland, women hold Georgia in World Chess | Sakshi
Sakshi News home page

భారత జట్లకు మిశ్రమ ఫలితాలు

Published Sun, Jun 18 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

Indian men lose to Poland, women hold Georgia in World Chess

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత పురుషుల జట్టు 1.5–2.5తో పోలాండ్‌ చేతిలో ఓడిపోగా... మహిళల విభాగంలో జార్జియాతో జరిగిన మ్యాచ్‌ను భారత జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పురుషుల జట్టులో విదిత్‌ గెలుపొందగా... ఆదిబన్, కార్తికేయన్‌ ఓడిపోయారు.

పరిమార్జన్‌ నేగి తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 72 ఎత్తుల్లో నానా జాగ్‌నిద్జెపై నెగ్గగా... ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లు తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విజయలక్ష్మి ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement