
టోక్యో: వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో (2012, 2016, 2020) స్వర్ణ పతకం గెలిచి పోలాండ్ క్రీడాకారిణి అనితా వొడార్జిక్ అరుదైన ఘనత సాధించింది. మంగళవారం జరిగిన హ్యామర్ త్రో ఈవెంట్‌లో అనితా హ్యామర్‌ను 78.48 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని దక్కించుకుంది. తద్వారా ఒలింపిక్స్ క్రీడల అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో వరుసగా మూడు పసిడి పతకాలు గెల్చుకున్న తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. లండన్, రియో, తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిచి ఈ ఫీట్ సాధించింది.
మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు?
Comments
Please login to add a commentAdd a comment