hammer throw
-
సంకల్పిస్తే... రాదన్నది లేదు
కష్టాలేమీ లేనప్పుడు మనలో బలమెంత ఉందో మనకు కూడా తెలియదు. ఆ కష్టం దాటాక మనలోని బలమెంతో మనతోబాటు పదిమందికీ తెలుస్తుంది. ఈ మాటలకు అర్థం ఆరుపదుల వయసులో ఉన్న రాధతో మాట్లాడితే తెలుస్తుంది. పెద్ద వయసులో ఇంకేం చేస్తారులే అనుకోకుండా క్రీడల్లో తనని తాను నిరూపించుకుంటూ నేటి యువతకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటున్న రాధ ఆరు పదుల వయసులో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హ్యామర్ త్రో వంటివి చేస్తూ క్రీడలకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. ఈ వయసులో మెడల్స్ సాధిస్తూ అథ్లెట్‌గా రాణిస్తున్నారు. క్రీడలంటే ఉన్న ఆసక్తి గురించి మాట్లాడినప్పుడు రాధ తన జీవిత విశేషాలను ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు. అవన్నీ నేటి మహిళలకు స్ఫూర్తినిచ్చే వాక్కులు. జీరో నుంచి మొదలు ‘ముప్పై ఐదేళ్లుగా టీచర్‌గా చేస్తున్నాను. పాతికేళ్లుగా స్కూల్స్ నడుపుతున్నాను. నిజానికి నేను సెవంత్ క్లాస్ డ్రాపౌట్ స్టూడెంట్‌ని. పెళ్లి చెయ్యాలి అనుకోగానే ఇంట్లో చదువు మానిపించారు. మెట్రిక్యులేషన్‌కు ఇంటి నుంచే ఫీజు కట్టించారు. ఆ తర్వాత పెళ్లి అయింది. మా వారిది బిజినెస్. ఇద్దరు పిల్లలకు ఐదేళ్లు వచ్చేసరికి బిజినెస్‌లో పూర్తి లాస్. జీవితం జీరో అయిపోయింది. అప్పుడు ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలో అర్థం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు. ఎటూ దిక్కుతోచని పరిస్థితి. ఈ లైఫ్ ఎందుకు అనే డిప్రెషన్ వచ్చేసింది. దాని నుంచి ఎలాగో బయటపడి పెళ్లి తర్వాత చదువును కొనసాగించా. కష్టపడి బీఈడీ చేయడంతో టీచర్‌గా మళ్లీ నా లైఫ్‌ని కొనసాగించాను. డబ్బులు సరిపోవని సాయంత్రాలు ట్యూషన్లు చెప్పడంతో నా పిల్లలకు చదువులు చెప్పించగలిగాను. పిల్లలు పెద్దవడంతో వాళ్లూ నాకు సాయంగా ఉండటం మొదలుపెట్టారు. పదిహేనేళ్లు ఉద్యోగం చేశాక బొల్లారంలో గీతాంజలి స్కూల్ ప్రారంభించాను. ఆ తర్వాత మరో ఐదేళ్లలో నిజాంపేటలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాను. డిజైనర్ డ్రెస్సులతో విదేశాలకు.. నాకు డ్రెస్ డిజైన్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎందుకు వదులుకోవడం అని స్కూల్ నడుపుతూనే బొటిక్ కూడా స్టార్ట్ చేశా. అది కూడా చాలా సక్సెస్ అయ్యింది. వీటిని తర్వాత్తర్వాత విదేశాలకు ఆర్డర్లమీద పంపించేదాన్ని. అమెరికాలో జరిగిన ఈవెంట్స్‌లో కూడా నా బొటిక్ డిజైన్స్ డిస్ప్లే చేసి, సేల్ చేసేదాన్ని. మెడల్స్‌ను తీసుకొచ్చిన ఇష్టం బిహెచ్ఇఎల్ లో ఉన్నప్పుడు అక్కడి స్టేడియమ్ పిల్లలను స్కేటింగ్‌కి తీసుకెళ్లేదాన్ని. వారిని స్కేటింగ్‌లో వదిలేసి, నేనూ స్పోర్ట్స్‌లో పాల్గొనేదాన్ని. హ్యామర్ త్రోలో పాల్గొన్నప్పుడు సెకండ్ మెడల్ వచ్చింది. దాంతో మరింత పట్టుదల పెరిగింది. స్పోర్ట్స్ మీట్ ఉన్నప్పుడు వారం మొత్తం ప్రాక్టీస్ తప్పనిసరి. హ్యామర్ త్రో కి చాలా ఫిట్నెస్ అవసరం. మహిళల విభాగంలో నాలుగు కేజీల బరువైన ఐరన్ బాల్ని విసరాలి. సాధారణంగా నలభైఐదు దాటాక ఆక్సిజన్ లెవల్స్, శారీరక ఫిట్నెస్ తగ్గుతుంటాయి దీనిని పెంచుకోవాలంటే రోజూ వాకింగ్, వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అలా, 35 ఏళ్లుగా నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటూ వచ్చాను. దీంతో ఇటీవల బెంగళూరులో జరిగిన టోర్నమెంట్లో నాలుగు మెడల్స్, హన్మకొండలో జరిగిన స్పోర్ట్స్ మీట్లో 3 మెడల్స్ వచ్చాయి. ప్రతి ఏడాది జరిగే స్పోర్ట్స్ మీట్లో తప్పనిసరిగా పాల్గొంటాను. ఫిట్నెస్ లేకుండా డైరెక్ట్‌గా లాంగ్ జంప్ లేదా ట్రిపుల్ జంప్ చేసినా, రన్నింగ్ చేసినా సమస్యలు వస్తాయి. అందుకే రోజూ ఒక గంటైనా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఎవరైనా అడిగితే ఉచితంగా కోచింగ్ ఇస్తుంటాను. ఏ జిల్లాలోనైనా పది మంది మహిళలు ‘జట్టుగా ఉన్నాం, మాకు గ్రౌండ్ ఉంది, టోర్నమెంట్లో పాల్గొంటాం’ అని మాకు తెలియజేసినా... అలాంటి వారికి ఉచితంగా కోచ్‌ని ఏర్పాటు చేస్తాం. ఏమీ చేయలేని పరిస్థితులు వచ్చాయి కదా! అనుకున్నప్పుడు మళ్లీ స్టాండ్ అవ్వాలని బలంగా అనుకున్నాను. అలాగే జరిగింది. ఆ రోజుల్లో నేనేమీ చేయలేను అనుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఏమయ్యేదో. ఎవరికైనా ఇష్టాయిష్టాలు ఉంటాయి. కానీ, కుటుంబం నిలబడాలంటే త్యాగాలు తప్పవు. కష్టం వస్తేనే సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. కుటుంబం నిలబడాలంటే మనం బలంగా ఉండాలి. అందుకు మనలో ఏ శక్తి ఉందో తెలుసుకొని, ఆచరణలో పెట్టాలి. అప్పుడు తప్పక విజయం సొంతం అవుతుంది’’ అంటూ తన జీవితాన్ని నేటి మహిళలకు ఓ ఉదాహరణగా వివరించారు రాధ. – నిర్మలారెడ్డి -
వావ్ అనిత: వరుసగా మూడు ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు
టోక్యో: వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో (2012, 2016, 2020) స్వర్ణ పతకం గెలిచి పోలాండ్ క్రీడాకారిణి అనితా వొడార్జిక్ అరుదైన ఘనత సాధించింది. మంగళవారం జరిగిన హ్యామర్ త్రో ఈవెంట్లో అనితా హ్యామర్‌ను 78.48 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని దక్కించుకుంది. తద్వారా ఒలింపిక్స్ క్రీడల అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో వరుసగా మూడు పసిడి పతకాలు గెల్చుకున్న తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. లండన్, రియో, తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిచి ఈ ఫీట్ సాధించింది. మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? -
జాతీయ గీతానికి అవమానం! ఆమెది తలపొగరేనా?
ఆమెది మామూలు తలపొగరు కాదు. తిక్క కుదర్చాల్సిందే. ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. జాతీయ గీతం అంటే ఆమెకు లెక్కే లేదు. దేశమంటే గౌరవమూ లేదు. ముందు ఆమెను ఒలింపిక్స్‌కు పోనివ్వకుండా అడ్డుకోండి.. ఇది యూఎస్ ఒలింపిక్స్ కమిటీకి చేరుతున్న ఫిర్యాదులు. హామర్ థ్రో క్రీడాకారిణిగా ఒలింపిక్స్‌కు వెళ్లబోతున్న గ్వెన్ బెర్రీని.. అక్కడి ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే.. న్యూయార్క్: శనివారం నాడు యూఎస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ ట్రయల్స్ జరిగాయి. హమర్ థ్రో విభాగంలో మూడో ప్లేస్‌లో నిలిచింది 32 ఏళ్ల గ్వెన్ బెర్రీ. ఆపై మెడల్స్ బహుకరణ తర్వాత.. జాతీయ గీతం ప్రదర్శించిన టైంలో పోడియం వద్ద ఆమె తలబిరుసు ప్రదర్శించింది. ఆ టైంలో ఆమె మిగతా ఆటగాళ్లకు వ్యతిరేక దిశలో నిలబడింది. పైగా ఏ మాత్రం గౌరవం లేకుండా.. నడుం మీద చెయ్యి వేసుకుంది. జాతీయ గీతం అంటే ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించింది. అంతకు ముందు నెత్తి మీద నల్ల గుడ్డతో నిరసన కూడా వ్యక్తం చేసింది. అందుకే ఆమె మీద అమెరికన్లు మండిపడుతున్నారు. నాకంత ఓపిక లేదు దీనిపై బెర్రీ వివరణ ఇచ్చుకుంది. ఐదు నిమిషాలు తమను ఎండలో ఎదురుచూసేలా చేశారని, అందుకే అలా చేశానని చెప్పింది. ఇక బెర్రీ చేష్టలపై దుమారం చెలరేగింది. రాజకీయ నేతలంతా ఆమెపై విరుచుకుపడ్డారు. మరోవైపు శాంతియుత నిరసన ప్రదర్శన కావడంతో వైట్ హౌజ్ కూడా ఆమె తప్పును మన్నించినట్లు ప్రకటించింది. అయినా విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఆమెను ఒలింపిక్స్‌కు వెల్లనీయకుండా అడ్డుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ యూఎస్ ఒలింపిక్స్ కమిటీకి పలువురు మెయిల్స్ పెడుతున్నారు. “I’m here to represent those … who died due to systemic racism. That’s why I’m going. The anthem doesn’t speak for me, it never has.” - @MzBerryThrows Gwen, you got so much love coming from me 🤍 https://t.co/haoDJdavO8 — Morolake Akinosun™ (@MsFastTwitch) June 29, 2021 కొనసాగుతున్న నిరసన కానీ, ఆమె ఉద్దేశం అది కానే కాదు. అది నిరసన. నల్ల జాతీయలపై అమెరికాలో జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే ఆమె ఆ పని చేసింది. ఆ టీ షర్ట్ మీద యాక్టివిస్ట్ అథ్లెట్ అని రాసి ఉంటుంది. పైగా బెర్రీకి ఇది కొత్తేం కాదు. ఇంతకు ముందు 2019లో పాన్ అమెరికన్ గేమ్స్ సందర్భంగా జాతీయ గీతం ప్రదర్శితమైన సందర్భంలో పిడికిలిని బిగించి తన ఉద్దేశ్యాన్ని చాటింది. ఆ టైంలో ఆమె చేష్టలతో స్పాన్సర్షిప్ కంపెనీలు దూరమయ్యాయి. 12 నెలల పాటు ఆమెపై వేటు పడింది. అయినా ఆమె జాతి వివక్ష వ్యతిరేక నిరసనలు ఆపనంటోంది బెర్రీ. తాజా పరిణామాల నేపథ్యంలో ‘నాతో ఆటలు ఆపండి’అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందామె. ఇక జాతి.. వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం ఇలాంటి శాంతియుత ప్రదర్శనలకు అమెరికాలో అనుమతి ఉందని, అందుకే ఆమెపై ఎలాంటి చర్యలు ఉండబోవని యూఎస్ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆమె ఒలింపిక్స్ ప్రయాణం సాఫీగా సాగనుంది. కానీ, టోక్యో ఒలింపిక్స్ వేదికపై మాత్రం ఇలాంటివి కుదరవు. రూల్ నెంబర్ 50 ప్రకారం.. ఎలాంటి నిరసనలకు అంతర్జాతీయ ఆటల పోటీల్లో చోటు లేదు. చదవండి: ఎట్టకేలకు దిగొచ్చిన ఫేస్బుక్ -
తన రికార్డు తానే బద్ధలు
న్యూఢిల్లీ: తన రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నాడు ప్రముఖ హ్యామర్ త్రో క్రీడాకారుడు కమల్ ప్రీత్ సింగ్. టస్కాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఈ అథ్లెట్ క్రీడాకారుడు 72.86 మీటర్ల దూరం హ్యామర్‌ను విసిరి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఆసియాలోనే మూడో వ్యక్తి గా రికార్డు నమోదుచేశాడు. గడిచిన రెండు నెలల్లోనే ఇలా జాతీయ స్థాయి రికార్డును బద్ధలు కొట్టేయడం ఇది రెండో సారి. ఇదిలా ఉండగా, జూన్ 3 నుంచి 7 వరకు చైనాలో జరిగే ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కోసం కమల్ ఎంపిక కాకపోవడం గమనార్హం. పంజాబ్‌కు చెందిన కమల్ ప్రీత్ సింగ్ పేరిట గతంలో 70.38, 70.37 మీటర్ల రికార్డు ఉండగా ఈసారి 72.86 మీటర్లు హ్యామర్ ను విసిరి రికార్డు బద్ధలు కొట్టాడు. -
అనుకోని అదృష్టం: మంజుబాలకు రజతం
భారత హేమర్ త్రో క్రీడాకారిణి మంజుబాలకు అనుకోని అదృష్టం కలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో ఆమె తొలుత కాంస్య పతకం గెలుచుకుంది. అయితే.. ఈ పోటీలో స్వర్ణపతకం సాధించిన చైనా క్రీడాకారిణి ఝాంగ్ వెంజియు డ్రగ్స్ వాడినట్లు డోప్ టెస్టులో తేలడంతో ఆమె నుంచి పతకం వెనక్కి తీసుకున్నారు. జెరనాల్ అనే నిషేధిత డ్రగ్‌ను ఆమె వాడినట్లు డోప్ టెస్టులో తేలింది. దీంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తూ ఆమెకు ఇచ్చిన స్వర్ణపతకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ప్రకటించింది. తొలుత ఈ పోటీలో రజత పతకం సాధించిన చైనా క్రీడాకారిణి వాంగ్ ఝెంగ్ ఇప్పుడు స్వర్ణపతకం సాధించింది. ఇంతకుముందు కాంస్యం సాధించిన మంజుబాలకు ఇప్పుడు రజతం లభించింది.