లండన్: పుతిన్ యుద్ధోన్మాదం నుంచి తమను కాపాడేందుకు పాశ్చాత్య దేశాలు ఎందుకు ముందుకు రావడం లేదని డారియా కాల్నిక్ అనే ఉక్రెయిన్ మహిళా జర్నలిస్టు ఆవేదనతో ప్రశ్నించారు. పోలాండ్ ఒక భేటీలో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఈ మేరకు నిలదీశారు. ఉక్రెయిన్ ప్రజలను రక్షించేందుకు ఆయన భయపడుతున్నారరు.
ఉక్రెయిన్‌ను నో ఫ్లై జోన్‌గా నాటో ప్రకటించకపోవడంతో తమ పిల్లలు, మహిళలు వైమానిక దాడులకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకరకంగా మా పిల్లలు బలై మిమ్మల్ని కాపాడుతున్నారు. వారి చాటున నాటో దాక్కుంటున్నట్టే లెక్క’ అని దుయ్యబట్టారు. అయితే జాన్సన్, చేయగలిగిందంతా చేస్తానని, నేరుగా సైన్యాన్ని పంపలేనని ఆమెకు సమాధానం ఇచ్చారు.
Ukrainian journalist makes emotional plea to Boris Johnson. Pleas for NATO cover on the border to allow refugees cross safely, asks why Abramovich and Putin’s children she claims are in London and the EU are not sanctioned while people in Ukraine dying pic.twitter.com/KGxL0VwzVY
— Lisa O'Carroll 🇺🇦 (@lisaocarroll) March 1, 2022
Comments
Please login to add a commentAdd a comment