ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓడిపోతాడంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. త్వరలో పుతిన్ ఓడిపోతాడని, రష్యా సైనిక ఆయుధాల ఎగుమతి దెబ్బతింటుందని అన్నారు జాన్సన్. దీంతో చైనా బలపడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యాల యుద్ధం ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కనపడటం లేదన్నారు. మనమంతా ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా సహకారంతో కొనసాగాల్సిందే అన్నారు. ఇలాంటి విపత్కర తరుణంలో చైనాతో కలసి పనిచేసే మార్గాలను అన్వేషించాలి.
ఈ మేరకు యూకే భారత్‌ల మధ్య ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి కూడా ప్రస్తావించారు జాన్సన్. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా బ్రిటన్, భారత్ ఒకదానిపై ఒకటి ఆధార పడకపోయినప్పటికీ కొంతమంది బాధ్యత రాహిత్యం వల్ల తాము కలిసికట్టుగా కొన సాగుతున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లు తమ మాతృదేశం పట్ల ఉన్న వీరత్వంతో కూడిన ప్రేమతో రష్యాపై పోరాడి విజయం సాధిస్తారనని ధీమాగా చెప్పారు. ఈ విషయంలో ఉక్రెయిన్‌కి బ్రిటన్ సైనిక పరంగా మద్దతిస్తునే ఉంటుందని నమ్మకంగా చెప్పారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచమంతటా సరఫరా అవుతున్న రష్యా సైనిక ఆయుధాలపై కచ్చితంగా ప్రభావం ఏర్పడతుందని అంచనావేశారు.
ఇప్పటికే 60 శాతం పైగా రష్యా క్షిపణులు నాశనమయ్యాయని అంచనా వేశారు. అదీగాక రష్యా గత దశాబ్దంలో భారత్‌కి సుమారు రూ.18 లక్షల కోట్లు ఆయుధాలను ఎగుమతి చేసిందన్నారు. అత్యున్నత సైనిక బలగాలు ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌ని నియంత్రించటంలో రష్యా విఫలమైందన్నారు. పుతిన్ చేసిన ఘోర తప్పిదం రష్యాను త్రీవ్రంగా బలహీనపరుస్తుందన్నారు.
అలాగే మరోవైపు చైనా తైవాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ భారత్‌లు కలిసి పనిచేయం అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. చైనా కరోనా మహామ్మారీ విషయంలోప్రవర్తించిన తీరును సైతం తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. మహమ్మారీ సమయంలో ఇరుదేశాలు ప్రపంచమంతటా బిలియన్ల కొద్ది వ్యాక్సిన్‌లను పంపిణీ చేశాయన్నారు. రానున్న రోజుల్లో ముప్పు మరింతంగా ఉంటుందని, అందువల్ల ఇరు దేశాలు(భారత్, బ్రిటన్ దేశాలు) పరస్పర సహకారాన్ని మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు బోరిస్ జాన్సన్
(చదవండి: అన్నంత పనిచేస్తున్న పుతిన్... చిన్నారులకు సైతం సైనిక శిక్షణ)
Comments
Please login to add a commentAdd a comment