
వార్సా: పోలాండ్ పై భారీఎత్తున సైబర్ దాడి జరిగింది. ఏకంగా పార్లమెంట్ సభ్యుల ఈ మెయిల్ ఖాతాలు హ్యాకింగ్ కు గురయ్యాయి. సుమారు పన్నెండు మంది ఎంపీల ఈమెయిల్ ఖాతాలపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఎంపీల ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు పోలాండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించారు..
హ్యాకింగ్ కు గురైన వారి ఖాతాలో ఆ దేశ ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు మిచల్ దోర్జిక్ ఖాతా కూడా వుంది. పోలాండ్ కు సంబందించిన రహస్య పత్రాలను హ్యాకర్లు తస్కరించరని ఇంటెలిజెన్స్ ఆధికారులు తెలిపారు. యూఎన్సీ 1151 అని పిలవబడే హ్యాకర్లు దాడి చేశారని పోలాండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment