
న్యూఢిల్లీ: ఉన్నత విద్యాభ్యాసం కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి కోసం విమానాల సంఖ్యను రెండింతలు పెంచబోతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆగస్టు మొదటి వారం నుంచి అమెరికాకు తమ విమానాల సంఖ్యను పెంచుతామని వెల్లడించింది.
ముందస్తుగా నోటీసు ఇవ్వకుండానే ఎయిర్ ఇండియా విమానాలను రీషెడ్యూల్ చేస్తున్నారంటూ విద్యార్థులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కరోనా కేసులు పెరగడం, భారత్ నుంచి వచ్చే విమానాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో.. ముంబై నుంచి నెవార్క్‌కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశామని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment