Phone Call Between PM Narendra Modi and Russia President Vladimir Putin - Sakshi
Sakshi News home page

చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా రష్యా

Published Wed, Mar 2 2022 7:00 PM | Last Updated on Wed, Mar 2 2022 7:19 PM

Phone call Between PM Narendra Modi and Russia President Vladimir Putin - Sakshi

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు సేఫ్ ప్యాసేజ్ (సురక్షిత మార్గం) కల్పించాలని కోరారు. ఇందుకు రష్యా ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు) వరకు డెడ్‌లైన్ విధించింది.

ఈలోగా తక్షణమే ఖార్కివ్‌ను వదిలి వెళ్లాల్సిందిగా ఇండియన్ ఎంబసీ భారతీయులను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు గంటల పాటు కల్పించిన సేఫ్ ప్యాసేజిని వినియోగించాలని రష్యా సూచించింది. ఖార్కివ్‌ను చేజిక్కించుకునేందుకు ఏమాత్రం ఆలస్యం చేయబోమని ఈ సందర్భంగా రష్యా పేర్కొంది.

చదవండి: (ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement