భారతీయ విద్యార్ధులకు బంపరాఫర్. ఇకపై ఇంటర్ తర్వాత డిగ్రీని తమ దేశంలో చదువుకోవచ్చని యూకే ఆఫర్ ప్రకటించింది. దీంతో ఆక్స్‌ఫర్డ్,కేంబ్రిడ్జ్, ఎల్‌ఎస్‌ఈ వంటి దిగ్గజ యూనివర్సిటీల్లో దేశీయ విద్యార్ధులు చదువుకునే అవకాశం ఏర్పడింది.
గతంలో మనదేశానికి చెందిన విద్యార్ధులు యూకేలో డిగ్రీ చేస్తే తిరిగి స్వదేశంలో ఉద్యోగం చేసేందుకు అనర్హులు. అక్కడి డిగ్రీలు..(కొన్ని సందర్భాలలో) ఇక్కడ చెల్లేవి కావు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 21న యూకే ప్రభుత్వంతో కేంద్రం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో భారత్ కు చెందిన విద్యార్ధులు..యూకేలో డిగ్రీ చేసి.. ఇక్కడ జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
"నేటి నుంచి యూకే డిగ్రీలను భారతీయ డిగ్రీలతో సమానంగా గుర్తిస్తాం. మీరు అక్కడ (యూకేలో) డిగ్రీ చదువుకోవచ్చు. మనదేశంలో ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు ఈ ఒప్పందం పరిధిలోకి రావు' అని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇప్పుడు రెండు దేశాలలో గుర్తించబడతాయి. దీని అర్థం భారతీయ కళాశాలల్లో డిగ్రీ పొందిన విద్యార్ధి ఇప్పుడు యూకేలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అర్హత పొందుతాడు. భారతీయ డిగ్రీ హోల్డర్లు..యూకే డిగ్రీ హోల్డర్లతో సమానంగా పరిగణించబడతారు. యూకేలో ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment