న్యూఢిల్లీ: రష్యాలోని వెలికీ నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న నలుగురు భారత వైద్య విద్యార్థులు వోల్ఖోవ్ నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ దుర్ఘటన జరిగినట్టు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒక మహిళా విద్యారి్థని కాపాడి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. విద్యార్థులంతా వెలికీ నోవ్‌గోరోడ్ స్టేట్ వర్సిటీలో చదువుతున్నారు.
మృతులంతా మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారు. మృతుల్లో జియా, జిషాన్ అక్కాతమ్ముళ్లు. నది ఒడ్డున వాకింగ్ తర్వాత వారంతా నదిలోకి దిగారు. ఈత కొడుతుండగా జిషాన్ తమ కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఈత వద్దని కుటుంబసభ్యులు ఫోన్లో వారిస్తుండగానే జియా మునగడం, కాపాడేందుకు ప్రయతి్నస్తూ మిగతావారు కూడా నదిలో కొట్టుకుపోవడం కాల్‌లో రికార్డయింది. మృతదేహాల తరలింపు కోసం భారత కాన్సులేట్ ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment