FOUR DEATHS
-
హిమాచల్‌లో భారీ మంచు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో భారీగా మంచు కురియడంతో నలుగురు మృతి చెందారు. మూడు జాతీయరహదారు లు, మరో 220 దారులను మూసివేశారు. సిమ్లా, కులు, మండి, చంబా, సిర్మౌర్ జిల్లాలతో పాటు కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సిమ్లాలో 145, కులులో 25, మండీ జిల్లాల్లో 20 రహదారులను మూసివేశారు. 356 ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం సిమ్లా, మనాలీలకు పర్యాటకులు పోటెత్తారు. స్థానిక నివేదికల ప్రకారం, అట్టారి నుంచి లేహ్, కులు జిల్లా లోని సంజ్ నుంచి ఔత్, కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంగం, లాహౌల్, స్పితి జిల్లాలోని గ్రామ్ ఫూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్ కారణంగా మూసివేశారు. రోడ్లను క్లియర్ చేయడానికి హిమాచల్ ప్రభుత్వం రెండు స్నో బ్లోయర్లతో సహా 268 యంత్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పేది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులు సూచించింది.తెల్లని వండర్‌ల్యాండ్‌గా హిమాచల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనా లీ వంటి పర్యాటక కేంద్రాలు తెల్లని వండర్‌ల్యాండ్‌గా మారాయి. అలాగే జమ్మూకాశీ్మర్లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా మంచుకురిసింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయా యి. ఇది క్రిస్మస్ సెలవుల కోసం ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. సోమవా రం అర్థరాత్రి మనాలీ, డల్హౌసీ శివారు ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం నమోదైంది. ఖద్రాలాలో అత్యధికంగా 24 సెంటీమీటర్లు, సంగ్లాలో 16.5 , షిల్లారోలో 15.3, చోపాల్, జుబ్బల్‌లో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్పాలో 14, నిచార్‌లో 10, సిమ్లాలో 7, పూహ్‌లో 6, జోత్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం, హిల్ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాణాంతక పరిస్థితులు ఉన్నా పర్యాటకులు పోటెత్తారు. సిమ్లాలోని హోటల్ గదుల ఆక్యుపెన్సీ 70 శాతం నమోదైంది. గత ఏడాది డిసెంబర్ కంటే ఇది 30 శాతం ఎక్కువ. మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలీ చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షా లు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
రష్యాలో నదిలో మునిగి... మన విద్యార్థుల మృతి
న్యూఢిల్లీ: రష్యాలోని వెలికీ నోవ్గోరోడ్ ప్రాంతంలోని విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న నలుగురు భారత వైద్య విద్యార్థులు వోల్ఖోవ్ నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ దుర్ఘటన జరిగినట్టు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒక మహిళా విద్యారి్థని కాపాడి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. విద్యార్థులంతా వెలికీ నోవ్గోరోడ్ స్టేట్ వర్సిటీలో చదువుతున్నారు. మృతులంతా మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారు. మృతుల్లో జియా, జిషాన్ అక్కాతమ్ముళ్లు. నది ఒడ్డున వాకింగ్ తర్వాత వారంతా నదిలోకి దిగారు. ఈత కొడుతుండగా జిషాన్ తమ కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఈత వద్దని కుటుంబసభ్యులు ఫోన్లో వారిస్తుండగానే జియా మునగడం, కాపాడేందుకు ప్రయతి్నస్తూ మిగతావారు కూడా నదిలో కొట్టుకుపోవడం కాల్లో రికార్డయింది. మృతదేహాల తరలింపు కోసం భారత కాన్సులేట్ ప్రయత్నిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి)/అబిడ్స్: డ్రైవర్ మద్యం మత్తు నలుగురి మృతికి కారణమైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట వద్ద ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన ఇంగ్లే రామారావు అనే టీచర్ కుటుంబం, వారి బంధువులు తూఫాన్ (కేఏ39 ఏం 1863), టవేరా వాహనాల్లో మొత్తం 19 మంది కలసి గురువారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలోని రావూర్‌కు ఓ నిశ్చితార్థం వేడుకకు వెళ్లారు. శుభకార్యం ముగించుకొని తూఫాన్ వాహనంలో 12 మంది, టవేరాలో ఏడుగురు హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో తూఫాన్ డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి లారీని ఢీకొని కిందకు చొచ్చుకెళ్లింది. ప్రమాదంలో వాహనంలోని శివాజీ (28), వరుణ్ (9), నాగేందర్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంధువులు సమాచారంతో çఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సదాశివపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన తృప్తి (16) చికిత్స పొందుతూ మృతి చెందింది. క్షతగాత్రులైన సంగీత, విజయలక్ష్మి, అనిషా, ముకుల్, వైభవ్ , రమేశ్, లక్ష్మీబాయిలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. డ్రైవర్ రవి ప్రమాదం తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు. తిరుగు పయనంలో దాబా వద్ద భోజనాలకు ఆగిన సమయంలో డ్రైవర్లు ఇద్దరూ మద్యం తాగారని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మహిమ అనే మహిళ ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడింది. -
పాతర్లపల్లికి జ్వరమొచ్చింది..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): అదో మారుమూల గ్రామం. అక్కడ సుమారు 450 కుటుంబాలు, 1,500 మంది జనాభా ఉంటారు. అలాంటి గ్రామంలో ఇప్పుడు 200 మంది తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. 20 రోజులుగా గ్రామాన్ని జ్వరాలు పీడిస్తున్నాయి. జ్వరాల బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే నలుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు డెంగీ లక్షణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. మిగిలిన వారంతా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమకు కూడా జ్వరాలు ఎక్కడ వస్తాయోనన్న భయంతో అనేకమంది గ్రామస్తులు ఊరునే ఖాళీ చేసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని పాతర్లపల్లిలో ఊరుఊరంతా విషజ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత లోపించింది. చెత్తాచెదారం పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురికికాలువల్లో దోమల లార్వా పెరిగిపోయింది. దీనికితోడు భారీగా కురుస్తున్న వర్షాలకు జంతు కళేబరాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలి.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల్లో నలుగురి దుర్మరణం గ్రామంలో కొద్దిరోజులుగా 200 మందికి పైగా తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం గ్రామానికి చెందిన రామ్ లచ్చమ్మ, కోడారి రాజవీరు, బాలమ్మ చనిపోయారు. తాజాగా అనుమండ్ల లక్ష్మి అనే మహిళకు విçషజ్వరం రావడంతో ఆమెను కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు డెంగీగా నిర్ధారించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆదివారం చనిపోయింది. ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ఉదయం నుంచే వరంగల్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల బాటపట్టారు. జమ్మికుంటలోని ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చూసినా పాతర్లపల్లికి చెందిన వారే కనిపిస్తున్నారు. కొందరు కరీంనగర్, హన్మకొండలలో ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుం టున్నారు. వైద్యాధికారులు నామమాత్రంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెళ్లిపోయారని, మురికికాలువల్లో మందు చల్లి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తుల రక్తనమూనాలు సేకరించారు. మంత్రి ఈటల రాజేందర్ ఆరా.. విషజ్వరాలపై ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. ఇంత జరుగుతున్నా స్థానిక వైద్యాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పెళ్లింట విషాదం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/అల్గునూర్: వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తు నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. కరీంనగర్ జిల్లా అల్గునూర్ శివారులో ఆగి ఉన్న లారీని టీఎస్ 02 ఈఎస్ 4400 నంబర్ గల కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఇంధన నిల్వల కేంద్రం సమీపంలోని రాజీవ్ స్వగృహలో నివాసముంటున్న కాంబ్లె సరితా బాయి–రవీందర్రావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రవీందర్రావు వెల్డింగ్ వర్క్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల పెద్ద కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రితేష్ పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 29న ముహూర్తం పెట్టుకున్నారు. బంధువులను ఆహ్వానించేందుకు నాలుగు రోజుల క్రితం సరిత–రవీందర్సొంత కారులో మహారాష్ట్రలోని లాతూర్ వెళ్లారు. అక్కడే ఉంటున్న సరిత సోదరి మీరాబాయి, ఆమె భర్త రఘునాథ్‌ను తీసుకుని సోమవారం హైదరాబాద్ వచ్చారు. కొడుకు రితేష్‌ను కలసి రాత్రి 8:30 గంటలకు రామగుండం బయల్దేరారు. మంగళవారం తెల్లవారు జామున 2.40 గంటలకు తిమ్మాపూర్ మండలం అల్గునూరు శివారు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపి ఉన్న లారీని వీరి కారు అమితవేగంతో వచ్చి ఢీకొట్టింది. బంకు సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించగా ముగ్గురు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో కారు ఇంజన్‌తోపాటు ముందుసీటు వరకు లారీ కిందకు దూసుకుపోయింది. దీంతో ముందుసీట్లో కూర్చున్న సరిత, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రవీందర్ మృతదేహాలు క్యాబిన్లో ఇరుక్కుపోయాయి. వెనుక సీట్లో కూర్చున్న మీరాబాయి కూడా అందులోనే నలిగిపోయింది. పోలీసులు సుమారు గంటపాటు మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించారు. ఫలితం లేకపోవడంతో గ్యాస్ కట్టర్ తెప్పించి కారు క్యాబిన్, డోర్లు కట్‌చేసి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకున్నా కారు వేగం అధికంగా ఉండడం, లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రాణాలను కాపాడలేకపోయాయి. రఘునాథ్ కొన ఊపిరితో ఉండగా.. వెంటనే వారు ఎల్ఎండీ పోలీసులకు, 108కు సమాచారం అందించారు. రఘునాథ్‌ను కారు నుంచి బలవంతంగా బయటకు తీసి 108లో కరీంనగర్‌కు తరలించారు. మార్గమధ్యలో రఘునాథ్ మృతిచెందాడు. -
అనంత జిల్లాలో డెంగ్యూ విజృంభన
-
వేడుకలో విషాదం!
► ఈతముక్కల ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల కన్నీరు ► రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతితో మిన్నంటిన రోదనలు ► మృతుల్లో ఇద్దరిది ఒంగోలు, మరో ఇద్దరిది కందులూరు ► రిమ్స్‌లో మృతుల బంధువులను పరామర్శించిన ఎంపీ వైవీ ఒంగోలు క్రైం : కొత్తపట్నం మండలం ఈతముక్కల వద్ద ఆదివారం రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందడంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురూ ఆయా కుటుంబాలకు ఆధారంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పగవానికి కూడా రాకూడదని మృతుల బంధువులు రోదిస్తున్నారు. ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన ఇద్దరు యువకులు, టంగుటూరు మండలం కందులూరుకు చెందిన మరో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో నలుగురూ మృతి చెందారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన మృతుల్లో ఇద్దరు మేనమామ, మేనల్లుడు కావడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాయ ఛాయలు అలముకున్నాయి. స్వయానా రక్త సంబంధీకులు కావటమే కాకుండా పక్కపక్క నివాస గృహాలు కూడా. భాగ్యనగర్ మూడో లైన్‌లోని స్విమ్మింగ్ పూల్ ఎదురుగా వీరిద్దరి నివాసాలు. సంఘటన స్థలంలోనే మృతి చెందిన మండపల్లి అశోక్ (20) ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (పీడీసీసీ)లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుకున్న అశోక్ రెండేళ్ల నుంచి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఆ కుటుంబానికి అశోక్ ఒకే ఒక మగ సంతానం. తండ్రి హనుమంతురావు వాటర్ ట్యాంక్ పక్కన గేదెలు మేపుకుంటూ కుటుంబాన్ని ఎక్కదీశాడు. ఎదిగొచ్చిన బిడ్డ కుటుంబానికి అందివస్తాడనుకుంటే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలితీసుకుందని కన్నీరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఇక దిక్కెవరంటూ బోరుమంటున్నారు. అదే ప్రమాదంలో మృతి చెందిన భాగ్యనగర్‌కే చెందిన బత్తుల పవన్ (14)తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తన వరుసకు మేనమామ అశోక్ ద్విచక్ర వాహనంపై సహచరుల వినాయక విగ్రహ నిమజ్జనానికి వెళ్తుంటే సరదాగా తాను వస్తానని వారి వెంట వెళ్లాడు. పవన్ తండ్రి ఒంగోలు రిమ్స్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ ఇంట్లో కూడా పవన్ ఒక్కడే మగ సంతానం. ఆ కుటుంబం దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తోంది. తీవ్ర గాయాలపాలై ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న కుట్టుబోయిన శివశంకర్ పరిస్థితి విషమంగా ఉంది. శివశంకర్ వల్లూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లారీ క్లీనర్‌గా పనిచేస్తూ తనకు ఉన్న ముగ్గురు కుమారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ చదివిస్తున్నాడు. శివశంకర్ మూడో సంతానం. వీరిదీ అంతే.. ఇదే ప్రమాదంలో మృతి చెందిన టంగుటూరు మండలం కందులూరుకు చెందిన ఇద్దరి కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. ఆ రెండు కుటుంబాల్లోనూ వీరిద్దరే పెద్ద దిక్కు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన అల్లూరు రాంబాబు(35) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి ఇటీవలే చనిపోయాడు. భార్యతో పాటు తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. కందులూరుకే చెందిన రెండో మృతుడు బొబ్బల కృష్ణమూర్తి (25) ఇంటికి పెద్ద కుమారుడు. రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసిన కృష్ణమూర్తి ఉద్యోగాల వేటలో నిమగ్నమై ఉన్నాడు. తండ్రి నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్‌లో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. ఇతనికి తల్లిదండ్రులతో పాటు తమ్ముడు కూడా ఉన్నాడు. మృతుల కుటుంబాలకు ఎంపీ వైవీ పరామర్శ రిమ్స్‌లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం రాత్రి పరామర్శించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీ.. హుటాహుటిన రిమ్స్‌కు చేరుకున్నారు. అక్కడే న్న భాగ్యనగర్ మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. కందులూరు మృతుల కుటుంబ సభ్యులను కూడా రిమ్స్‌లోనే పరామర్శించారు. మృతదేహాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ఒంగోలు టూటౌన్ సీఐ పి.దేవప్రభాకర్తో ప్రమాదం జరిగిన తీరును ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, చుండూరి రవి ఉన్నారు. -
డ్రైవర్ వద్దన్నా.. మృత్యువు వైపే పయనం
∙ మూడు రోజులుగా నిద్రపోని డ్రైవర్ ∙ ఆలస్యం అవుతుందని ఒత్తిడి చేసిన వైనం ∙ కానగూడూరు వద్ద నిద్రలోకి జారుకున్న డ్రైవర్ ట్రాక్టర్‌ను ఢీ కొన్న టెంపో ∙ ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి ∙ మృతులు ఉప్పల్, వనస్థలిపురం వాసులు మూడు రోజులుగా నిద్రలేదు.. కళ్లు మూతలు పడుతున్నాయని డ్రైవర్ చెప్పినా వారు వినిపించుకోలేదు.. ఎలాగైనా ఆఫీసు సమయానికి హైదరాబాద్‌కు వెళ్లాలని ఒత్తిడి చేశారు.. చేసేదేమీ లేక దేవుడిపై భారం వేసి డ్రైవర్ ప్రయాణం సాగించాడు.. దువ్వూరు మండలం కానగూడురు గ్రామ సమీపంలో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో ఐదు గురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మొర ఆలకించి ఉంటే రోడ్డు ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అంటూ క్షతగాత్రులు బోరున విలపించారు. ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు: దువ్వూరు మండలం కానగూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం నిలిపి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను టెంపో ట్రావెలర్ ఢీ కొన్న సంఘటనలో హైదరాబాద్‌లోని ఉప్పల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు (51) చందా ధనలక్ష్మి (44), సాయి యోజిత్ (10), అక్షిత్‌కుమార్ (6), గ్రీష్మా (11) మృతి చెందగా శివసాయి, స్వర్ణమ్మ, ప్రేమలత, శ్రీలక్ష్మి, రమేష్, కిషన్, సాయిజయంత్, ఇబ్రహీంపట్నంకు చెందిన పొట్టుముత్తు శ్రీనివాసులకు గాయాలయ్యాయి. బాధితులకు కర్నూలు జిల్లా చాగలమర్రిలోని కేరళ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చంపాపేట్‌లో విషాద ఛాయలు వనస్థలిపురం/చంపాపేట: తీర్థయాత్రలకు వెళ్లిన ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలియడంతో చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ దుర్గానగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. దుర్గానగర్ రోడ్డు నెం.3లోని జగ్టాప్ టవర్స్ అపార్ట్మెంట్లో కిషన్, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. కిషన్ హైటెక్ సిటీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, లక్ష్మి విద్యుత్ సౌధాలో ఏడిఇగా విధులు నిర్వర్తిస్తున్నారు. వనస్థలిపురం, ఉప్పల్, ఇబ్రహీం పట్నం ప్రాంతాలకు చెందిన 17 మంది బంధువులతో కలిసి వారు మే 26న తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లి తిరిగివస్తుండగా బుధవారం తెల్లవారు జామున కడపజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు అక్షిత్(6) అక్కడికక్కడే మృతి చెందగా శివసాయి, కిషన్, లక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వనస్థలిపురం టీవీ కాలనీకి చెందిన చందారమేష్ భార్య ధనలక్ష్మీ(40) తీవ్రంగా గాయపడి మృతి చెందగా, రమేష్‌కు గాయాలు అయ్యాయి. రమేష్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడీగా పనిచేస్తుండగా ధనలక్ష్మీ స్థానికంగా బట్టల వ్యాపారం నిర్వహిస్తుంది. ధనలక్ష్మీ మృతితో వనస్థలిపురం సాయిటవర్స్‌లో విషాదం నెలకొంది. నిద్ర వస్తోందని డ్రైవర్ చెప్పినా.. బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో టెంపో ట్రావెలర్ దువ్వూరు సమీపంలోని పుల్లారెడ్డిపేట పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. డీజల్ తక్కువగా ఉందని డ్రైవర్ చెప్పడంతో పట్టించుకోమని చెప్పడంతో అతను వాహనం ఆపాడు. డీజల్ పట్టించుకున్న తర్వాత డ్రైవర్ భాను కొంత సేపు పడుకున్నాడు. నిద్రలేపిన వారు బయలుదురుదామని చెప్పడంతో అతను ‘నిద్ర వస్తోంది సార్.. కొద్దిసేపు పడుకుంటాను.. మూడు రోజుల నుంచి కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తున్నాను అలసటగా ఉంది ’అని చెప్పాడు. అయితే గత నెల 26న ఇంటి నుంచి బయలుదేరిన వారు 30న రాత్రికి ఇంటికి చేరుకునేలా టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆలస్యం కావడంతో 31 వరకూ దారిలోనే ఉండాల్సి వచ్చింది. బుధవారం విధులకు వెళ్లాల్సి ఉండటంతో ఆఫీసు సమయానికి ఎలాగైనా హైదరాబాద్‌కు వెళ్లాలని డ్రైవర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో డ్రైవర్ భాను వారి మాట కాదనలేక ప్రయాణం సాగించాడు. కానగూడూరులోని పూల మార్కెట్ సమీపంలో టెంపో ట్రావెలర్ పక్కన ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో గాఢ నిద్రలో ఉన్న సగం మంది ఇసుకలో కూరుకుపోయారు. వీరిలో ఊపిరి ఆడకపోవడంతో సాయి యోజిత్, అక్షిత్‌కుమార్, గ్రీష్మా అనే చిన్నారులు మృతి చెందారు. అదే సమయంలో నవాజ్ చేసుకునేందుకు మసీదుకు వచ్చి ముస్లింలు సహాయక చర్యలు చేపట్టారు. ఇసుకలో కూరుకొని పోయిన వారిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. విషాదం నింపిన రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంకు చెందిన పొట్టుముత్తు శ్రీనివాసులు మెడికల్ షాపు నిర్వహించేవాడు. అతని కోరిక మేరకు బంధువులందరూ గత నెల 26న హైదరాబాద్ నుంచి టెంపో ట్రావెలర్ వాహనంలో తీర్థ యాత్రలకు బయల్దేరారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఆయన సోదరి ధనలక్ష్మి, చిన్నబావ వెంకటేశ్వర్లు, కొడుకు సాయియోజిత్ ఉన్నారు. అతని తమ్ముడు కిషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కిషన్ కుమారుడు అక్షిత్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
మృత్యు పంజా
జిల్లాలో మృత్యువు పంజా విసిరింది. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురిని బలితీసుకుంది. 12 మందిని క్షతగాత్రులను చేసింది. రెండు మోటారుసైకిళ్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం ఉండి : మండలంలోని కోలమూరులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గణపవరానికి చెందిన కసిలంకి బాలాజీ, అతని భార్య భాగ్యలక్ష్మి ద్విచక్రవాహనంపై భీమవరం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో గణపవరం మండలం అర్థవరం గ్రామానికి చెందిన కట్లయ్య ఉండిలో తను పనిచేస్తున్న చేపల చెరువు వద్దకు వెళ్తున్నాడు. కోలమూరు రైస్‌మిల్లు వద్దకు వచ్చేసరికి బాలాజీ కంటైనర్ అడ్డం రావడంతో దానిని ఓవర్టేక్ చేసి ముందుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన కట్లయ్య వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కట్లయ్య వెంటనే మరణించాడు. భాగ్యలక్ష్మి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడింది. 108 రావడం ఆలస్యం కావడంతో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృదేహాలను భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై పేర్కొన్నారు. పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తా .. డ్రైవర్ మృతి తూర్పుపాలెం (ఆచంట) : ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బుధవారం అదుపు తప్పి చేలల్లో బోల్తా పడింది. తూర్పుపాలెం సమీపంలోని నక్కల కాలువ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ట్రాక్టరు డ్రైవర్ మృతి చెందాడు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆచంట మండలం కొడమంచిలి పెదపేటకు చెందిన 30 మంది గ్రామానికి చెందిన ముప్పిరి రామారావు కుమార్తె వివాహం నిమిత్తం బుధవారం ట్రాక్టరుపై పోడూరు మండలం పండిత విల్లూరుకు వెళ్లారు. అక్కడ వివాహ అనంతరం అదే ట్రాక్టరుపై తిరుగుపయనమయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు తూర్పుపాలెం దాటిన తర్వాత నక్కల కాలువ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న చేలల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టరు డ్రైవర్ గొల్ల సందీప్(19) మృతి చెందాడు. సల్లపూడి మంగ, దేవాబత్తుల సరోజిని, ఊడి కళాపూర్ణ, నక్కా సురేష్, కంబొత్తుల రాజ్‌కుమార్, ప్రదీప్, కోట శేఖర్, కాకర ప్రసన్నకుమార్, ఉండ్రు రాజేష్‌తోపాటు మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఇంజనుకు ట్రాక్టరుకు ఉన్న లింకు రాడ్డు విరిగి పోవడంతో ట్రాక్టరు బోల్తా పడింది. ట్రక్కు బోల్తా పడకుండా నిలిచిపోవడంతో ట్రక్కులో కూర్చున్న వారికి పెనుప్రమాదం తప్పింది. స్థానికులు, ప్రయాణికులు స్పందించి గాయపడిన వారిని రక్షించి ఆచంటలోని సీహెచ్‌సీకి తరలించించారు. వైద్యాధికారులు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యసేవల నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతిగా మద్యం తాగడం వల్లే ప్రమాదం ప్రమాదంలో మృతిచెందిన సందీప్ అవివాహితుడు. అతిగా మద్యం తాగి వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. పెనుగొండ మండలం తాళ్లపాలెంకు చెందిన సత్యనారాయణ, మంగ దంపతులకు సందీప్‌తోపాటు, ఇద్దరు కుమార్తెలు. చెట్టంత కొడుకు దూరమైపోవడంతో ఆ కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. బాధితులను వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సుంకర సీతారామ్, సర్పంచ్ చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ పరామర్శించారు. లారీ ఢీకొని మహిళ.. విజయరాయి(పెదవేగి రూరల్) : భార్యాభర్తలు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా.. లారీ ఢీకొని భార్య అక్కడిక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన విజయరాయి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరులోని కుమ్మరచెరువు ప్రాంతానికి చెందిన చమళ్లమూడి శ్రీనా«థ్, సుజాత(40) దంపతులు బుధవారం రాత్రి చింతలపూడికి పనిమీద వెళ్లి తిరిగి ఏలూరు వస్తుండగా, పెదవేగి మండలం విజయరాయిలో కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మలుపులో ఏలూరు నుంచి ఎదురుగా వస్తున్న లారీ మోటార్‌సైకిల్‌ను ఢీకొంది. దీంతో సుజాత లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శ్రీనాథ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భార్య మృతదేహం వద్ద ఆయన విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ట్రక్కు ఆటో ఢీకొని.. గుండుగొలను (దెందులూరు) : జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుండుగొలను వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మెకానిక్ మృతి చెందాడు. దెందులూరు ఎస్సై ఎ¯ŒS.ఆర్.కిశోర్‌బాబు కథనం ప్రకారం.. గంపల దుర్గాప్రసాద్ (55) విజయవాడలో పొక్లెయి¯ŒS, లారీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మెకానిక్ పని నిమిత్తం పోలవరం వెళ్లి మరో వ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో మంగళవారం రాత్రి టీ కోసం జంక్ష¯ŒS వద్ద ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఆగారు. ఆ సమయంలో మరోవ్యక్తి బహిర్భూమికి వెళ్ళాడు. అక్కడే నిలబడి ఉన్న దుర్గాప్రసాద్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఆటో ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. దుర్గాప్రసాద్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.