లండన్: బ్రిటన్ విద్యార్థి వీసా పొందిన విదేశీయుల్లో భారతీయులు తొలిస్థానంలో నిలిచారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎస్) వెలువరించిన గణాంకాల ప్రకారం 2019లో 37,500 మంది భారతీయ విద్యార్థులకు టయర్–4(విద్యార్థి) వీసాలు దక్కాయి. 8 ఏళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం. వృత్తి నిపుణులకిచ్చే టయర్–2 వీసాల్లో సగం భారతీయులకే దక్కాయి. ఈ విభాగంలో భారతీయులు 57వేల వీసాలతో టాప్‌లో నిలిచారు. గత ఏడాది 5.15 లక్షల మంది భారతీయులకు పర్యాటక వీసా ఇచ్చినట్లు తెలిపింది. అంతకు ముందుతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువని వివరించింది.
మొత్తమ్మీద భారతీయుల వీసా దరఖాస్తులను 95 శాతం వరకు ఆమోదించినట్లు తెలిపింది. బ్రిటన్‌కు వలసలు యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి తగ్గిపోగా, మిగతా దేశాల నుంచి క్రమేపీ పెరుగుతున్నట్లు వివరించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానంతో కూడా భారతీయులకు లాభం కలుగుతుందని తెలిపింది. (చదవండి: హ్యాపీనెస్ క్లాస్‌పై మెలానియా ట్వీట్..)
Comments
Please login to add a commentAdd a comment