భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక | France Welcome 30000 Indian Students By 2030 Macron Says | Sakshi
Sakshi News home page

భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక

Published Fri, Jan 26 2024 12:33 PM | Last Updated on Fri, Jan 26 2024 12:36 PM

France Welcome 30000 Indian Students By 2030 Macron Says - Sakshi

ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 

ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. "ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫ్రెంచ్ రాని విద్యార్థులకు  అంతర్జాతీయ తరగతులను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.  

ఫ్రాన్స్‌లో చదివిన భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని మాక్రాన్ వెల్లడించారు.  2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకోగా.. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తామని ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.

భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం  శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం జైపుర్‌ శివారులోని ఆమెర్‌ కోటను మాక్రాన్‌ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. 

ఇదీ చదవండి: Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్‌ రోడ్‌ షో


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement