Macron
-
ఫ్రాన్స్ గమ్యం ఎటు?
అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆదివారం రెండో రౌండ్ ఎన్నికల్లో వోటర్లు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ఫ్రాన్స్‌లో సందిగ్ధత నెలకొంది. తొలి రౌండులో స్పష్టంగా మితవాదం వైపు మొగ్గినట్టు కనిపించిన వోటర్లు హఠాత్తుగా దారి మార్చి ఇతర పక్షాలను తలకెత్తుకున్న వైనం బహుశా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. 577 మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు రావాలి. కానీ తాజా ఫలితాల తర్వాత వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ 182 (తొలి రౌండ్లో రెండో స్థానం) సీట్లతో అగ్రభాగాన ఉండగా అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 (తొలి రౌండ్లో మూడోస్థానం) వచ్చాయి. తొలి రౌండ్లో 32 శాతం వోట్లు సాధించుకుని అధికార పీఠానికి చేరువగా వెళ్లినట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) రెండో రౌండ్లో సీట్లపరంగా 143తో మూడో స్థానానికి పరిమితమైంది. ఆర్ఎన్ పార్టీ తొలి రౌండ్లో అగ్రభాగాన ఉండటంతో ఇతర పక్షాల వోటర్లు అప్రమత్తమయ్యారు. మితవాద పక్షానికి పాలనాపగ్గాలు దక్కనీయరాదన్న కృతనిశ్చయంతో అటు మధ్యేవాద పక్షానికీ, ఇటు వామపక్షానికీ వోటేశారు. తొలి దశలో 65 శాతం, రెండో దశలో 63 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1981 తర్వాత ఈ స్థాయి వోటింగ్ ఎప్పుడూ లేదు. ఆర్ఎన్ గెలుపు ఖాయమని తేలినచోట్ల వామపక్ష కూటమి, మధ్యేవాద కూటమి అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి ముఖాముఖి పోటీకి మార్గం సుగమం చేశారు. కనీసం 200 స్థానాల్లో బహుముఖ పోటీ బెడద తప్పింది. దీని ప్రభావం ఎంతగా ఉందంటే... ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతం లా సార్ద్లోని అయిదు స్థానాల్లో ఆర్ఎన్ తొలి రౌండ్లో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. తీరా ముఖాముఖి పోటీలో ఆ పార్టీకి ఒక్కటీ దక్కలేదు.రాజకీయ అస్థిరత ఫ్రాన్స్‌కు కొత్తగాదు. 1946–’58 మధ్య పన్నెండేళ్లలో ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. అయితే అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ప్రచ్ఛన్న యుద్ధ దశ మొదలైన తొలినాళ్ల కాలం. భవిష్యత్తులో మరెప్పుడూ దేశం సంకీర్ణాల జోలికి పోకుండా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పటికీ అదే అమల్లోవుంది. ఎన్నికల్లో భిన్నపక్షాలు కూటమిగా పోటీ చేయటం, నెగ్గితే కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయటం ఫ్రాన్స్‌లో సాధారణమే. కానీ కూటమిలో అధిక స్థానాలొచ్చిన పార్టీయే తన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి భిన్నమైనది. ఒక పార్టీగా అత్యధిక స్థానాలు గెల్చుకున్నది ఆర్ఎన్ ఒక్కటే. చిత్రమేమంటే అటు ఆర్ఎన్లోనూ, ఇటు న్యూ పాపులర్ ఫ్రంట్‌లోనూ మేక్రాన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయలేని స్థితిలో పాలనలో పాలుపంచుకోవటం వృథా అని ఇరుపక్షాల నేతలూ భావిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రజల్లో మేక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పార్టీతో కలిస్తే ఆ చీడ తమకూ అంటుతుందన్న భయాందోళనలు ఇరుపక్షాల్లోనూ ఉన్నాయి. అందుకే విస్తృత మధ్యేవాద కూటమిని ఏర్పాటు చేయాలన్న మేక్రాన్ ప్రయత్నం ఫలించకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. ఈనెల 26న ప్యారిస్ ప్రధాన వేదికగా ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ ఘట్టం ప్రారంభం కాబోతోంది. 16 నగరాల్లో ఆగస్టు 11 వరకూ వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. ఈ దశలో దేశంలో రాజకీయ అస్థిరత అలుముకుంటే ఎలాగన్న ఆందోళన అన్ని పక్షాల్లోనూ ఉంది. తమ కూటమికి అత్యధిక స్థానాలొచ్చాయి గనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వామపక్ష అన్బౌడ్ నేత జీన్ లక్ మెలింకోన్ కోరుతున్నారు. మితవాద ఆర్ఎన్ పార్టీని రానీయకూడదన్న పట్టుదలతో సోషలిస్టులు, వివిధ వామపక్షాలూ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి తప్ప వాటి మధ్య లుకలుకలు తక్కువేమీ కాదు. అన్బౌడ్ పార్టీ భావసారూప్య పక్షాలన్నిటినీ ఒక గొడుగు కిందకు తెచ్చిందన్న మాటేగానీ ఆ పార్టీకి తలొగ్గి ఇతర పక్షాలు పనిచేస్తాయా అన్నది సందేహమే. సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లకతప్పదు. అదే జరిగితే వామపక్ష కూటమికి ఇప్పుడు దక్కిన ఆదరణ ఆవిరయ్యే ప్రమాదం, ఆర్ఎన్ మరింత పుంజుకునే అవకాశం ఉంటాయి. మెలింకోన్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయన దుందుడుకు విధానాలు ఇంటా బయటా సమస్యాత్మకం కావొచ్చని, ముఖ్యంగా యూరప్ యూనియన్ (ఈయూ)తో పేచీలు తేవచ్చునని భయాందోళనలున్నాయి. ఈయూలో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌దే. నాజీల దురాక్రమణతో సంక్షోభాన్నెదుర్కొన్న ఫ్రాన్స్‌లో మితవాదపక్షానికి ఆది నుంచీ ఆదరణ లేదు. కానీ ఆర్ఎన్ అధినేత మెరిన్ లీ పెన్ తెలివిగా జాత్యహంకారం, యూదు వ్యతిరేకత వంటి అంశాల్లో పార్టీ విధానాలను సవరించుకున్నారు. విద్వేష ప్రసంగాలతో తరచు జైలుపాలైన తన తండ్రి మెరీ లీపెన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని కూడా వెనకేసుకొచ్చారు. ఫ్రాన్స్ రాజ్యాంగంలోని 12వ అధికరణం కింద కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నిర్దిష్ట వ్యవధంటూ లేదు. అలాగని దీర్ఘకాలం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే అది మేక్రాన్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తుంది. మొత్తానికి మూడు పక్షాల్లోనూ ఎవరూ మరొకరితో కలవడానికి ఇష్టపడని వర్తమాన పరిస్థితుల్లో మేక్రాన్ ఏం చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా అవిశ్వాస తీర్మాన గండం తప్పదు. మెడపై మితవాద బెడద వేలాడుతున్న తరుణంలో చివరకు ఫ్రాన్స్ గమ్యం ఏమిటన్నది మిలియన్ యూరోల ప్రశ్న! -
భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. "ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫ్రెంచ్ రాని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో చదివిన భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని మాక్రాన్ వెల్లడించారు. 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకోగా.. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తామని ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం జైపుర్ శివారులోని ఆమెర్ కోటను మాక్రాన్ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. ఇదీ చదవండి: Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్ రోడ్ షో -
ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని చూపించిన ప్రదాని మోదీ!
జనవరి 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజుల భారతదేశ పర్యటనలో ఉన్నారు. ముందుగా జైపూర్ రోడ్ షోలో పాల్గొని కొండపై ఉన్న అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్ అబ్జర్వేటరీ హవా మహల్‌లను కూడా సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ గురువారం పింక్ సిటీ రోడ్‌షోలో నరేంద్రమో మోదీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లారు. నగరం నడిబొడ్డున చిన్న మార్గం గుండా పయనమవ్వుతూ ..తొలుత జంతర్‌మంతర్ నుంచి పప్రారంభమయ్యి అలా 18వ శతాబ్దపు ఖగోళ అబ్జర్వేటరీ వరకు సాగింది. వారిద్దరూ వాహనంలో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ..ఆ మార్గంలో కనిపించేవారికి అభివాదం చెబుతూ సాగిపోయారు. ఇక మోదీ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం తదనంతరం జైపూర్‌లో చేసిన తొలి పర్యటన ఇది. ఇక ఆయ ప్రసిద్ధ ప్రదేశాలను సందరర్శించిన తదనంతరం ఇరువురు నాయకులు ఆ హవా మహల్ ముందు ఉన్న దుకాళంలో మసాల్ చాయ్ సిప్ చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఆ షాపు యజమానికి డిజటల్ చెల్లింపు చేసి భారత్‌లో ఇది ఎంత సర్వసాధారణం అన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. అంతేగాదు ఇక్కడకు వచ్చే సందర్శకులు ఇలా డిజిటల్ చెల్లింపులే చేస్తారని ప్రధాని మోదీ మాక్రాన్‌కు తెలియజేశారు. అంతేగాదు మోదీ మాక్రాన్ కోసం అక్కడే ఉన్న ఒక దుకాణంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఓ ప్రతిమను కూడా కొనుగోలు చేశారు. ఇక మోదీ గ్లోబల్ ఫోరమ్‌లలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామీగా ఉందని పదేపదే నొక్కి చెబుతుండేవారు. పైగా భారత్ డిజిటల్ పరివర్తన గురించి తన ప్రశంగంలో ప్రశంసిస్తుండేవారు కూడా. కాగా, మాక్రాస్ తిరుగు ప్రయాణంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ కొండపై పర్యాటక ప్రదేశంగా అలరారుతున్న అంబర్ కోటను కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియో తెగ నెట్టింట వైరల్ అవుతోంది. #WATCH | Rajasthan: Prime Minister Narendra Modi and French President Emmanuel Macron visited a tea stall and interacted with each other over a cup of tea, in Jaipur. French President Emmanuel Macron used UPI to make a payment. pic.twitter.com/KxBNiLPFdg — ANI (@ANI) January 25, 2024 (చదవండి: ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ టెక్నిక్ ఫాలో అయితే త్వరగా చేసేయొచ్చు!) -
జైపూర్‌లో మోదీ, మాక్రాన్ రోడ్ షో
జైపూర్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు జైపూర్‌లో రోడ్ షో నిర్వహించారు. మాక్రాన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం జైపూర్ చేరుకున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఆయనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్ రాజ్ మిశ్రా స్వాగతం పలికారు. అటు.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా జైపూర్ చేరుకున్నారు. అనంతరం జైపూర్‌లో ఇద్దరూ రోడ్‌షో నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించారు. ఈ పర్యటన తర్వాత మాక్రాన్, మోదీ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఫ్రెంచ్ ఆర్మీకి చెందిన బృందం సిద్ధమైంది. ఈ పర్యటనలో ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇక, ఫ్రాన్స్.. భారత్‌కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది. ఇదీ చదవండి: నేడు భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. మోదీతో స్పెషల్ ప్రోగ్రామ్.. -
మెక్రాన్ సతీమణికి పోచంపల్లి ఇక్కత్ చీర బహుకరించిన మోదీ..
ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్‌ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి. మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర.. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్‌కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు 'మార్బుల్ ఇన్లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం. కాశ్మీరీ కార్పెట్.. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్‌ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది. గంధపు ఏనుగు.. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది. ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు.. -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు చల్లార్చే యత్నాలు
మాస్కో: ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సోమవారం అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్‌లర్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సోమవారం పుతిన్‌తో సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. రష్యాతో చర్చలు జరిపి ఉద్రిక్తతలు నివారించడమే తన ప్రాధాన్యాంశమని మాక్రాన్ పలుమార్లు చెప్పారు. పుతిన్‌తో సమావేశానికి ముందు ఆదివారం ఆయన బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడడంపై రాజీ లేదని, ఇదే సమయంలో రష్యాకు స్వీయ రక్షణపై ఉన్న సందేహాలు తీర్చాల్సిందేనని మాక్రాన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్‌లర్ షుల్జ్ ఈ నెల 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు. అప్పట్లో కూడా ఆ రెండే క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీల దౌత్యం ఎంతమేర ఫలిస్తుందో చూడాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నిబంధనల ప్రకారమే ఒప్పందం జరిగి ఉండొచ్చు
-
బుడతడి ఆర్ట్‌కి అధ్యక్షుడు ఫిదా
లాగోస్(నైజీరియా) : 11 ఏళ్ల నైజిరియా బుడతడు గీసిన చిత్రానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఫిదా అయ్యారు. నైజీరియాలో రెండు రోజు పర్యటనలో భాగంగా మాక్రాన్ లాగోస్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైజీరియా చిన్నారి కరీమ్ వారిస్ ఒలామిలేకన్ గీసిన తన చిత్రాన్ని చూసుకొని మాక్రాన్ మురిసిపోయారు. చిత్రాన్ని గీసిన కరీమ్‌ను ప్రేమతో దగ్గరకు తీసుకొని వెన్ను నిమిరి మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కరీమ్ కేవలం రెండు గంటల్లోనే మాక్రాన్ చిత్రాన్ని గీశాడు. మాక్రాన్ ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. బుడతడి నైపుణ్యం తన మనస్సుకు హత్తుకుందని అతనికి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పిటిన తర్వాత తొలిసారి మాక్రాన్ నైజిరియాలో పర్యటించారు. ఆఫ్రికా లెజెండరీ మ్యూజీషియన్ ఫెలా కుటి స్మారకార్థం లాగోస్‌లో నిర్మించిన నైజీరియా నైట్ క్లబ్‌ను సందర్శించారు. -
బుడతడి ఆర్ట్‌కి ఆ దేశ అధ్యక్షుడు ఫిదా
-
నీవు నేర్పిన విద్యనే అధ్యక్షా...!
దెబ్బకు దెబ్బ రుచి అంటే ఏమిటో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్‌కు తాజాగా స్వానుభవానికి వచ్చింది. తన ధృడమైన కరచాలనంతో స్త్రీ, పురుషుడనే తేడా లేకుండా ఇతర దేశాధినేతలను ‘నొక్కిన’ చరిత్ర ఆయనకుంది. ఈ రకమైన ట్రేడ్‌మార్క్ షేక్హ్యాండ్లతో విదేశీ ప్రముఖులను అదరగొట్టే ట్రంప్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మాక్రన్ అదే తరహాలో తన ఉక్కు పిడికిలి బిగించి చేసిన ప్రత్యేక కరచాలనంతో చుక్కలు చూపించాడు. ఇటీవల కెనడాలో జరిగిన జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అరుదైన ఈ దృశ్యం చోటు చేసుకుంది. ట్రంప్ కుడిచేయిని మాక్రన్ ఎంత గట్టిగా, బలంగా నొక్కాడంటే ఎర్రగా కమిలిపోయింది. ఈ షేక్‌హ్యాండ్ పూర్తయ్యాక ట్రంప్ కుడిచేయి వెనక మాక్రన్ బొటనవేలు గుర్తు ముద్రించుకు పోయేంత దృఢంగా...దాదాపు 30 సెకన్లపాటు సాగిన ఈ కరచాలనంలో తాను పడిన బాధను పళ్ల బిగువున కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నించారు. కుడికన్ను గీటుతూ ట్రంప్‌పై తనదే పై చేయి అన్నట్టుగా మాక్రన్ విజయదరహాసం చేశారు. ‘ ఆర్మ్ రెస్లింగ్‌లో మాక్రన్‌ను ఓడించడం కొంచెం కష్టమైనదే. అయితే మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. మొదటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి’ అంటూ ఈ ఘటన అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించినట్టు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ షేక్హ్యాండ్లో 71 ఏళ్ల ట్రంప్ 40 ఏళ్ల మాక్రన్‌తో చేతులు కలిపి ఉంచడానికి పడిన ఇబ్బందికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ట్విటర్లోనైతే ఎడతెగని చర్చలతో పాటు పలువురు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. - ‘1980 దశకం నాటి హ్యాండ్షేక్లతో తన సామర్థ్యాన్ని, బలాన్ని చాటుకోవాలని చూస్తున్న ట్రంప్‌నకు చివరకు మాక్రన్ కరచాలనం రూపంలో గుణపాఠం దొరికినట్టు అయ్యింది’ అంటూ కమ్యూనియ కొమ్యునియ ట్విటర్ అకౌంట్‌తో స్పందించారు. - ‘ బలప్రయోగంతో కూడిన షేక్‌హ్యాండ్‌కు ప్రసిద్ధుడైన ట్రంపే ఇప్పుడు మాక్రన్ చేతుల్లో బాధితుడయ్యాడు. చూడండి..పాపం ట్రంప్ చేతులపై మాక్రన్ వేలి గుర్తులు..శక్తి అనేది బలమైనదని తేలింది’ అని చ్యుంగ్యెయన్ చౌ వ్యాఖ్యానించాడు. - ‘హ్యాండ్‌షేక్ క్రీడలో మాక్రన్ విజయం సాధించాడు’ అంటూ నిక్ వెన్మీకర్స్ పేర్కొన్నాడు. - ‘ట్రంప్ మార్క్ గొరిల్లా పట్టు కరచాలనానికి మాక్రన్ గట్టి సమాధానమే ఇచ్చినట్టున్నాడు’ అని ఎరిక్ కొలంబస్ మరో వ్యాఖ్యకు సమాధానమిచ్చాడు. - ‘ఇదొ గొప్ప ఫోటో ప్రేం...ట్రంప్ చేతిపై మాక్రన్ బొటనవేలు ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ కోరినె పెర్కిన్స్ వ్యాఖ్యానించారు. - ‘ శరీరాకృతిలో పోల్చితే మాక్రన్ చిన్నగా ఉన్నా 71 ఏళ్ల ట్రంప్‌నకు ఎవరు బాసో తెలియజేశాడు. ఇది నిజంగా అభినందించదగ్గదే’ నని హేచ్ఎంపీఆ స్లేడ్ అన్నాడు. - ‘ట్రంప్ గొంతు చుట్టూ (చేతిపై కాకుండా) మాక్రన్ వేళ్లు లేకపోవడం విచారకరమే’ అంటూ వ్యంగ్యంగా డాన్ క్యాంప్‌బెల్,, ‘ఈ సారి అవకాశమొస్తే గొంతుపై ఈ ప్రయత్నమే చేయాలి’ అని హాస్యపూర్వకంగా జాన్ స్టీవెన్స్ పేర్కొన్నాడు. అయితే...వీరిద్దరి మధ్య ఇదే మొదటి షేక్‌హ్యాండ్ కాదు. గతేడాది ప్రాన్స్‌లో కలుసుకున్నపుడు ఇద్దరి మెటికలు తెల్లగా పాలిపోయే వరకు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఏడాది మొదట్లో మాక్రన్ అధికారిక పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో చోటు చేసుకున్న ఇద్దరు దేశాధినేతల కరచాలనం కొంత వికారంగా, ఇబ్బందికరంగా మారాక, ఆ తర్వాత అది వారిద్దరి ఆలింగనానికి దారితీసింది. వివిధ దేశాల అధిపతుల అమెరికా పర్యటన సందర్భంగా లేదా ట్రంప్ విదేశ పర్యటనల సందర్భంగా ట్రంప్ అనుసరించే ధోరణి, ప్రదర్శించే పెద్దన్న వైఖరి వల్ల గతంలో వివిధ దేశాల ప్రముఖులు చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు వార్తలొచ్చాయి. గతేడాది అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ట్రంప్ ఆధిపత్య షేక్‌హ్యాండ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తన ట్రేడ్ మార్క్ ‘ఎలుగుబంటి ఆలింగనం’ (బేర్ హగ్)తో సమాధానమిచ్చేశారని ట్విటర్వేదికగా చర్చ కూడా సాగింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పదునుతేరిన బంధం!
అంతర్గత సమస్యలు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవచిస్తున్న ‘అమెరికా ఫస్ట్’, రష్యా నుంచి అడపా దడపా ఎదురయ్యే చికాకులు ప్రపంచీకరణ పునాదుల్ని కదిలిస్తున్న తరుణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌లో నాలుగురోజులు పర్యటించారు. రక్షణ, భద్రత, అణు ఇంధనం వగైరా రంగాల్లో ఇరు దేశాల మధ్యా 14 ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాలకు చెందిన కంపెనీల మధ్యా కుదిరిన ఒప్పందాల విలువ లక్ష కోట్ల రూపాయలపైబడే ఉంది. భారత్–ఫ్రాన్స్‌ల మధ్య ఎంతటి గాఢమైన అనుబంధం ఉన్నదో చెప్పడానికి మాక్రాన్‌కు లభించిన ఘన మైన స్వాగతసత్కారాలే తార్కాణం. అలాగని గత నెల మన దేశంలో పర్యటించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తరహాలో మాక్రాన్ సూటూ బూటూ వదిలి ఇక్కడి సంప్రదాయ దుస్తులు ధరించి మనల్ని అలరించాలని చూడలేదు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయానా విమానాశ్రయానికెళ్లి మాక్రాన్ దంపతులకు స్వాగతం పలికారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన అనుబంధం కాదు. రెండు దేశాలూ వ్యూహాత్మక బంధంలోనికి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్త యింది. 1998లో వాజపేయి హయాంలో మన దేశం పోఖ్రాన్లో అణు బాంబు పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ తీవ్ర విమ ర్శలకు దిగితే ఫ్రాన్స్ మనకు అండగా నిలబడింది. యూరప్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సులో భారత్‌పై ఆంక్షలు తెచ్చేందుకు బ్రిటన్ ప్రయత్నిస్తు న్నప్పుడు దాన్ని వీటో చేస్తానని హెచ్చరించింది ఫ్రాన్సే. అందుకు ఆనాటి భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా స్వయంగా పారిస్ వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వచ్చారు. అనంతరకాలంలో రెండు దేశాల మధ్యా వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. నిలకడగా మాట్లాడటం, నిర్దిష్టమైన విధానాల్ని ప్రకటించి వాటికి కట్టుబడి ఉండటం డోనాల్డ్ ట్రంప్‌కు లేని కారణంగా అంతర్జాతీయంగా ఒక అనిశ్చితి ఏర్ప డింది. అమెరికాతో తమకెలాంటి సంబంధాలున్నాయో, అవి ఎటుపోతాయో తెలి యని అయోమయ స్థితిలో ప్రతి దేశమూ ఉంది. ఇటు చైనా అందుకు పూర్తి విరుద్ధం. ట్రంప్ తీరుతెన్నుల పర్యవసానంగా ఏర్పడ్డ ఈ పరిస్థితిని అది సంపూ ర్ణంగా వినియోగించుకుంటోంది. తన పలుకుబడి విస్తరించుకుంటోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తాజాగా వచ్చిన అపరిమిత అధికారాల కారణంగా ఈ దూకుడు ఉన్నకొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గదు. అటు రష్యా కూడా కొత్త ఎత్తులు వేస్తోంది. చైనా, పాకిస్తాన్లతో అంటకాగడానికి ఉత్సాహపడుతోంది. ఈ పరిస్థి తుల్లో భారత్–ఫ్రాన్స్‌లు మరింత దగ్గరయ్యాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఇప్పటికే నిర్ణయించగా...ఫ్రాన్స్‌తో మన దేశానికి ఇప్పుడు కుదిరిన సైనిక దళాల సహకార ఒప్పందం దాన్ని మరింత పటిష్టపరుస్తుంది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం సహకరించుకోవడానికి, ఉమ్మడి విన్యాసాలకూ, శిక్షణకూ, విపత్తుల్లో సాయం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఫ్రాన్స్‌కు జిబౌతి, అబూ ధాబీ, రీయూనియన్ ఐలాండ్ వగైరాల్లో సైనిక స్థావరాలున్నాయి. మన దేశం కూడా సెషెల్స్, మారిషస్, ఒమన్లలో నావికా దళ సదుపాయాలను సమ కూర్చుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో ఇప్పుడు కుదిరిన ఒప్పందం తోడ్ప డుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక్కో దేశంతోనే సన్నిహి తమవుతూ భారత్ పలుకుబడిని తగ్గిస్తున్న చైనా పోకడలను నిలువరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇరు దేశాల నావికా దళాలూ ఒకరి స్థావరాలను మరొకరు వినియోగించుకునే సదుపాయం వల్ల ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రతకు భరోసా ఏర్పడుతుంది. సౌరశక్తి వినియోగంలో పరస్పర సహకారం పెంచుకుని శిలాజ ఇంధనాల అవసరాన్ని గణనీయంగా తగ్గించాలన్న సంకల్పంతో రెండు దేశాల చొరవతో ఇప్పటికే అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) ఏర్పడి పనిచేస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి దీన్ని మరింత సమర్ధవంతంగా వినియోగిం చాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. అలాగే రకరకాల ఆంక్షలతో ట్రంప్ అమెరికా తలుపులు మూస్తున్న తరుణంలో మన విద్యార్థులకూ, శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ ఫ్రాన్స్‌లో మెరుగైన అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్న మాక్రాన్ హామీ ఆశలు రేకెత్తిస్తుంది. ఫ్రాన్స్‌తో యూపీఏ హయాంలో 2012లో కుదిరిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపైనా, ఎన్డీఏ వచ్చాక ఆ యుద్ధ విమానాల కోసమే 2016లో కుదిరిన ఒప్పందంపైనా ఎన్ని వివాదాలు తలెత్తాయో అందరికీ గుర్తుంది. అప్పట్లో రూ. 1.34 లక్షల కోట్ల వ్యయంతో 126 విమానాలు కొనాలని యూపీఏ సర్కారు వాటిని ఉత్పత్తి చేసే డసాల్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 18 విమానాలను నేరుగా అందజేసి, మిగిలిన 108 విమానాలనూ బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేతా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తా మని అది హామీ పడింది. కానీ ఇక్కడ రేకెత్తిన వివాదాలు చూసి వెనక్కు తగ్గింది. నరేంద్ర మోదీ 2015లో ఫ్రాన్స్ పర్యటించినప్పుడు రాఫెల్ విమానాలు 36 కొనాలన్న ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఒక్కో విమానం విలువ దాదాపు రూ. 670 కోట్లు. యుద్ధ విమానాలకు సంబంధించి కుదిరిన ఒప్పందం బయట పెట్టాలని మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు ఆందోళన చేయగా యూపీఏ హయాంలో 2008లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా దాన్ని బయటపెట్టలేకపోతున్నామని ప్రభుత్వం జవాబిచ్చింది. దాని ప్రకారం ఏ ఒప్పందంలోని అంశాలనైనా రెండు దేశాలూ వెల్లడించకూడదు. పదేళ్లపాటు అమల్లో ఉండే ఆ క్లాజుకు మొన్న జనవరి 24తో కాలదోషం పట్టింది. కనుక రాఫెల్ ఒప్పందాన్ని వెల్లడించడానికి ఇకపై ఎలాంటి ఆటంకాలూ ఉండ వనుకునేలోగానే తాజాగా ఆ ‘గోప్యత’ క్లాజుకు రెండు దేశాలూ ప్రాణప్రతిష్ట చేశాయి. ఇది సహజంగానే ‘రాఫెల్’ చుట్టూ అల్లుకున్న వివాదాలను మరింత పెంచుతుంది. మొత్తానికి మాక్రాన్ పర్యటన ఇరు దేశాల సంబంధాలనూ మరింత ఉన్నత స్థితికి చేర్చింది. -
ఫ్రాన్స్ అధ్యక్ష పీఠంపై మేక్రన్
-
ఫ్రాన్స్ పీఠంపై మేక్రన్
► అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి లీ పెన్‌పై ఘన విజయం ► అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా.. ► ప్రపంచ దేశాధినేతల అభినందనలు పారిస్: యూరోపియన్ యూనియన్ అనుకూలవాది, స్వతంత్ర అభ్యర్థి ఇమ్మాన్యుయేల్ మేక్రన్(39) ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అతిపిన్నవయసులో అధ్యక్షుడిగా ఎన్నికై ఫ్రాన్స్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. తటస్థవాదిగా ముద్రపడ్డ మేక్రన్ విజయంతో ఫ్రాన్స్‌లోనే కాకుండా యూరప్‌లోనూ సంబరాలు మిన్నంటాయి. గతంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన మేక్రన్‌కు అంతగా రాజకీయానుభవం లేకపోయినా.. యూరప్ ఐక్యతే ప్రచారాస్త్రంగా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. మేక్రన్ 66.1 శాతం ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి లీపెన్ 33.9 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. బ్రిటన్ వైదొలగడం వల్ల ఈయూలో నెలకొన్న సంక్షోభం మేక్రన్ విజయంతో ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఈయూలో ఇక నుంచి ఫ్రాన్స్ కీలకపాత్ర పోషించేందుకు మార్గం సుగమమైనట్లే. దేశంలో స్వతంత్ర అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ఆధునిక ఫ్రాన్స్‌ను ఇంతవరకూ సోషలిస్టులు, సంప్రదాయ వాదులే పాలించారు. ఫ్రాన్స్ గెలిచింది: మేక్రన్ గెలుపు అనంతరం ఫ్రాన్స్ ప్రజల్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ.. ‘ఫ్రాన్స్ గెలిచింది. చాలామంది ఇది అసాధ్యమన్నారు. వారికి ఫ్రాన్స్ గురించి తెలియదు. విద్వేషపూరితంగా సాగిన ఎన్నికల ప్రచారంలో బయటపడ్డ సాంఘిక పరమైన విభజనల్ని ఈ ఐదేళ్లలో రూపుమాపుతాను. ఈ విభజన వల్ల కొందరు ఓటర్లు అతివాదం వైపు మొగ్గుచూపారు. నేను వారిని గౌరవిస్తా. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫ్రాన్స్‌లో ఈ రాత్రితో కొత్త అధ్యాయం మొదలైంది. ఇది ఆశ, విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది. యూరప్ ఐక్యతకు కృషి చేస్తా’అని చెప్పారు. మేక్రన్ గెలుపు ఖాయమవడంతో విజయాన్ని అధికారికంగా ప్రకటించకముందే ప్రత్యర్థి, అతివాద నాయకురాలు, మరీన్ లీ పెన్... ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పారిస్ వీధుల్లో సంబరాలు: మేక్రన్ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్ సర్వేలు ముందుగానే చెప్పడంతో ఆదివారం రాత్రి నుంచే పారిస్ వీధులు ఆయన మద్దతుదారులతో కిక్కిరిసిపోయాయి. గెలుపువార్త తెలియగానే పారిస్‌లోని లూరే మ్యూజియం వద్ద అర్ధరాత్రి వేలాది మంది మద్దతుదారుల సంబరాలు చేసుకున్నారు. ఫ్రాన్స్ జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలతో హోరెత్తించారు. ‘ఒడే టు జాయ్’ అంటూ యూరోపియన్ గీతాన్ని ఆలపిస్తూ మేక్రన్‌కు స్వాగతం పలికారు. ఫ్రాన్స్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం: మోదీ మేక్రన్ను పలువురు దేశాధినేతలు అభినందనలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ట్వీటర్లో అభినందనలు తెలిపారు. ‘మేక్రన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని, భవిష్యత్తులో భారత్ –ఫ్రాన్స్ సంబంధాల్ని బలోపేతం చేస్తా’మని మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీటర్లో పోస్ట్‌చేశారు. ఉగ్రవాదంపై రష్యా, ఫ్రాన్స్‌లు కలసికట్టుగా పోరాడాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిలషించారు. ఫ్రాన్స్ తమ మిత్ర దేశమని, మేక్రన్‌తో కలిసిపనిచేసేందు ఆసక్తిగా ఉన్నానంటూ బ్రిటన్ ప్రధాని థెరెసా మే పేర్కొన్నారు. ఈయూ ఆశలు! అమెరికా అధ్యక్ష ఎన్నికల మాదిరిగానే ఫ్రాన్స్‌లోనూ జాతీయవాద(అతివాద) అభ్యర్థి లీ పెన్ గెలుస్తారేమోననే ఆందోళనకు మేక్రన్ తెరదించారు. ఫ్రాన్స్‌లోకి వలసలతో పాటు ముస్లింలు, యూదులకు వ్యతిరేకంగా లీ పెన్ ప్రచారం నిర్వహించడంతో పాటు ఈయూ నుంచి ఫ్రాన్స్ వైదొలగాలనే వాదనకు మద్దతిచ్చారు. ట్రంప్ గెలుపు, బ్రెగ్జిట్తో తన గెలుపు ఖాయమని మరీన్ ఆశించగా ఫ్రాన్స్ ప్రజలు మాత్రం ఆమె విధానాల్ని తోసిపుచ్చారు. యూరప్ అనుకూల విధానాలతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు మేక్రన్ గట్టి మద్దతునిచ్చారు. దీంతో ఈయూ దేశాలు ఇప్పుడు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్(సోషలిస్ట్) ప్రభుత్వంలో మేక్రన్ రెండేళ్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి వైదొలిగారు. అయితే సోషలిస్ట్ విధానాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. గ్లోబలైజేషన్(ప్రపంచీకరణ)కు ఆయన గట్టి మద్దతుదారు. 2014–16 మ«ధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మేక్రన్ స్వేచ్చా ఆర్థిక విధానాలకు ప్రతిఘటన ఎదురైంది. ఆదివారాలు ఎక్కువ శాతం దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. ప్రభుత్వ అధీనంలోని రంగాల్లో తలుపులు బార్లా తెరిపించారు. కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసేలా నిబంధనలు మార్చారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఎన్ మార్చ్ అనే కొత్త ఉద్యమం ప్రారంభించాక... లెఫ్టిస్ట్, రైటిస్ట్‌గా కాకుండా తనను తటస్థవాదిగా మేక్రన్ ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వ వ్యయం తగ్గించడం సాధ్యమేనా? ప్రపంచ పారిశ్రామిక రంగంలో ఫ్రాన్స్‌ది ఇప్పటికీ కీలకపాత్రే. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఎక్కువ. ప్రభుత్వ వ్యయాన్ని ఏడాదికి 6,400 కోట్ల డాలర్ల చొప్పున తగ్గించడమేగాక, రిటైరైన వారి స్థానంలో నియామకాలు చేపట్టకుండా 1,20,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో మేక్రన్ ప్రకటించారు. ఈ మార్పులు అంత తేలికకాదు. జూన్‌లో రెండు దశల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మేక్రన్ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో అన్నది కీలకం. అక్కడ ఎక్కువ స్థానాలు సాధిస్తేనే మేక్రన్ ప్రతిపాదనలకు పార్లమెంటులో ఆమోదం లభిస్తుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్