జనవరి 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజుల భారతదేశ పర్యటనలో ఉన్నారు. ముందుగా జైపూర్ రోడ్ షోలో పాల్గొని కొండపై ఉన్న అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్ అబ్జర్వేటరీ హవా మహల్‌లను కూడా సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ గురువారం పింక్ సిటీ రోడ్‌షోలో నరేంద్రమో మోదీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లారు. నగరం నడిబొడ్డున చిన్న మార్గం గుండా పయనమవ్వుతూ ..తొలుత జంతర్‌మంతర్ నుంచి పప్రారంభమయ్యి అలా 18వ శతాబ్దపు ఖగోళ అబ్జర్వేటరీ వరకు సాగింది.
వారిద్దరూ వాహనంలో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ..ఆ మార్గంలో కనిపించేవారికి అభివాదం చెబుతూ సాగిపోయారు. ఇక మోదీ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం తదనంతరం జైపూర్‌లో చేసిన తొలి పర్యటన ఇది. ఇక ఆయ ప్రసిద్ధ ప్రదేశాలను సందరర్శించిన తదనంతరం ఇరువురు నాయకులు ఆ హవా మహల్ ముందు ఉన్న దుకాళంలో మసాల్ చాయ్ సిప్ చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఆ షాపు యజమానికి డిజటల్ చెల్లింపు చేసి భారత్‌లో ఇది ఎంత సర్వసాధారణం అన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు.
అంతేగాదు ఇక్కడకు వచ్చే సందర్శకులు ఇలా డిజిటల్ చెల్లింపులే చేస్తారని ప్రధాని మోదీ మాక్రాన్‌కు తెలియజేశారు. అంతేగాదు మోదీ మాక్రాన్ కోసం అక్కడే ఉన్న ఒక దుకాణంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఓ ప్రతిమను కూడా కొనుగోలు చేశారు. ఇక మోదీ గ్లోబల్ ఫోరమ్‌లలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామీగా ఉందని పదేపదే నొక్కి చెబుతుండేవారు. పైగా భారత్ డిజిటల్ పరివర్తన గురించి తన ప్రశంగంలో ప్రశంసిస్తుండేవారు కూడా. కాగా, మాక్రాస్ తిరుగు ప్రయాణంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ కొండపై పర్యాటక ప్రదేశంగా అలరారుతున్న అంబర్ కోటను కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియో తెగ నెట్టింట వైరల్ అవుతోంది.
#WATCH | Rajasthan: Prime Minister Narendra Modi and French President Emmanuel Macron visited a tea stall and interacted with each other over a cup of tea, in Jaipur.
— ANI (@ANI) January 25, 2024
French President Emmanuel Macron used UPI to make a payment. pic.twitter.com/KxBNiLPFdg
(చదవండి: ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ టెక్నిక్ ఫాలో అయితే త్వరగా చేసేయొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment