జైపూర్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు జైపూర్‌లో రోడ్ షో నిర్వహించారు. మాక్రాన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం జైపూర్ చేరుకున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఆయనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్ రాజ్ మిశ్రా స్వాగతం పలికారు. అటు.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా జైపూర్ చేరుకున్నారు. అనంతరం జైపూర్‌లో ఇద్దరూ రోడ్‌షో నిర్వహించారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించారు. ఈ పర్యటన తర్వాత మాక్రాన్, మోదీ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఫ్రెంచ్ ఆర్మీకి చెందిన బృందం సిద్ధమైంది. ఈ పర్యటనలో ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇక, ఫ్రాన్స్.. భారత్‌కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: నేడు భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. మోదీతో స్పెషల్ ప్రోగ్రామ్..
Comments
Please login to add a commentAdd a comment