వడోదర: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం గుజరాత్‌లోని వడోదర నగరానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌లు వడోదర నగరంలో ఓపెన్ జీపులో రోడ్‌షో నిర్వహించి, రోడ్డు పక్కన నిలుచున్న ప్రజలకు అభివాదం చేశారు.
వడోదర విమానాశ్రయం నుంచి నగరంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు 2.5 కి.మీ పొడవునా ఈ రోడ్ షో కొనసాగింది. అనంతరం ఇద్దరు ప్రధానులు టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. మోదీ శాంచెజ్‌లు 'టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్' సెంటర్‌కి వెళ్లినప్పుడు కళాకారులు వారికి ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సమావేశం కోసం లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు వెళ్లే ముందు ఇద్దరు నేతలు సంయుక్తంగా 'టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్' కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్‌ను సి-295 విమానాల తయారీ కోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ నిర్మించింది. వడోదరలోని ఈ కాంప్లెక్స్‌లో 40 విమానాలను తయారు చేయనున్నారు.
#WATCH | Vadodara, Gujarat: Prime Minister Narendra Modi, President of the Government of Spain, Pedro Sanchez hold a roadshow in Vadodara
The two leaders will inaugurate the Final Assembly Line Plant of C295 aircraft at Vadodara today
(Source: ANI/DD News) pic.twitter.com/bLO4N4o0G0— ANI (@ANI) October 28, 2024
భారతదేశంలో ఈ 40 విమానాలను తయారు చేసే బాధ్యత టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు అప్పగించారు. ఈ కాంప్లెక్స్ భారతదేశంలో సైనిక విమానాల కోసం మొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్. ఇందులో విమానాల తయారీ, వాటి భాగాలను అసెంబ్లింగ్ చేయడం, వాటిని పరీక్షించడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా విమానాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. కాగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను సందర్శించిన అనంతరం మోదీ అమ్రేలీకి వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2:45 గంటలకు దుధాలలో భారత్ మాతా సరోవరాన్ని ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: మల్టీ-అసెట్ ఫండ్స్‌తో దీపావళి కాంతులు
Comments
Please login to add a commentAdd a comment