సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని 'బి' బ్లాక్‌లో సోమవారం ఉదయం లిఫ్ట్ ఆగిపోవడంతో కాసేపు గందరగోళం చెలరేగింది. ముఖ్యమంత్రికి గృహ నిర్మాణ దరఖాస్తులు ఇచ్చేందుకు నగరంలోని మీర్జాలగూడ నుంచి వచ్చిన 26 మంది మహిళలు లిఫ్ట్ ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో మధ్యలో ఆగిపోయింది. దీంతో కంగారుపడ్డ మహిళలు తలుపులు కొడుతూ రక్షించండి అంటూ పెద్దగా అరిచారు. వెంటనే స్పందించిన జీఏడీ అధికారిణి పద్మజ సంబంధిత టెక్నికల్ సిబ్బందిని పిలిపించి లిఫ్ట్ తలుపులు తెరుచుకునేలా చేశారు.