
సాక్షి, విజయవాడ: టీడీపీ, బీజేపీ మధ్య టిక్కెట్ల దోబూచులాట కొనసాగుతోంది. బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్ధానాలు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు ఎంపీ స్ధానాలను చంద్రబాబు పెండింగ్‌లో ఉంచగా, రాజమండ్రి, ఒంగోలు, రాజంపేట, అనంతపురం, కడప స్ధానాల విషయంలో టీడీపీలో అయోమయం నెలకొంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్ధానాలు పెండింగ్‌లో పెట్టగా, ఈ రెండింటిలో ఒక స్ధానం నుంచి పోటీ చేయడానికి పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట లేదా అనంతపురం స్దానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నిస్తున్నారు. వెంకయ్యనాయుడు పీఏగా సుదీర్ఘ కాలం పనిచేసి.. వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ కొనసాగుతున్నారు.
బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్‌లో ఉంచారు. కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల కోసం కడప స్ధానాన్ని చంద్రబాబు పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment