స్థిర నివాసానికైతే పూర్తయినవే బెటర్ | confusion in buyers to buy constructing or completed | Sakshi
Sakshi News home page

స్థిర నివాసానికైతే పూర్తయినవే బెటర్

Published Sat, Oct 19 2013 9:14 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM

కొనుగోలుదారుల్లో ఇదే తర్జనభర్జన - Sakshi

కొనుగోలుదారుల్లో ఇదే తర్జనభర్జన

 గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా? నిర్మాణం జరుగుతున్న వాటిలో తీసుకోవాలా? కొనుగోలుదారుల్లో ఇదే తర్జనభర్జన. బయట చూస్తేనేమో పండగ వాతావరణం. కానీ, మూడు నెలలుగా మార్కెట్ పరిస్థితులేమో వెనుకడుగు వేయిస్తున్నాయి. సొంతిల్లు కొనాలన్న కోరిక గట్టిగా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయలేనివారిలో మీరూ ఉన్నారా? పండగ సమయంలో ఇలాంటి వారికున్న సందేహాలను నివృత్తి చేసేందుకు పలువురు నిర్మాణరంగ నిపుణులతో ‘సాక్షి రియల్టీ’ మాట్లాడింది. వారి సూచనల సమాహారమే ఈ కథనం..

సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకున్నప్పటికీ కొన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకసారి స్థానిక రాజకీయాంశం. మరోసారి నిర్మాణ సామాగ్రి కష్టాలు. ఇంకోసారి కార్మికులు దొరక్క ఇబ్బందులు. ఇలా రకరకాల సమస్యలతో హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఇబ్బందిపడుతోంది. దాని ప్రభావం నిర్మాణ పనులపై పడుతుండగా... కొందరు బిల్డర్లు మాత్రం కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాట్లను కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. రెండు మూడేళ్లుగా ఇలాంటి ధోరణి కొందరు బిల్డర్లలో ఎక్కువవుతోంది.
 * గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోస్తే సొంతింట్లోకి అడుగు పెట్టేదెన్నడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూడటం తప్ప ఏమీ చేయలేం. అందుకని పది, పదిహేను నిర్మాణాలు చూసి, ప్రతి అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంచుకున్నాకే సొమ్ము చెల్లించాలి.

స్థిర నివాసమా?
స్థిర నివాసం కోసమైతే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లో కొంటేనే బెటర్. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోలిస్తే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువ. అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు కూడా. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు.

డిసెంబర్‌లోగా నగరంలో పూర్తి కానున్న కొన్ని ప్రాజెక్టులివిగో...
 *    బొల్లారంలో ఆర్క్ హోమ్స్. ఖాళీల సంఖ్య: 70. ధర చ.అ.: రూ. 2,049.
 *    మేడిపల్లిలో హరే రాం రెసిడెన్సీ. ఖాళీల సంఖ్య: 20. ధర రూ. 26 లక్షలు
 *    పీఅండ్ టీ కాలనీలో మాధవ రెసిడెన్సీ. ఖాళీల సంఖ్య: 5. ధర రూ. 25.50 లక్షలు
 *    ఉప్పల్‌లో మేఘన రెసిడెన్సీ. ఖాళీల సంఖ్య: 20. ధర రూ. 32.50 లక్షలు
 *    మూసాపేటలో రెయిన్‌బో విస్టాస్. ఖాళీలు:25. ధర 2 బీెహ చ్‌కే-రూ. 50లక్షలు, 3 బీహెచ్‌కే-రూ. 65 లక్షలు
 *    గచ్చిబౌలిలో ఆర్వీ శిల్పహిల్ టాప్. ఖాళీల సంఖ్య: 12. ధర చ.అ. రూ. 4,000
 *    సుచిత్ర సర్కిల్‌లో ఆర్వీ ఆద్విక్. ఖాళీల సంఖ్య: ‘అముక్త’ బ్లాక్‌లో 21. ధర చ.అ. రూ. 2,400
 *    అల్మాస్‌గూడలో శ్రీ శ్రీ హోమ్స్. ఖాళీల సంఖ్య: 15. ధర  రూ. 25- 30 లక్షలు
 *    పద్మారావ్‌నగర్‌లో హార్మోనీ హైట్స్. ఖాళీల సంఖ్య: 15. ధర చ.అ. రూ. 3,750
 *    బోయిన్‌పల్లిలో శాటిలైట్ టౌన్‌షిప్. ఖాళీల సంఖ్య: 15. ధర చ.అ. రూ. 2,500
 *    మోతీనగర్‌లో జనప్రియ మెట్రోపొలిస్. ఖాళీలు 50. ధర చ.అ.రూ. 3,220
పెట్టుబడి కోణమా..?
పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కానీ మొదట స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి. నిర్మాణ పనులు మొదలైన, ఆరంభ దశలో ఉన్న ఇళ్ల ధరలు గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటికంటే కనీసం 20 నుంచి 25 శాతం తక్కువకు వస్తాయన్న విషయం గమనించాలి.

హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కొన్ని..
బండ్లగూడలో 40 ఎకరాల్లో ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ ‘ఎస్‌ఎంఆర్ వినయ్ హార్మోనీ కౌంటీ’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఫేజ్-1లో భాగంగా 5 ఎకరాల్లో 14 అంతస్తుల్లో, రెండు బ్లాకుల్లో మొత్తం 407 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. చదరపు అడుగు ధర రూ. 3 వేలుగా నిర్ణయించారు. 24 నెలల్లో తొలి దశను పూర్తి చేస్తామని సంస్థ సీఎండీ ఎస్ రాంరెడ్డి చెప్పారు. 500 చ.అ. సింగిల్ బెడ్ రూమ్ నుంచి 2,050 చ.అ. విస్తీర్ణం గల త్రిబుల్ బెడ్ రూమ్ వరకు ఫ్లాట్లుంటాయి. సింగిల్‌బెడ్ ఫ్లాట్ ధర రూ.15 లక్షల లోపు ఉంటుంది. 2, 3 ఫేజ్‌ల్లో ఎక్కువ ఫ్లాట్లు మధ్యతరగతి ప్రజల కోసమే కేటాయిస్తున్నారు.

విజయదశమి రోజున ఏవీ కన్‌స్ట్రక్షన్స్ మేడిపల్లి హైవే రోడ్డుపై రెండున్నర ఎకరాల్లో ‘ఏవీ ఇన్ఫో ప్రైడ్’ పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొత్తం 210 ఫ్లాట్ల వచ్చే ఈ ప్రాజెక్ట్‌లో చ.అ. ధర రూ. 2,500లుగా నిర్ణయించామని సంస్థ ఎండీ జే. వెంకట్‌రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement