‘‘జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను. అంతే కానీ ఫెమినిస్ట్ (స్త్రీవాది) అని చెప్పుకోను’’ అంటున్నారు బాలీవుడ్ నటి కరీనా కపూర్. ఫెమినిజం అంటే స్త్రీ, పురుషుల సమానత్వం కోరుకోవడం అని అర్థం. కానీ ఈ మధ్య ఫెమినిజం అంటే మెన్‌ని హేట్ చేయడం అని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘వీరి దే వెడ్డింగ్’. ఈ సినిమా ప్రమోషన్‌లో ఫెమినిజం గురించి కరీనా మాట్లాడుతూ – ‘‘నేను ఫెమినిస్ట్ అని చెప్పకోను. జెండర్ ఈక్వాలిటీ నమ్ముతాను. నేను ఓ ఉమెన్. దీనికంటే ముందు ఒక హ్యూమన్ బీయింగ్‌ని. కరీనా కపూర్‌గా గుర్తించినా, సైఫ్ భార్య అని సంభోదించినా ప్రౌడ్‌గానే ఫీల్ అవుతాను. స్టైల్ కోసం ఫెమిసిస్ట్ అని చెప్పుకోవటం కంటే సగటు స్త్రీకి ఉపయోగపడే పనులు చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు కరీనా. ‘వీరి దే వెడ్డింగ్’ జూన్ 1న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment